



Best Web Hosting Provider In India 2024
4 నగరాలను కలుపుతూ దక్షిణ భారతదేశంలో బుల్లెట్ రైలు.. లిస్టులో హైదరాబాద్, అమరావతి!
దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన 4 నగరాలను కలుపుతూ బుల్లెట్ రైలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇందుకోసం సర్వే కూడా జరగనుంది. ఈ నాలుగు నగరాల్లో హైదరాబాద్, అమరావతి కూడా ఉన్నాయి.
దేశంలో బుల్లెట్ రైలు నెట్‌వర్క్‌ను విస్తరించే దిశగా ప్రభుత్వం వేగంగా కృషి చేస్తోంది. దక్షిణ భారతదేశంలో బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం సర్వేకు ఆదేశాలు వెళ్లినట్టుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ప్రతిపాదిత బుల్లెట్ రైలు నెట్‌వర్క్ దక్షిణ భారతదేశంలోని నాలుగు ప్రధాన నగరాల గుండా వెళ్తుంది. అవి ఏంటంటే.. హైదరాబాద్, చెన్నై, అమరావతి, బెంగళూరు నగరాలను కలుపనున్నట్టుగా చంద్రబాబు నాయుడు చెప్పారు.
‘దక్షిణ భారతదేశానికి బుల్లెట్ రైలు అతి త్వరలో రాబోతోంది. దీని కోసం ఒక సర్వేకు ఆదేశాలు వెళ్లాయి. హైదరాబాద్, చెన్నై, అమరావతి, బెంగళూరు.. నగరాల్లో చాలా జనాభా ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్.’ అని చంద్రబాబు అన్నారు.
మరోవైపు శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ కూడా రైలు నెట్‌వర్క్ గురించి మాట్లాడారు. జపనీస్ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 7,000 కి.మీ. పొడవైన హై-స్పీడ్ రైలు నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయాలని భారతదేశం లక్ష్యంగా పెట్టుకుంది. ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైలు ప్రాజెక్ట్ పురోగతిలో ఉంది. మాకు ఇంకా పెద్ద కల ఉంది. దేశవ్యాప్తంగా 7,000 కి.మీ. హై-స్పీడ్ రైలు నెట్‌వర్క్‌ను నిర్మించాలి. రాబోయే కొన్ని సంవత్సరాలలో ముంబై-అహ్మదాబాద్ కారిడార్‌లో ప్రయాణికుల సేవలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.’ అని నరేంద్ర మోదీ అన్నారు.
ఇప్పటికే అనేక హై-స్పీడ్ రైలు కారిడార్ల గురించి ప్రతిపాదన ఉంది. వీటిలో ఢిల్లీ-వారణాసి, ఢిల్లీ-అహ్మదాబాద్, ముంబై-నాగ్‌పూర్, ముంబై-హైదరాబాద్, చెన్నై-మైసూర్, ఢిల్లీ-అమృత్‌సర్, వారణాసి-హౌరా వంటి మార్గాలు ఉన్నాయి. శుక్రవారం రోజు ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ రాజధాని టోక్యో నుండి సెండాయ్‌కు బుల్లెట్ రైలులో ప్రయాణించారు. జపాన్ ప్రధాని షిగేరు ఇషిబా కూడా ఆయనతోపాటు ఉన్నారు.
Best Web Hosting Provider In India 2024
Source link