ఎల్లుండి మరో అల్పపీడనం..! ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన – భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం

Best Web Hosting Provider In India 2024

ఎల్లుండి మరో అల్పపీడనం..! ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన – భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం

Maheshwaram Mahendra Chary HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Maheshwaram Mahendra Chary HT Telugu

తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్ ఇచ్చింది. ఎల్లుండి వాయువ్య బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ ప్రభావంతో మరికొన్ని రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే సూచనలున్నాయి.

ఏపీ, తెలంగాణకు వర్ష సూచన

పశ్చిమ బెంగాల్-ఒడిశా తీరాలకు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. సముద్ర మట్టానికి సగటున 1.5, 5.8 కి.మీ ఎత్తులో ఈ ఆవర్తనం కొనసాగుతుందని వాతావరణశాఖ తెలిపింది. అంతేకాకుండా…. ఎల్లుండి వాయువ్య బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో మళ్లీ తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడనున్నాయి.

ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం ప్రభావంతో ఏపీలో మూడు నాలుగు రోజుల పాటు అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఈ మేరకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటన విడుదల చేసింది.

ఎల్లో హెచ్చరికలు జారీ…

ఇక తెలంగాణలో కూడా మరికొన్ని రోజులు వర్షాలు పడే అవకాశం ఉంది. ఇవాళ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, భూపాలపల్లి, మలుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మరికొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చు. ఈ ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

రేపు(సెప్టెంబర్ 1) ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లోని పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మరికొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడొచ్చు.

ఎల్లుండి ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కొత్తగూడెం, కామారెడ్డి జిల్లాల్లోని పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈ మేరకు ఎల్లో హెచ్చరికలును జారీ చేసింది.

భద్రాచలం వద్ద వరద ఉద్ధృతి:

మరోవైపు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 48 అడుగులకు చేరుకోవడంతో రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. ఉదయం 9 గంటలకు నది ప్రమాద స్థాయికి చేరుకుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు.

గోదావరి ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ముంపు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. పునరావాసం కోసం అవసరమైన చర్యలు తీసుకున్నామని, అవసరమైతే మరిన్ని పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారని కలెక్టర్ తెలిపారు.

ప్రజలకు తాగునీరు, ఆహారం, వైద్య సేవలు, విద్యుత్ సరఫరా వంటి కనీస సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూడాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ, పోలీసు, ఆరోగ్య, పంచాయతీరాజ్, మున్సిపల్, విద్యుత్ తదితర శాఖల అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. గోదావరిలో స్నానాలకు వెళ్లొద్దని, బోటు ప్రయాణాలను పూర్తిగా నిషేధించామని అధికారులు తెలిపారు.

Maheshwaram Mahendra Chary

TwittereMail
మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

టాపిక్

WeatherImdImd AlertsTs RainsAp RainsBhadrachalamGodavari Floods
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024