




Best Web Hosting Provider In India 2024

టీటీడీకి భారీ విరాళాలు – ఇవాళ ఒక్కరోజే బర్డ్ ట్రస్టుకు రూ.4 కోట్లు
టీటీడీ ఆధ్వర్యంలో నడిచే బర్డ్ ట్రస్ట్ కు భారీ విరాళాలు వచ్చాయి. హైదరాబాద్ కు రెండు సంస్థలు రూ.4 కోట్లకు పైగా విరాళం ప్రకటించాయి. ఇందుకు సంబంధించిన డీడీలను టీటీడీకి అందజేశాయి.
టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న బర్డ్ ఆస్పత్రికి భారీ విరాళాలు వచ్చాయి.హైదరాబాద్ కు చెందిన రెండు కంపెనీలు ఆదివారం రూ.4 కోట్లకు పైగా విరాళం ఇచ్చాయి.
తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసిన పత్రికా ప్రకటన వివరాల ప్రకారం…. హైదరాబాద్ కు చెందిన ఆర్.ఎస్.బి రీటైల్ ఇండియా లిమిటెడ్ సంస్థ టీటీడీ బర్డ్ ట్రస్టుకు రూ.2,92,91,840 (రూ.2.93 కోట్లు) ను విరాళంగా అందించింది. అదేవిధంగా ఆర్.ఎస్.బ్రదర్స్ జ్యూవెలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ టీటీడీ బర్డ్ ట్రస్ట్ కు రూ.1.10 కోట్లు విరాళంగా అందించింది.
శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో డీడీ పత్రాలను… టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరికి అందజేశారు.
ఇక నరసరావుపేటకు చెందిన మరో భక్తుడు శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా ఇచ్చారు. ప్రపంచంలోనే అత్యంత ధనిక హిందూ పుణ్యక్షేత్రంగా పేరొందిన తిరుమలలోని శ్రీవేంకటేశ్వర ఆలయాన్ని టీటీడీ నిర్వహిస్తోంది.
సెప్టెంబర్ 7న ఆలయం మూసివేత:
చంద్రగ్రహణం కారణంగా సెప్టెంబర్ 7వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయం మూసివేయనున్నారు. ఆరోజు సాయంత్రం 3.30 నుంచి మరుసటిరోజు తెల్లవారుజామున అనగా సెప్టెంబర్ 8వ తారీఖు 3 గంటల వరకు ఆలయాన్ని సుమారు 12గం పాటు మూసివేయనున్నారు. ఈ మేరకు టీటీడీ ప్రకటన విడుదల చేసింది.
సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం రాత్రి 9.50 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై సెప్టెంబర్ 8న సోమవారం వేకువజామున 1.31 గంటలకు పూర్తవుతుంది. సాధారణంగా గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీ.
సెప్టంబర్ 8న ఉదయం 3 గంటలకు సుప్రభాతంతో ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహిస్తారు. అనంతరం తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నారు. కాగా ఉదయం 6 గంటలకు శ్రీవారి దర్శనం భక్తులకు పునః ప్రారంభవుతుంది.
సంబంధిత కథనం
టాపిక్