




Best Web Hosting Provider In India 2024

అసెంబ్లీ సమావేశాలు : కాళేశ్వరంలోని 3 బ్యారేజీలు 20 నెలలుగా నిరుపయోగంగా మారాయి – మంత్రి ఉత్తమ్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ నివేదికపై మంత్రి ఉత్తమ్ కుమర్‌రెడ్డి సభలో చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ లోని లోపాలతో పాటు కమిషన్ లోని పలు అంశాలను ప్రస్తావించారు.
అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్
తెలంగాణ శాసనసభ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. కీలకమైన కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ ప్రారంభమైంది. ముందుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రసంగించారు. ప్రధానంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలో లోపాలు ఉన్నాయని చెప్పారు. మేడిగడ్డలో పూర్తి నీరు నిల్వ చేసి కూలిపోయేందుకు కారణమయ్యారని ప్రస్తావించారు.
మంత్రి ఉత్తమ్ ప్రసంగం – ముఖ్యమైన పాయింట్లు
- తెలంగాణ ఏర్పడ్డాక అతిపెద్ద ప్రాజెక్టుగా కాళేశ్వరంను మొదలుపెట్టారు. రూ.87,449 కోట్లతో నిర్మాణం చేపట్టారు. ప్రాజెక్టుకు గుండెకాయ అయిన మేడిగడ్డ కుంగింది.
- కాళేశ్వరం కోసం ప్రాణహిత – చేవేళ్ల ప్రాజెక్ట్ ను పూర్తిగా పక్కనపెట్టారు. నిపుణుల కమిటీ నివేదికను పట్టించుకోకుండా ముందుకెళ్లారు.
- రూ.21 వేల కోట్లతో కట్టిన మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలను నిర్మించారు. 20 నెలలుగా మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు నిరుపయోగంగా ఉన్నాయి.
- ప్రాణహితపై 2014 నాటికే రూ.10 వేల కోట్లకు పైగా ఖర్చు చేశాం. కానీ ఎలాంటి కారణాలు లేకుండానే… కాళేశ్వరం ప్రాజెక్ట్ ను తెరపైకి తీసుకొచ్చారు.
- వాప్కోస్ రిపోర్ట్ కంటే ముందే మేడిగడ్డ దగ్గర బ్యారేజీ కట్టాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. వాప్కోస్ రిపోర్ట్ ఇచ్చినరోజే మేడిగడ్డ దగ్గర బ్యారేజీ నిర్మించాలని ఆదేశించింది. ఏడాది 195TMCల నీళ్లను ఎత్తిపోస్తామని చెప్పారు. ఐదేళ్లు కలిపి 125TMC నీళ్లను మాత్రమే ఎత్తిపోశారు.
- ఇందులో 35 TMCల నీళ్లను సముద్రంలోకి వదిలిపెట్టారు. లక్షకోట్లతో కట్టిన ప్రాజెక్టుతో ఐదేళ్లలో వాడుకున్న నీళ్లు 101 TMCలు మాత్రమే
- ప్రాణహిత -చేవెళ్ల డిజైన్లను అప్పటి సీఎం మార్చారని కమిటీ చెప్పింది. మేడిగడ్డలో బ్యారేజీ నిర్మించవద్దని వ్యాప్కోస్ నిపుణులు కూడా ప్రస్తావించింది.
- రూ.38వేల కోట్లతో పూర్తయ్యే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును పక్కన పెట్టి.. రూ.1.47లక్షల కోట్లతో కాళేశ్వరం మొదలుపెట్టారు.
- సభ నిర్ణయం మేరకే కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్యలుంటాయి. ఎలాంటి కక్షసాధింపులు ఉండవు.
- ప్రతిపక్ష పార్టీ అభిప్రాయాల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతారు. కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారనే దానిపై నిర్ణయం ప్రకటిస్తారు.
సంబంధిత కథనం
టాపిక్
Kaleshwaram ProjectTelangana NewsUttam Kumar ReddyMedigadda Barrage
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.