




Best Web Hosting Provider In India 2024

ఈ ఫార్ములాలు ఎందుకు? కాన్సెప్ట్ చాలు.. ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ ఫిల్మ్.. అవసరాల శ్రీనివాస్ లెక్కల మాస్టర్
సండే స్పెషల్ గా మరో ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ ఓటీటీలోకి వచ్చేసింది. మ్యాథ్స్ అంటే భయపడే ఓ అమ్మాయి స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గా ఎలా ఎదిగిందనే కథతో ఈ ఫిల్మ్ వచ్చింది. ఇందులో అవసరాల శ్రీనివాస్ లీడ్ రోల్ ప్లే చేశాడు.
ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ వచ్చేసింది. సండే స్పెషల్ గా ఈ రోజు (ఆగస్టు 31) నుంచే డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. విలక్షణ నటుడు అవసరాల శ్రీనివాస్ లీడ్ రోల్ ప్లే చేశాడు. లెక్కల మాస్టర్ గా నటించాడు. మ్యాథ్స్ అంటే భయపడే ఓ స్టూడెంట్ స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గా ఎలా ఎదిగిందనే కథతో ఈ ఫిల్మ్ తెరకెక్కింది.
ఏ ఓటీటీలో?
ఈటీవీ విన్ ఓటీటీలో ప్రతి ఆదివారం కథా సుధాలో భాగంగా ఓ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. సండే ఒక్కో షార్ట్ ఫిల్మ్ డిజిటల్ స్ట్రీమింగ్ కు వస్తూనే ఉంది. ఈ సండే ‘లెక్కల మాస్టర్’ ఓటీటీలో రిలీజైంది. ఈ షార్ట్ ఫిల్మ్ లో అవసరాల శ్రీనివాస్, సహస్ర శ్రీ, సుమశ్రీ మదిర కీలక పాత్రలు పోషించారు.
కథ ఏమిటంటే?
సహస్రకు చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ అంటే భయం. ఫార్ములాలు, లెక్కలు అంటే వణికిపోయేది. కానీ ఆ స్కూల్ కు లెక్కల టీచర్ గా మల్లిఖార్జున్ ప్రసాద్ (అవసరాల శ్రీనివాస్) వస్తాడు. మ్యాథ్స్ అంటే ఉండే భయాన్ని తొలగిస్తాడు. లెక్కలు అంటే ఈజీ అని చెప్తాడు. ఫార్ములాలు బట్టి పట్టడం కాదు కాన్సెప్ట్ నేర్చుకుంటే ఈజీ అని మ్యాథ్స్ నేర్పిస్తాడు మల్లిఖార్జున్.
అంతర్జాతీయ ఒలింపియాడ్
సహస్ర పేరును అంతర్జాతీయ ఒలింపియాడ్ కు పంపిస్తాడు మల్లిఖార్జున్ ప్రసాద్. కానీ ఆడపిల్లకు చదువులెందుకు? ఇంట్లో పనులు నేర్చుకుంటే చాలనే మాటలు వినిపిస్తాయి. వీటన్నింటినీ దాటి మ్యాథ్స్ టీచర్ స్ఫూర్తితో సహస్ర లెక్కలపై భయం పొగొట్టుకుంటుంది. మ్యాథ్స్ పై ప్రేమ పెంచుకుంటుంది. స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ స్థాయికి ఎదుగుతుంది. ఆమె తిరిగి తన పాత స్కూల్ కు వచ్చినప్పుడు గుర్తు తెచ్చుకునే జ్ణాపకాలతో ఈ షార్ట్ ఫిల్మ్ సాగుతుంది.
లెక్కల మాస్టర్ షార్ట్ ఫిల్మ్ కు శ్రీకాంత్ దేవరకొండ డైరెక్టర్. ఈటీవీ విన్ దీన్ని ప్రొడ్యూస్ చేసింది. ఈ షార్ట్ ఫిల్మ్ కు రాకేశ్ వెంకటాపురం మ్యూజిక్ డైరెక్టర్.
ప్రతి సండే
ఈటీవీ విన్ లో కథా సుధాలో భాగంగా ప్రతి సండే ఓ కొత్త షార్ట్ ఫిల్మ్ వస్తూనే ఉంది. ప్రేమంటే ఇది కదా, ఏవి అలనాటి ముద్దులు, నగుమోము కనలేని, మేమిద్దరం, థ్యాంక్యూ నాన్న, దొరికిన ప్రేమ లేఖ, దొరకు సెల్ ఫోన్ వచ్చింది, ప్రేమ ఎక్కడ నీ చిరునామా లాంటి షార్ట్ ఫిల్మ్స్ వరుసగా ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చాయి.
సంబంధిత కథనం