నీ బర్త్‌ డేను మొదటి సారి మిస్ అవుతున్నాను- కొడుకు పుట్టిన రోజున మహేశ్ బాబు స్వీట్ నోట్- 19 ఏళ్ల కుర్రాడిలా సూపర్ స్టార్

Best Web Hosting Provider In India 2024

నీ బర్త్‌ డేను మొదటి సారి మిస్ అవుతున్నాను- కొడుకు పుట్టిన రోజున మహేశ్ బాబు స్వీట్ నోట్- 19 ఏళ్ల కుర్రాడిలా సూపర్ స్టార్

Sanjiv Kumar HT Telugu

సూపర్ స్టార్ మహేశ్ బాబు తన కుమారుడు గౌతమ్ ఘట్టమనేనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వీట్ నోట్ రాసుకొచ్చారు. తొలిసారిగా కొడుకు బర్త్ డే మిస్ అవుతున్నట్లు ట్వీట్‌లో తెలిపారు మహేశ్ బాబు. ఇప్పుడు ఆ ట్వీట్, దానితో షేర్ చేసిన మహేశ్ బాబు గౌతమ్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నీ బర్త్‌ డేను మొదటి సారి మిస్ అవుతున్నాను- కొడుకు పుట్టిన రోజున మహేశ్ బాబు స్వీట్ నోట్- 19 ఏళ్ల కుర్రాడిలా సూపర్ స్టార్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తన కుమారుడు గౌతమ్ పుట్టినరోజు సందర్భంగా ఓ స్పెషల్ నోట్ షేర్ చేశారు. గౌతమ్ చిన్నప్పుడు తీసిన ఓ త్రో బ్యాక్ ఫొటోను ట్విటర్‌లో షేర్ చేస్తూ తన బర్త్ డేను మిస్ అవ్వడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. ఈ సందర్ంగా గౌతమ్ ఘట్టమనేనికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు మహేశ్ బాబు.

ఇదే తొలిసారి

“హ్యాపీ 19 మై సన్. ప్రతి సంవత్సరం నువ్ నన్ను కొంచెం ఆశ్చర్యపరుస్తావ్. కానీ, ఈ ఏడాది నీ బర్త్‌డేను మిస్ అవుతున్నాను. ఇదే తొలిసారి నేను ఇలా మిస్ అవడం. నువ్ వేసే ప్రతి అడుగులో నా ప్రేమ నీతోనే ఉంటుంది. నువ్వు చేసే ప్రతి పనిలోనూ నీకు మద్దతుగా నా ప్రేమ ఉంటుంది. ఇలాగే వెలుగొందుంతూ నువ్ పెరగాలని కోరుకుంటున్నా” అని మహేశ్ బాబు స్వీట్ నోట్ రాసుకొచ్చారు.

ఎంతలా మిస్ అవుతున్నారో

ఈ ట్వీట్‌లో ఎన్నో లవ్, కిస్, హగ్ ఎమోజీస్ ఉన్నాయి. ఆ అక్షరాలు, ఎమోజీస్‌ను బట్టి కొడుకు గౌతమ్‌పై మహేశ్ బాబుకు ఉన్న ప్రేమ ఏంటో తెలియజేస్తుంది. అలాగే, ఆయన గౌతమ్ బర్త్‌డేను ఎంతలా మిస్ అవుతున్నారో చెబుతోంది. ఇప్పుడు మహేశ్ బాబు ట్వీట్, షేర్ చేసిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

స్టైలిష్‌గా మహేశ్ బాబు

ఆ ఫొటోలో గౌతమ్ హైడ్రాలిక్ బొల్లార్డ్‌పై నిల్చుని ఉన్నాడు. గౌతమ్‌ పడిపోకుండా మహేశ్ బాబు పట్టుకుని నిలబడ్డారు. గౌతమ్ క్యూట్‌గా కనిపిస్తుంటే మహేశ్ బాబు క్యాప్ పెట్టుకుని స్టైలిష్‌గా అట్రాక్ట్ చేశారు. ఇక మహేశ్ బాబు ఫ్యాన్స్ కూడా గౌతమ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

19 ఏళ్ల కుర్రాడిలా మహేశ్

‘హ్యాపీ బర్త్ డే గౌతమ్ బాబు’ అని ఓ అభిమాని రాసుకొచ్చాడు. ‘హ్యాపీ బర్త్ డే టు గౌతమ్ బబాబు. మీరు (మహేశ్ బాబు) ఇక్కడ 19 ఏళ్ల వయసు కుర్రాడిలా కనిపిస్తున్నారు’ అని మరొకరు ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే, న్యూయార్క్ యూనివర్సిటీలో యాక్టింగ్‌లో గౌతమ్ శిక్షణ తీసుకుంటున్నట్లు సమాచారం.

న్యూయార్క్ యూనివర్సిటీలో

ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్‌లో గత ఏడాది పాఠశాల విద్యను పూర్తి చేసిన గౌతమ్ న్యూయార్క్ యూనివర్సిటీలో చేరి నాలుగేళ్ల డ్రామా కోర్సు చేస్తున్నాడు. మహేశ్ బాబు కుమార్తె సితార ఘట్టమనేని కూడా నటనతో మెప్పిస్తోంది. ఇదివరకే కొన్ని యాడ్స్‌లో నటించి అట్రాక్ట్ చేసింది.

రాజమౌళి సినిమాతో

గౌతమ్ ఇదివరకే తెలుగులో అరంగ్రేట్రం చేసిన విషయం తెలిసిందే. మహేశ్ బాబు-సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన వన్ నేనొక్కడినే సినిమా‌తో గౌతమ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక మహేశ్ బాబు ప్రస్తుతం రాజమౌళి ఎస్ఎస్ఎంబీ29 సినిమాతో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024