జీ5 ఓటీటీలోని ఈ రివేంజ్ థ్రిల్లర్లు చూశారా? అదిరిపోయే సస్పెన్స్.. ఉత్కంఠ రేపే స్టోరీలు.. ఓ లుక్కేయండి

Best Web Hosting Provider In India 2024

జీ5 ఓటీటీలోని ఈ రివేంజ్ థ్రిల్లర్లు చూశారా? అదిరిపోయే సస్పెన్స్.. ఉత్కంఠ రేపే స్టోరీలు.. ఓ లుక్కేయండి

ఓటీటీలో రివేంజ్ థ్రిల్లర్లకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అలాంటి బెస్ట్ రివేంజ్ థ్రిల్లర్లు జీ5 ఓటీటీలో ఉన్నాయి. ఈ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లో ఉన్న ఈ టాప్ రివేంజ్ థ్రిల్లర్లపై ఓ లుక్కేయండి.

ఓటీటీలో రివేంజ్ థ్రిల్లర్లు (x)

ఓటీటీలో రివేంజ్ థ్రిల్లర్లు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తూనే ఉంటాయి. ఈ తరహా మూవీస్, సిరీస్ లకు ఫ్యాన్ బేస్ ఎక్కువే. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో ఉన్న ఇలాంటి బెస్ట్ రివేంజ్ థ్రిల్లర్లపై ఓ లుక్కేయండి. ఇందులో సిరీస్ లు, సినిమాలున్నాయి. మలయాళం, హిందీ, తెలుగు భాషల్లోని ఈ థ్రిల్లర్లు ఏంటో చూసేయండి.

నరివెట్ట

మలయాళం యాక్షన్ థ్రిల్లర్ ‘నరివెట్ట’. ఈ మూవీ రివేంజ్ థ్రిల్లర్ కూడా. మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటించిన ఈ మూవీ జీ5 ఓటీటీలో సత్తాచాటుతోంది. ఓ గిరిజన గూడెంలో తన తోటి పోలీస్ ఒకరు కనిపించకుండా పోతారు. అతణ్ని వెతుక్కుంటూ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ అయిన హీరో వెళ్తాడు. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత అమాయక గిరిజన ప్రజలపై అధికారం జులూం చూస్తాడు. అడవిలోని గిరిజన గూడెంను ఖాళీ చేయించాలనే పన్నాగాన్ని పసిగడతాడు. తన సొంత పోలీస్ డిపార్ట్మెంట్ తనపై పగ పడుతుంది. మరి ఆ తర్వాత హీరో ఎలా రివేంజ్ తీర్చుకున్నాడన్నదే ఈ మూవీ స్టోరీ. ఇది తెలుగులోనూ అందుబాటులో ఉంది.

మహారాణి

హ్యూమా ఖురేషీ, అమిత్ సియాల్, సోహుమ్ షా తదితరులు నటించిన రివేంజ్ థ్రిల్లర్ సిరీస్ ‘మహారాణి’. అన్యాయంగా అధికార కుట్రలకు బలైపోయిన రాణి కథ ఇది. ఈ సీజన్ 3లో రాణి తనకు న్యాయం జరిగేలా ఎలాంటి ప్లాన్ వేసింది? రివేంజ్ ఎలా తీర్చుకుందన్నదే కథ. ఇది హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, బెంగాలి, మరాఠీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. మూడు సీజన్లు కలిపి 28 ఎపిసోడ్లున్నాయి.

మార్కో

హై లెవల్ యాక్షన్ థ్రిల్లర్ ‘మార్కో’. ఉన్ని ముకుందన్ టైటిల్ రోల్ ప్లే చేసిన మూవీ ఇది. ట్రైన్ లో అధిక భాగం సాగుతుంది ఈ చిత్రం. కళ్ల ముందే తన వాళ్లను చంపేసిన గ్యాంగ్ పై విరుచుకుపడే హీరో అదిరే యాక్షన్ తో రక్తం పారిస్తాడు. విలన్ గ్యాంగ్ పై బీభత్సంగా దాడి చేస్తాడు. ఈ యాక్షన్ మూవీ మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఓటీటీలో ఉంది.

పని

డైరెక్టర్ గా జోజు జార్జ్ ఫస్ట్ మూవీ ఇది. ఇది యాక్షన్ రివేంజ్ థ్రిల్లర్. ఇద్దరు విలన్లు ఓ కుటుంబంపై దాడి చేస్తారు. హీరో ఎలా రివేంజ్ తీర్చుకున్నాడన్నది ఈ మూవీ కథ. ఇందులో జోజో జార్జ్, సాగర్ సూర్య, జునైజ్ వీపీ, బాబీ కురియన్, అభయ హిరణ్మయి తదితరులు నటించారు. ఇది మలయాళం, హిందీ, తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో ఈ మూవీని ఓటీటీలో చూడొచ్చు.

బృంద‌

ఎస్ఐ బృంద‌ స్టోరీ ఇది. ఓ మర్డర్ కేసు దర్యాప్తు చేసే క్రమంలో బృంద‌ సంచలన విషయాలు తెలుసుకుంటుంది. చివరకు తన అన్ననే క్రూరంగా మర్డర్లు చేస్తున్నాడని తెలుసుకుంటుంది. అప్పుడు ఏం జరిగిందన్నదే సస్పెన్స్ క్రియేట్ చేస్తుంది. ఇందులో త్రిష టైటిల్ రోల్ ప్లే చేసింది. 8 ఎపిసోడ్ల ఈ వెబ్ సిరీస్ తెలుగు, మలయాళం, హిందీ, తమిళం, కన్నడ, బెంగాలీ, మరాఠీ భాషల్లో అందుబాటులో ఉంది.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024