



Best Web Hosting Provider In India 2024
జిన్‌పింగ్‌తో ఉగ్రవాదం గురించి మోదీ ప్రస్తావించారు.. చర్చల వివరాలను వెల్లడించిన విదేశాంగ శాఖ!
ఉగ్రవాదం భారతదేశం, చైనా రెండింటినీ ప్రభావితం చేస్తుందని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు ప్రధాని మోదీ నొక్కిచెప్పారని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ అన్నారు. ఉగ్రవాదంపై ఇరు దేశాధినేతలు చర్చించినట్టుగా తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో టియాంజిన్‌లో ఒక ముఖ్యమైన సమావేశం నిర్వహించారు. సరిహద్దు వివాదం, ఉగ్రవాదం, వాణిజ్యం వంటి అంశాలపై లోతుగా చర్చించారు. సరిహద్దు ప్రాంతాల్లో శాంతిని కొనసాగించడానికి, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచుకోవడానికి ఇద్దరు నాయకులు అంగీకరించారు. దీనితో పాటు ప్రధాని మోదీ.. జిన్‌పింగ్‌ను భారతదేశాన్ని సందర్శించాలని ఆహ్వానించారు.
చైనాలోని టియాంజిన్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మధ్య జరిగిన ముఖ్యమైన సమావేశం తర్వాత భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇప్పుడు ఆ వివరాలను పంచుకుంది. భారతదేశం, చైనా మధ్య ఏ ముఖ్యమైన అంశాలు చర్చకు వచ్చాయో విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారతదేశం, చైనా మధ్య ప్రధాన చర్చలు సరిహద్దు వివాదం, ఉగ్రవాదం, వాణిజ్యంపై ఉన్నాయని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ అన్నారు. దీనితో పాటు రాబోయే బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి చైనా అధ్యక్షుడిని భారతదేశానికి రావాలని ప్రధాని మోదీ ఆహ్వానించారు.
గత సంవత్సరం విజయవంతంగా సైన్యాన్ని ఉపసంహరించుకోవడం, అప్పటి నుండి సరిహద్దు ప్రాంతాలలో శాంతి, ప్రశాంతతను కాపాడుకోవడాన్ని ఇద్దరు నాయకులు గుర్తించారని విదేశాంగ శాఖ చెప్పింది. ఈ సమస్యకు సంబంధించిన కొన్ని సూత్రాలను నొక్కి చెబుతూ, ద్వైపాక్షిక సంబంధాల నిరంతర, సజావుగా అభివృద్ధి చెందడానికి సరిహద్దు ప్రాంతాలలో శాంతి, ప్రశాంతత అవసరాన్ని ప్రధానమంత్రి మోదీ నొక్కి చెప్పారు. ఇప్పటికే ఉన్న యంత్రాంగాలను ఉపయోగించి సరిహద్దులలో శాంతిని కొనసాగించాల్సిన అవసరం, భవిష్యత్తులో మొత్తం సంబంధానికి అంతరాయం కలగకుండా ఉండాలనే దానిపై ఏకాభిప్రాయం ఉందన్నారు.
ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచడం, సమతుల్యం చేయడం, ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేయడం, సరిహద్దు నదులపై సహకరించడం, ఉగ్రవాదాన్ని సంయుక్తంగా ఎదుర్కోవడం వంటి మార్గాలపై ఇద్దరు నాయకులు అభిప్రాయాలను పంచుకున్నారు. పరస్పర గౌరవంతో ఈ అన్ని అంశాలపై ముందుకు సాగాలనే ఆకాంక్షించారు.
2026లో భారతదేశం నిర్వహించనున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను ప్రధానమంత్రి ఆహ్వానించారని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి తెలిపారు. ఆహ్వానానికి అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
టాపిక్
Best Web Hosting Provider In India 2024
Source link