థియేటర్లో లోకా రచ్చ..మలయాళ ఫస్ట్ ఫీమేల్ సూపర్ హీరో మూవీ.. మోహన్ లాల్ హృదయపూర్వం కంటే ఎక్కువ కలెక్షన్లు.. దుల్కర్ సమర్పణ

Best Web Hosting Provider In India 2024

థియేటర్లో లోకా రచ్చ..మలయాళ ఫస్ట్ ఫీమేల్ సూపర్ హీరో మూవీ.. మోహన్ లాల్ హృదయపూర్వం కంటే ఎక్కువ కలెక్షన్లు.. దుల్కర్ సమర్పణ

కళ్యాణి ప్రియదర్శన్, నస్లెన్ జంటగా నటించిన మలయాళ చిత్రం భారీ వీకెండ్ కలెక్షన్లతో బాక్సాఫీస్ ను షేక్ చేసింది. మలయాళ ఫస్ట్ ఫీమేల్ సూపర్ హీరో మూవీగా తెరకెక్కిన లోకా ఛాప్టర్ 1 బాక్సాఫీస్ దగ్గర సత్తాచాటుతోంది. వసూళ్లలో మోహన్ లాల్ సినిమాను వెనక్కి నెట్టింది.

లోకా ఛాప్టర్ 1 మూవీ పోస్టర్

మలయాళ సినిమా నుంచి వచ్చిన మొదటి మహిళా సూపర్ హీరో ఫిల్మ్ ‘లోకా ఛాప్టర్ 1ఛంద్ర’పై అన్ని వర్గాల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. దుల్కర్ సల్మాన్ సమర్పణలో కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సూపర్ హీరో చిత్రానికి దేశీయ మార్కెట్ లో భారీ స్పందన లభించింది. ఈ చిత్రం ఏకగ్రీవంగా సానుకూల సమీక్షలను పొందింది. ఇప్పుడు అన్ని ఓనం రిలీజ్ లను దాటి కలెక్షన్లలో అదరగొడుతోంది.

నాలుగు రోజుల్లో

ఆగష్టు 28న లోకా ఛాప్టర్ 1 చంద్ర మూవీ రిలీజైంది. సూపర్ హీరో ఫ్యాంటసీ థ్రిల్లర్ గా ఈ మూవీ థియేటర్లలోకి వచ్చేసింది. సక్నిల్క్ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం లోకా మూడు రోజుల్లోనే రూ.20 కోట్ల మార్కును సునాయాసంగా దాటేసింది. ఇక నాలుగో రోజైన ఆదివారం (ఆగస్టు 31) భారీ వసూళ్లు సాధించింది. ఈ చిత్రం తొలి అంచనాల ప్రకారం రూ.9.75 కోట్లు వసూలు చేసింది. రూ.2.7 కోట్ల ఓపెనింగ్ సాధించిన ఈ మూవీ.. రెండో రోజు రూ.4 కోట్లు, మూడో రోజు రూ.7 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు మొత్తం ఇండియాలో నెట్ కలెక్షన్లు రూ.24.05 కోట్లుగా ఉన్నాయి.

మోహన్ లాల్ సినిమాను దాటి

వచ్చే వారంలో ఓనం సెలవులు ఉండటంతో లోకా తన జోరును కొనసాగించి మంచి బిజినెస్ చేస్తుందని భావిస్తున్నారు. మరోవైపు మోహన్ లాల్ నటించిన ‘హృదయపూర్వం’ చిత్రం ఆదివారం రూ.3.2 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ప్రస్తుతం ఈ సినిమా మొత్తం వసూళ్లు రూ.11.95 కోట్లుగా ఉన్నాయి. దుల్కర్ సల్మాన్ ప్లాన్ చేసిన వేఫేరర్ సినిమాటిక్ యూనివర్స్ లో మొదటి భాగం లోకా చాప్టర్ 1.

కథ ఏమిటంటే?

20 ఏళ్లుగా స్వీడన్ లో ఉంటూ బెంగళూరుకు మకాం మార్చిన చంద్ర అనే యువతిగా కళ్యాణి నటించింది. ఆమె ఎక్కువగా సాయంత్రాలలో బయటకు వస్తుంది. ఇది అదే వీధిలో నివసించే ఇద్దరు యువకులు సన్నీ (నస్లెన్), వేణు (చందు సలీంకుమార్) లను ఆకర్షిస్తుంది. చంద్ర బ్యాక్ స్టోరీ గురించి ఇద్దరికీ ఎలా తెలుస్తుంది అనేది కథాంశం.

ఈ సినిమా స్ట్రాంగ్ రైటింగ్, యాక్షన్ సీక్వెన్స్, వీఎఫ్ఎక్స్ కు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ టాక్ వచ్చింది. డొమినిక్ అరుణ్, శాంతి బాలచంద్రన్ రచించిన ఈ చిత్రానికి డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందించిన ఈ చిత్రానికి నిమిష్ రవి సినిమాటోగ్రఫీ అందించారు. ఈ చిత్రంలో టోవినో థామస్, దుల్కర్ సల్మాన్ కూడా అతిథి పాత్రల్లో కనిపించడం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024