బిగ్‌బాస్‌తో నో యూజ్‌.. పొట్టి బ‌ట్ట‌లు వేసుకుని గ్లామ‌ర్ షో చేస్తేనే ఛాన్స్‌లు.. సీరియ‌ల్ న‌టి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Best Web Hosting Provider In India 2024

బిగ్‌బాస్‌తో నో యూజ్‌.. పొట్టి బ‌ట్ట‌లు వేసుకుని గ్లామ‌ర్ షో చేస్తేనే ఛాన్స్‌లు.. సీరియ‌ల్ న‌టి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బిగ్ బాస్ షో కారణంగా తనకు ఎలాంటి యూజ్ లేదని సీరియల్ నటి కీర్తి భట్ సంచలన వ్యాఖ్యలు చేసింది. పొట్టి బట్టలు వేసుకుని, గ్లామర్ షో చేస్తేనే అవకాశాలు వస్తాయని పేర్కొంది.

కీర్తి భట్ (x/Keerthibhatoff)

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభానికి సమయం దగ్గర పడుతోంది. సెప్టెంబర్ 7న ఈ సీజన్ స్టార్ట్ కాబోతుంది. ఇప్పటికే సామాన్య ప్రజల నుంచి అయిదుగురిని హౌస్ కు ఎంపిక చేసేందుకు బిగ్ బాస్ అగ్నిపరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ పై మాజీ కంటెస్టెంట్ కీర్తి భట్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. బిగ్ బాస్ తో తన కెరీర్ కు ఎలాంటి యూజ్ లేదని ఆమె పేర్కొంది.

దూరం పెట్టారని

తాజాగా ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్, బిగ్‌ బాస్‌పై కీర్తి భట్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘‘బిగ్‌ బాస్‌‌లో కంటెస్టెంట్స్‌గా పాల్గొన్న చాలా మందికి తెలుగు స్మాల్ స్క్రీన్ పై అవకాశాలు వస్తూనే ఉన్నాయి. కానీ నన్ను మాత్రం దూరం పెట్టారు. బుల్లితెరపై అవకాశాలు రావాలంటే గ్లామర్ షో చేయాలని, పొట్టి బట్టలు వేసుకోవాలని చెప్పేవారు. దానికి నో చెప్పడంతోనే ఏ షోకు కూడా అవకాశం ఇవ్వలేదు’’ అని కీర్తి భట్ తెలిపింది.

పెను మార్పుల్లేవు

‘‘షోలలో చలాకీగా మాట్లాడలేకపోవడం కూడా అవకాశాలు తగ్గడానికి ఓ కారణం. బిగ్ బాస్ షో కారణంగా జీవితానికి ఎలాంటి ప్రయోజనం కలగలేదు. బిగ్‌ బాస్ వల్ల జనంలో పాపులారిటీ వచ్చింది. అంతేకానీ నా జీవితంలో పెనుమార్పులు సంభవించలేదు. కొంతమందికి మాత్రమే ఛాన్స్ లు వస్తున్నాయి. ఎవ్వరూ ఖాళీగా లేరు. నాకు యూజ్ లేదు’’ అని కీర్తి భట్ పేర్కొంది.

కార్తీక దీపంతో బ్రేక్

కర్ణాటకకు చెందిన కీర్తి భట్‌ సీరియల్స్‌లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. మనసిచ్చి చూడు సీరియల్‌తో తెలుగు ఆడియన్స్ కు పరిచయమైంది. ఆమె కెరీర్‌ను స్టార్ మాలో వచ్చిన కార్తీక దీపం మలుపు తిప్పింది. ఇందులో కార్తీక్ బాబు, దీపల కుమార్తె హిమ క్యారెక్టర్‌లో కీర్తి భట్ నటించి పాపులారిటీ సంపాదించుకంది. ఆ తర్వాత బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ లో పార్టిసిపేట్ చేసింది.

ఓ రోడ్డు ప్రమాదంలో తన కుటుంబం మొత్తాన్ని కీర్తి భట్ పోగొట్టుకుంది. తను కూడా తీవ్ర గాయాల పాలై కోమాలోకి వెళ్లిపోయింది. ఈ యాక్సిడెంట్ కారణంగా తనకు పిల్లలు పుట్టే అవకాశం లేకుండా పోయింది. విజయ్ కార్తీక్ తో ఎంగేజ్మెంట్ చేసుకుంది ఈ బ్యూటీ. తనకు పిల్లలు పుట్టరని తెలిసినా విజయ్ కార్తక్ ఎంతో ప్రేమిస్తున్నాడని కీర్తి భట్ వెల్లడించింది.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024