





Best Web Hosting Provider In India 2024

ఓటీటీలోకి సెప్టెంబర్‌లో రానున్న సరికొత్త కె-డ్రామాలు.. అన్ని జోనర్లలో.. ఈ ఒక్క ఓటీటీలో చూసేయండి!
ఓటీటీలో ఈ సెప్టెంబర్ 2025లో సరికొత్త కొరియన్ డ్రామాలు స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో యాక్షన్, మెలో డ్రామా, క్రైమ్ థ్రిల్లర్స్ వంటి అన్ని రకాల జోనర్లలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఉన్నాయి. అలాగే, ఆగస్ట్‌లో ప్రారంభమైన కొన్ని కె డ్రామా ఓటీటీ సిరీస్‌లో ఈ నెలలో ముగియనున్నాయి. మరి వీటిని ఏ ఓటీటీలో చూడాలంటే?
ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఈ సెప్టెంబర్‌లో సరికొత్త కొరియన్ డ్రామాలతో థ్రిల్ పంచనుంది. కె-డ్రామాలో ఎంతో హిట్ కొట్టిన ఇంట్రెస్టింగ్ సినిమాలు ఈ నెలలోనే ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి. సెప్టెంబర్ 2025లో ఓటీటీ రిలీజ్ అయ్యే కె-డ్రామాలను తాజాగా నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. మరి ఆ సినిమాలు ఏంటీ, వాటి ఓటీటీ రిలీజ్ డేట్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
మాంటిస్ ఓటీటీ
కొరియన్ డ్రామాలో వచ్చే అతిపెద్ద సినిమా మాంటిస్. సెప్టెంబర్ 26న నెట్‌ఫ్లిక్స్‌లో మాంటిస్ ఓటీటీ రిలీజ్ కానుంది. ఇది కిల్ బోక్సూన్ సినిమా సీక్వెల్‌గా వస్తోంది. ఇమ్ సి వాన్, పార్క్ గ్యూ యంగ్, జో వూ జిన్ ప్రధాన పాత్రల్లో నటించగా.. లీ టే సంగ్ దర్శకత్వం వహించారు.
యూ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఓటీటీ
సుమారు 15 ఎపిసోడ్లతో ప్రసారం కానున్న కొరియన్ మెలో డ్రామా యూ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్. సెప్టెంబర్ 12 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే ఈ సిరీస్‌లో కిమ్ గో యున్, పార్క్ జి హ్యున్ నటించారు. 42 ఏళ్ల వయసులో చిన్ననాటి శత్రువులు మళ్లీ కలుసుకున్న తర్వాత ఏం జరిగింది అనేది ఈ సిరీస్ కథ.
క్వీన్ మాంటిస్ ఓటీటీ
నెట్‌ఫ్లిక్స్‌లో సెప్టెంబర్ 5 నుంచి ప్రతి వారం కొత్త ఎపిసోడ్‌తో వచ్చే క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ క్వీన్ మాంటిస్. ఈ ఓటీటీ సిరీస్‌లో గో హ్యున్ జంగ్, జాంగ్ డాంగ్ యూన్ నటించారు. ఎనిమిది ఎపిసోడ్లతో సాగే ఈ కె-డ్రామాలో 20 ఏళ్ల క్రితం ఐదుగురిని హత్య చేసిన మహిళ జంగ్ ఈ సిన్ జీవితం ఆధారంగా సాగుతుంది.
పోలీస్ అధికారి అయిన జంగ్ ఈ సిన్ కుమారుడు తన తల్లీ గతాన్ని, తన తల్లికోసం వచ్చే కొత్త హంతకుడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. తల్లీకొడుకుల అనుబంధంతో యాక్షన్ బ్యాక్ డ్రాప్లో ఇది తెరకెక్కింది.
ఈ నెల ఎండింగ్‌కు వచ్చిన కొరియన్ సీరీస్లు
1. బియాండ్ ది బార్ ఓటీటీ: ఆగస్ట్‌లో ప్రారంభం అయిన బియాండ్ ది బార్ ఓటీటీ సిరీస్ సెప్టెంబర్ 7న ముగియబోతుంది. లీ జిన్ వూక్, జంగ్ చే యియోన్ ప్రధాన పాత్రల్లో నటించిన లీగల్ డ్రామా ఇది. కొరియాలో ఈ సిరీస్ రేటింగ్స్ బాగా పెంచుకుంది.
2. బాన్ అప్పెటిట్, యువర్ మేజెస్టీ ఓటీటీ: సెప్టెంబర్ 28న ఈ సిరీస్ ముగుస్తుంది. ఇందులో లిమ్ యూన్ ఆ మిచెలిన్ స్టార్ గెలుచుకున్న చెఫ్‌గా నటించింది. జోసన్ యుగానికి మిస్టరీగా వెళ్లిపోయే ఆమె, అక్కడి క్రూరమైన రాజుకు వంట చేయాల్సి వస్తుంది.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ఆడియెన్స్‌కు
మొత్తం మీద సెప్టెంబర్ 2025లో నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ఆడియెన్స్‌కు యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్లు, భావోద్వేగ మెలో డ్రామాలు, రొమాన్స్ అన్నీ కలిపిన పూర్తి ప్యాకేజ్‌ను కొరియన్ డ్రామాల ద్వారా అందిస్తోంది.
సంబంధిత కథనం