కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్:సుమిత్ర స‌ర్‌ప్రైజ్‌- జ్యోకు షాక్‌- కావాల‌నే పారు గొడ‌వ‌- తాళి ఎవ‌రు తీసారో తెలుసని ట్విస్ట్

Best Web Hosting Provider In India 2024

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్:సుమిత్ర స‌ర్‌ప్రైజ్‌- జ్యోకు షాక్‌- కావాల‌నే పారు గొడ‌వ‌- తాళి ఎవ‌రు తీసారో తెలుసని ట్విస్ట్

కార్తీక దీపం 2 సీరియల్ టుడే సెప్టెంబర్ 1వ తేదీ ఎపిసోడ్ లో సత్యనారాయణ వ్రతానికి వచ్చిన సుమిత్ర సర్ ప్రైజ్ ఇస్తుంది. కావాలనే పారిజాతం గొడవ పెట్టుకుంటుంది. తాళి ఎవరు తీసారో తెలుసని ట్విస్ట్ ఇస్తుంది.

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

కార్తీక దీపం 2 సీరియల్ టుడే సెప్టెంబర్ 1వ తేదీ ఎపిసోడ్ లో నేనేదో అందరితో సరదాగా ఉంటే ఇది తప్పు పడుతుందిరా అని దాసుతో అంటుంది పారిజాతం. నువ్వు ఎప్పుడూ ఇలాగే ఉండాలమ్మా అని దాసు అంటాడు. పది మందితో కలిసి నవ్వుతూ ఉండటమే రా జీవితమంటే అని పారు అంటే జ్యోత్స్న షాక్ అయి చూస్తుంది. నువ్వు శివన్నారాయణ పక్కన కూర్చోవడం బాగుందిరా, చాలా హ్యాపీ అని పారిజాతం అంటుంది.

నిజాన్ని ఆపలేరు

మా అమ్మ మారింది మరి నువ్వెప్పుడు మారతావని జ్యోత్స్నను అడుగుతాడు దాసు. నువ్వు పెళ్లికి రావొద్దన్నావు, సత్యనారాయణ స్వామి వ్రతానికి కాదు. ఇక్కడికి రమ్మని కార్తీక్ చెప్పాడు. పెళ్లిలో తాళి కనిపించలేదని విన్నా. అది నీ పనేనా. సుమిత్ర ఎందుకు రాలేదు. దీప దారికి అడ్డు రావొద్దు. శివన్నారాయణ మనవరాలు దీపే అన్న విషయం ఏ రోజు బయటపడుతుందో తెలియదు. అప్పటివరకూ ఆ హోదాలో ఉండు. కానీ నిజాన్ని నీతో సహా ఎవరూ ఆపలేరని దాసు అంటాడు.

తల్లి రాలేదు

కార్తీక్ ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరుగుతుంటుంది. వదిన రాలేదని అత్తయ్య ముఖంలో నవ్వే లేదని కార్తీక్ తో అంటుంది దీప. సత్యనారాయణ వ్రతం చేసుకున్న దంపతులకు పెళ్లికూతురు అమ్మానాన్న బట్టలు పెట్టాలని పంతులు చెప్తాడు. కానీ తల్లి రాలేదు తండ్రి పెట్టొచ్చా అని అడిగి దశరథ బట్టలు పెడతాడు. మా వదిన ఎంత పని చేసిందో అని అనసూయతో చెప్తూ బాధ పడుతుంది కాంచన. నా కోడలికి ఇంతే రాసి పెట్టి ఉందని అనుకుంటానని కాంచన అంటుంది.

సుమిత్ర రాకతో

దశరథ బట్టలు పెడుతుండగా సుమిత్ర నవ్వుతూ వచ్చి అందరికీ సంతోషాన్నిస్తుంది. మమ్మీ ఏంటీ ఇంత పెద్ద సర్ ప్రైజ్ ఇచ్చిందని జ్యోత్స్న షాక్ అవుతుంది. దశరథ, సుమిత్ర కలిసి బట్టలు పెట్టి అక్షింతలు వేస్తారు. వ్రతం కూడా పూర్తవుతుంది. ఛాలెంజ్ లో నువ్వే గెలిచావు బావ. దీప నీ ముఖంలో నవ్వు ఎన్ని రోజులు ఉంటుందో చూస్తానని జ్యోత్స్న అనుకుంటుంది.

పారు గొడవ

వదిన నువ్వు వచ్చి నా మాట దక్కించావు. లేదంటే నా ఇంట్లో వ్రతం జరిగిందన్న ఆనందం కంటే బాధే ఎక్కువ ఉండేదని కాంచన అంటుంది. కొన్ని తప్పవు వదిన అని సుమిత్ర చెప్తుంది. పారిజాతం కావాలనే స్వప్నతో గొడవ పెట్టుకుంటుంది. కార్తీక్, కాశీ కలిసి పారుపై కోప్పడతారు. పూజ జరిగిన ఇంట్లో గొడవలు వద్దని కార్తీక్ అంటాడు. ఈ మనిషికి అధికారం లేదు, అది లెక్కలేనితనం. గడప బయట ఉండాల్సిన వాళ్లను గడప లోపలికి రానిస్తే ఇలాగే ఉంటుందని పారు నోరు పారేసుకుంటుంది.

తాళి ఎలా పోయింది?

జ్యోత్స్న మధ్యలోకి వచ్చి గొడవను మరింత పెద్దదిగా చేస్తుంది. మా బావను, మా మరదలును అవమానించడానికి మీకు ఒక అవకాశం దొరికినట్లుంది. మేమూ నిజాలు మాట్లాడగలం. కానీ సంస్కారం అడ్డొచ్చి ఆగిపోతున్నామని దీప అంటుంది. దమ్ముంటే నిజాలు మాట్లాడు అని పారిజాతం రెచ్చగొడుతుంది. అప్పుడు నేను నిజాలు మాట్లాడుతాను అని అనసూయ పెళ్లిలో తాళి ఎలా పోయిందని ప్రశ్నిస్తుంది.

ఎవరు తీశారు?

ఇంతవరకూ ఎవరు దాని గురించి మాట్లాడలేదు. ఎవరికీ తెలియదు అని అనసూయ అడుగుతుంది. చిన్న పిల్లల మెడలో నగలు కొట్టేసే అలవాటు మీకే ఉంటుందని పారు అంటే దీప మండిపడుతుంది. పెళ్లి జరిపించాలనుకున్నారో ఆపించాలనుకున్నారో తెలుసులేండి అని దీప అంటుంది. కార్తీక్ ఆగమంటే, ఎందుకు ఆగాలి బావ? నా ఆడపడుచును నా ఇంటికి వచ్చి అవమానిస్తుంటే నాకు బాధగా ఉండదా? ఎందుకు చిన్న చూపు? పెళ్లిలో తాళి ఎవరు తీశారో తెలియదా? అని దీప అంటుంది.

సారీ చెప్పాలని

పెళ్లి ఆపడానికి తాళి మీరే తీసి ఉండొచ్చు అని పారుతో స్వప్న అంటుంది. నా మీద ఇంత పెద్ద నింద పడ్డాక నేను బయటకు ఎలా రాను? నా భర్త ముందు ఎలా తిరగగలను? అని పారు అంటుంది. మా మనసుల్లో ఏనాడూ విషం లేదు. అది చూపించేది మీరే అని కావేరీ అంటుంది. ముందు మీరే స్థాయిలో ఉన్నారో చూసుకోమ్మని కావేరీ అనగానే శివన్నారాయణ మండిపడతాడు. శ్రీధర్ ఇంకా ఈ గొడవను పెద్దదిగా చేస్తాడు. అందరూ కలిసి నాకు సారీ చెప్పాలని పారు అడుగుతుంది.

కార్తీక్ కు తెలుసు

ఆ తాళి మీరే తీసి ఉంటారని మళ్లీ పారిజాతంతో అంటుంది స్వప్న. ఇప్పుడు దాని గురించి ఎందుకు స్వప్ప్న అని కార్తీక్ ఆపేందుకు ట్రై చేస్తాడు. తాళి ఎవరు తీశారో నాకు తెలుసని పారు షాక్ ఇస్తుంది. పెళ్లి ఆపాలనుకున్న మనిషి ఎవరో తెలియాలని అందరూ అడుగుతారు. ఈ విషయాన్ని నేను వదలను అని దశరథ సీరియస్ అవుతాడు. నన్ను అడుగుతావేం నీ భర్తనే అడుగు చెప్తాడు అని దీపతో అన్న పారు ట్విస్ట్ ఇస్తుంది. కార్తీక్ కు తెలుసని పారు చెప్పడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024