నిన్ను కోరి సెప్టెంబర్ 1 ఎపిసోడ్: కామాక్షి, శ్రుతికి చంద్రకళ సీరియస్ వార్నింగ్.. కదిలిన రఘురాం.. శాలినికి టెన్షన్

Best Web Hosting Provider In India 2024

నిన్ను కోరి సెప్టెంబర్ 1 ఎపిసోడ్: కామాక్షి, శ్రుతికి చంద్రకళ సీరియస్ వార్నింగ్.. కదిలిన రఘురాం.. శాలినికి టెన్షన్

నిన్ను కోరి సీరియల్ టుడే సెప్టెంబర్ 1వ తేదీ ఎపిసోడ్ లో కామాక్షి, శ్రుతికి చంద్రకళ సీరియస్ వార్నింగ్ ఇస్తుంది. పర్సనల్ డేట్ కు వెళ్లినా చంద్ర గురించే క్రాంతి చెప్పడంతో శాలినికి కోపం వస్తుంది. రఘురాం చేయి కదలడంతో అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. శాలిని మాత్రం టెన్షన్ పడుతుంది.

నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)

నిన్ను కోరి సీరియల్ టుడే సెప్టెంబర్ 1వ తేదీ ఎపిసోడ్ లో రాసుకు పూసుకుని తిరిగే శాలిని వెనుక ఇంత కుట్ర చేస్తారా? బంధాల విలువ తెలియదా? శాలిని, క్రాంతిని ఎందుకు విడదీయాలని అనుకుంటున్నారు? అని కామాక్షి, శ్రుతిపై ఫైర్ అవుతుంది చంద్రకళ. ఈ కుటుంబంలో ఏ సమస్య వచ్చినా అది నాదే అనుకుంటానని చంద్ర అంటుంది. మీ బుద్ధులు మంచివి కావు కాబట్టే మీకు ఇలా జరుగుతుందని చంద్ర మండిపడుతుంది.

ఈ ఇంటి కోడళ్లం

శాలినికి, నాకు మధ్య డిస్టర్బెన్సెస్ ఉండొచ్చు కానీ మేమిద్దరం ఈ ఇంటి కోడళ్లం. ఎప్పటికీ కలిసి ఉండేవాళ్లం. మీరు చేసిన పని గురించి శాలినికి చెప్తే ఏం జరుగుతుందో తెలుసా? అని చంద్రకళ అనగానే వద్దు చెప్పొద్దని కామాక్షి రిక్వెస్ట్ చేస్తుంది. శ్రుతిపై కోప్పడుతుంది. మళ్లీ ఏమైనా పిచ్చి వేషాలు వేస్తే మాత్రం నా వార్నింగ్ వేరే లెవల్ లో ఉంటుందని చంద్రకళ సీరియస్ గా అని వెళ్లిపోతుంది.

సర్ ప్రైజ్

ట్రాఫిక్ లో మల్లెపూలు తీసుకోమ్మని విరాట్ ను ఓ ముసలావిడ అడుగుతుంది. పూలు తీసుకెళ్తే నా భార్య ఎగిరి గంతులేస్తుంది కానీ అత్త ఎగిరి తంతుందని విరాట్ అనుకుంటాడు. చివరకు పూలు తీసుకుంటాడు. మరోవైపు క్రాంతి, శాలిని కలిసి రెస్టారెంట్ కు వెళ్తారు. పెళ్లికి ముందు ఇలాంటి సర్ ప్రైజ్ లు చాలా ఇచ్చేవాడివి. మళ్లీ అలాంటి డేస్ తీసుకు రావాలని ట్రై చేస్తున్నానని శాలిని అంటుంది.

శాలినికి కోపం

చంద్ర వదిన కన్వీన్స్ చేసింది కాబట్టి నీకో ఛాన్స్ ఇచ్చా. లేకపోయి ఉంటే ఇప్పటికే విడిపోయేవాళ్లమని క్రాంతి అంటుంటే శాలినికి మండిపోతుంది. చంద్రను పొగిడే ప్రోగ్రాం ఇంటికి వెళ్లాక పెట్టుకుందాం. ఇది మన పర్సనల్ డేట్ కాబట్టి మన ఇద్దరి గురించి మాట్లాడుకుందామా? అని శాలిని అడుగుతుంది.

బిరియానీలో ఆవకాయ

అక్కడ చంద్రకళ పికిల్ బాటిల్ చూస్తాడు క్రాంతి. అన్ని రకాల పచ్చళ్లు ట్రై చేస్తానంటాడు. బిరియానీలో ఆవకాయ కలుపుకొని తింటూ మైమరిచి పోతాడు క్రాంతి. అది చూసి శాలినికి మండిపోతుంది. మళ్లీ చంద్రను క్రాంతి పొగుడుతుంటే శాలినికి తీవ్రమైన కోపం వస్తుంది. చంద్ర నేను నీ బిజినెస్ ను పడేస్తానని శాలిని అనుకుంటుంది.

కదిలిన రఘురాం

రాత్రి మామయ్యకు ఆయిల్ మసాజ్ చేస్తూ పికిల్స్ బిజినెస్ సక్సెస్ అవుతుందని చంద్రకళ చెప్తుంది. అప్పుడే రఘురాం చేయిని కదిలిస్తాడు. అది చూసి చంద్రకళ, జగదీశ్వరి చాలా సంతోషపడతారు. చంద్ర పరుగెత్తుకుంటూ వచ్చి అందరికీ ఈ గుడ్ న్యూస్ చెప్తుంది. విరాట్ ను చూసి మామయ్య రెస్పాండ్ అవుతున్నాడు బావ అని చెప్తుంది చంద్ర. శాలిని తప్ప అందరూ ఎమోషనల్ అవుతారు. దీంతో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024