





Best Web Hosting Provider In India 2024

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: బాలుకి మీనా ముద్దు.. నైటీలో రవి.. మగరాయుడిలా శృతి.. రొమాంటిక్ సీన్స్..
గుండె నిండా గుడి గంటలు సోమవారం (సెప్టెంబర్ 1) ఎపిసోడ్ కాస్త ఎమోషనల్‌గా, మరికాస్త ఫన్నీగా సాగిపోయింది. తల్లి ప్రేమ కోసం బాలు పరితపించడం, అటు రవిని నైటీలో చూసి ఇంట్లో వాళ్లు షాక్ తినడంలాంటి సీన్లు కనిపిస్తాయి.
గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈ రోజు అంటే మైల్‌స్టోన్ 500వ ఎపిసోడ్ స్పెషల్ గా సాగింది. బాలు ఎమోషనల్ కావడం, రవి, శృతి రొమాన్స్ కాస్తా వికటించడంలాంటివి జరిగాయి. దీంతో ఈ ఎపిసోడ్ ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేయడంతోపాటు నవ్వించేలా కూడా సాగిపోయింది. ఇంకా ఏం జరిగిందో చూద్దాం.
మనోజ్‌ని బ్లాక్‌మెయిల్ చేసిన బాలు
గుండె నిండా గుడి గంటలు సీరియల్ సోమవారం (సెప్టెంబర్ 1) ఎపిసోడ్ మనోజ్ ను బాలు బ్లాక్‌మెయిల్ చేసే సీన్ తో మొదలవుతుంది. షాప్‌కి అమ్మ పేరు వద్దన్న మనోజ్ మాటలను బాలు రికార్డు చేస్తాడు. ఆ తర్వాత వాళ్ల దగ్గరికి వెళ్లి అమ్మ పేరే పెట్టాలని పట్టుబడతాడు. దీంతో ఏంటీ దౌర్జన్యం అంటూ రోహిణి అంటుంది.
ఇంట్లో ఎవరికీ దక్కని అమ్మ ప్రేమ నీ ఒక్కడికే దక్కిందిరా.. అందుకే నీకు ఆ విలువ తెలియడం లేదు అని బాలు అంటాడు. నువ్వే కదరా అమ్మ పేరు కలిసి రాదన్నావ్ అని మనోజ్ అంటే.. నేనడం వేరు నువ్వనడం వేరు అని బాలు అంటాడు. అమ్మ పేరు పెట్టాల్సిందే అని లేదంటే నీ మాటలను ఆమెకు వినిపిస్తాను.. నిన్ను ఇంట్లో నుంచి గెంటేస్తుంది అని బాలు బ్లాక్‌మెయిల్ చేయడంతో మనోజ్, రోహిణి షాక్ తింటారు.
అమ్మ ప్రేమ కోసం పరితపించిన బాలు
మనోజ్, రోహిణిలతో బాలు మాట్లాడిన మాటలు వింటుంది మీనా. తర్వాత గదిలోకి వచ్చిన బాలుని మీ గురించి చాలానే చదవాలి అని అంటుంది. ఎందుకు నేనేమైనా చరిత్ర సృష్టించానా అని బాలు అంటాడు. మీ అమ్మంటే అస్సలు పడదు కదా.. మరి ఎందుకు ఆమెపై అంత ప్రేమ చూపిస్తున్నారు అని అడుగుతుంది.
ఆమెకు నేనంటే పడదు.. కానీ నాకు ఆమె అంటే పడుతుంది అని బాలు అంటాడు. ఎంతైనా అమ్మే కదా.. అమ్మ పేగు తెంచుకొని పుట్టాను.. ఎప్పటికైనా నన్నూ దగ్గరికి తీసుకొని గుండెలకు హత్తుకుంటుందన్న ఆశ అని బాలు అంటాడు. దీంతో బాలుని దగ్గరకు తీసుకొని అతని నుదుటిపై మీనా ముద్దు పెడుతుంది.
శృతి మాస్ అవతార్.. రవితో రొమాన్స్
అటు గదిలో రవి లుంగీ, షర్ట్ వేసుకొని శృతి మాస్ అవతారంలో మంచంపైకి ఎక్కి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. అప్పుడే గదిలోకి వచ్చిన రవి ఆమెను చూసి షాక్ తింటాడు. ఏంటిది మగరాయుడిలా నా బట్టలు వేసుకున్నావని రవి అంటాడు. నీ మీద ప్రేమతో నువ్వు లేకపోయినా, నీ బట్టలు వేసుకొని నువ్వున్నట్లే ఫీలయ్యాను.. నువ్వు కూడా నా బట్టలు వేసుకో అంటూ అతనితో రొమాన్స్ చేస్తుంది.
ఛీ ఛీ అని రవి అనడంతో అందులో తప్పేముంది.. నేను నీ బట్టలు వేసుకున్నట్లే నువ్వు నా బట్టలు వేసుకో అని బలవంతంగా అతనికి తన నైటీ వేస్తుంది. దీంతో రవి సిగ్గుపడుతూ ఉంటాడు. శృతి అంతటితో ఆగకుండా నీకు నా మీద నిజంగా ప్రేమ ఉంటే.. కిచెన్ లోకి ఇలాగే వెళ్లి టీ తీసుకురావాలి అనడంతో రవి తప్పనిసరి పరిస్థితుల్లో సరే అంటూ వెళ్తాడు.
రవిని దొంగ అనుకున్న ఇంట్లో వాళ్లు
కిచెన్ లో రవి టీ పెడుతుంటాడు. అప్పుడే ప్రభావతి ఆకలి అంటూ నిద్ర లేస్తుంది. ఇప్పుడే కదా తిని పడుకున్నావని సత్యం అంటున్నా కూడా తాను ఏదో ఒకటి తినాల్సిందే అని హాల్లోకి వెళ్తుంది. డైనింగ్ టేబుల్ పై ఆమె వెతుకుతుండగా కిచెన్ లో గ్లాస్ కింద పడేస్తాడు రవి. వెంటనే పక్కన దాక్కొంటాడు. వెనుక నుంచి రవిని నైటీలో చూసిన ప్రభావతి దొంగ దొంగా అని అరవడంతో ఇంట్లో వాళ్లందరూ వస్తారు.
ఇంట్లోకి ఆడ దొంగ వచ్చింది.. నైటీ వేసుకుంది అని ప్రభావతి వాళ్లతో చెబుతుంది. దీంతో బాలు వచ్చి ఆ దొంగ పని చెబుతానంటూ కిచెన్ లోకి వెళ్లి వెనుక నుంచి రవిని గట్టిగా పట్టుకుంటాడు. అది చూసి మీనా వదలండి అని గట్టిగా అంటుంది. రవిని మెల్లగా ఇటు వైపు తిప్పడంతో అతన్ని చూసి అందరూ షాక్ తింటారు.
నైటీలో రవి.. మగరాయుడిలా శృతిని చూసి షాక్
నువ్వు నైటీ వేసుకోవడం ఏంటి రా.. నైట్ టైమ్ నైటీ వేసుకున్నోడా అంటూ రవిని బాలు తిడతాడు. నువ్వేంటి ఇలా తయారయ్యావ్ అని ప్రభావతి అంటుంది. అందరూ రవిని చూసి షాక్ తినడంతో ఏమైందంటూ శృతి కిందికి వస్తుంది. ఆమెను చూసి ఇంట్లో వాళ్లు మరింత షాక్ తింటారు. వీడు నైటీ వేసుకున్నాడు.. నువ్వు మగరాయుడిలా లుంగీ కట్టుకున్నావేంటి.. జంబలకిడి పంబలా అయ్యారేంటి అని ప్రభావతి అడుగుతుంది.
ఇందులో తప్పేంటి.. నా నైటీ వేసుకొని టీ తీసుకురమ్మని రవికి చెప్పాను.. అని శృతి అంటుంది. ఇలాంటి ఆటలేమైనా ఉంటే మీరు గదిలోనే ఆడుకోండమ్మా అని సత్యం అని వెళ్లిపోతాడు. ఆ తర్వాత బాలు, మీనా, మనోజ్, రోహిణిలతో కలిసి రవి, శృతి ఓ సెల్ఫీ దిగుతారు. తర్వాత రవిని బాలు, మనోజ్ ఆటపట్టిస్తారు. అక్కడితో ఇవాళ్టి గుండె నిండా గుడి గంటలు ఎపిసోడ్ ముగుస్తుంది.
సంబంధిత కథనం