బ్రహ్మముడి సెప్టెంబర్ 1 ఎపిసోడ్: రాజ్ కాళ్లు పట్టుకున్న యామిని.. ఇంట్లో రాజ్, కల్యాణ్ కొత్త స్కెచ్.. అపర్ణ షాక్

Best Web Hosting Provider In India 2024

బ్రహ్మముడి సెప్టెంబర్ 1 ఎపిసోడ్: రాజ్ కాళ్లు పట్టుకున్న యామిని.. ఇంట్లో రాజ్, కల్యాణ్ కొత్త స్కెచ్.. అపర్ణ షాక్

Hari Prasad S HT Telugu

బ్రహ్మముడి సీరియల్ సోమవారం (సెప్టెంబర్ 1) ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. రాజ్ కాళ్లు పట్టుకుంటుంది యామిని. ఇటు ఇంట్లో రాజ్, కల్యాణ్ వేసిన కొత్త స్కెచ్ చూసి అపర్ణతోపాటు ఇంట్లో వాళ్లందరూ షాక్ తింటారు.

బ్రహ్మముడి సెప్టెంబర్ 1 ఎపిసోడ్: రాజ్ కాళ్లు పట్టుకున్న యామిని.. ఇంట్లో రాజ్, కల్యాణ్ కొత్త స్కెచ్.. అపర్ణ షాక్

బ్రహ్మముడి ఈరోజు అంటే 814వ ఎపిసోడ్ రొమాంటిక్ సీన్లతోపాటు ఎమోషనల్ గానూ సాగింది. కావ్యను రాజ్ ఎత్తుకోవడం చూసి అప్పూ కూడా తనను ఎత్తుకోవాలని కల్యాణ్ తో అనడం, తర్వాత అన్నదమ్ములు కలిసి కొత్త స్కెచ్ వేయడం, అటు రాజ్ కాళ్లు యామిని పట్టుకోవడంలాంటి సీన్లతో సాగిపోయింది.

కావ్యను క్షమాపణ అడిగిన రాజ్

బ్రహ్మముడి సీరియల్ సోమవారం (సెప్టెంబర్ 1) ఎపిసోడ్ కావ్యను రాజ్ క్షమాపణ అడిగే సీన్ తో మొదలవుతుంది. కావ్య తనపై చూపించిన ప్రేమను చూసి రాజ్ ఎమోషనల్ అవుతాడు. నీ కడుపులో బిడ్డకు తండ్రి ఎవరని అవమానించినా భరిస్తూ నా గురించి ఆలోచించి నిజం చెప్పలేదని, తన కన్న తల్లి కూడా దానిని తట్టుకోలేక నిజం చెప్పేసిందని రాజ్ అంటాడు.

కావ్యకు రాజ్ క్షమాపణ అడుగుతాడు. దీంతో కంటతడి పెట్టిన కావ్య.. రాజ్ ను కౌగిలించుకుంటుంది. తనపై ఎంత కోపం ఉన్నా.. ఎప్పుడూ తనను విడిచి వెళ్లొద్దని రాజ్ ను ఆమె కోరుతుంది.

తల్లి రుద్రాణిని నిలదీసిన రాహుల్

అటు కావ్య, రాజ్ మళ్లీ కలిసిపోవడంతో తన ప్లాన్ ఫెయిలైందని రుద్రాణి బాధపడుతూ ఉంటుంది. అప్పుడే రాహుల్ ఓ బొచ్చ పట్టుకొని వచ్చి.. ఇక మనకు ఇదే గతి అని అంటాడు. నన్ను ఇంటికి వారసుడిని చేస్తానని కనీసం కంపెనీలో సీఈవోను కూడా చేయలేదని, ఎపిసోడ్ 1 నుంచి అదే చెబుతున్నా.. ఎపిసోడ్ 800 దాటినా అదే మాట చెబుతున్నావని రాహుల్ ఆమెను నిలదీస్తాడు. కావ్య ప్రెగ్నెంట్ అని, ఇక ఆ వారసుడు బయటకు వస్తే మనల్ని బయటకు పంపించేస్తాడని అంటాడు. దీంతో రుద్రాణి అతన్ని తిడుతూ.. అలాంటిదేమీ జరగదని ఎవరికి ఎక్కడికి పంపిచాలో అక్కడికి పంపిస్తానని అంటుంది.

కావ్యను ఎత్తుకొని తీసుకెళ్లిన రాజ్

అటు కావ్య మెట్లు ఎక్కబోతుంటే రాజ్ వస్తాడు. అసలు నువ్వేం చేస్తున్నావ్.. కడుపుతో ఉన్నప్పుడు ఇలా మెట్లు ఎక్కొద్దని వారిస్తాడు. మరి పైకి ఫ్లైట్ లో వెళ్లాలా అని వెటకారంగా అడుగుతుంది. లేక మీరు ఎత్తుకొని తీసుకెళ్తారా అని అంటుంది. దీంతో అవును అంటూ రాజ్ ఆమెను ఎత్తుకుంటాడు. పైన గదిలోకి తీసుకెళ్తాడు. ఈ సీన్ ను వాళ్ల వెనకాలే ఉన్న కల్యాణ్, అప్పు చూస్తారు. పైన గదిలోకి తీసుకెళ్లిన తర్వాత రోజూ ఇలాగే తీసుకొస్తారా? నేను రోజుకు వందసార్లు పైకి, కిందికి తిరుగుతాను అని కావ్య అంటుంది. దీనికి ఏదో ప్లాన్ వేయాల్సిందే అని రాజ్ అనుకుంటాడు.

కల్యాణ్‌ను రెచ్చగొట్టిన అప్పు.. ఎత్తుకున్న కల్యాణ్

ఇటు కావ్యను రాజ్ ఎత్తుకొని వెళ్లడం చూసిన అప్పూ.. తనను కూడా కల్యాణ్ అలాగే తీసుకెళ్లాలని ఆశపడుతుంది. అలా తీసుకెళ్లేలా కల్యాణ్ ను రెచ్చగొడుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో కల్యాణ్ కూడా అప్పూని ఎత్తుకొని పైకి తీసుకెళ్తాడు. ఆ తర్వాత ఆయాస పడుతూ కిందికి వచ్చి మెట్ల మీద కూర్చొంటాడు. అటు కావ్య కిందికి దిగకుండా ఏం చేయాలా అని ఆలోచిస్తూ కిందికి వస్తున్న రాజ్ అనుకోకుండా కల్యాణ్ చేయి తొక్కుతాడు. దీంతో కల్యాణ్ లబోదిబోమంటాడు. నువ్వు ఇక్కడ కూర్చున్నావేంటి రా అని అడిగితే.. అంతా నీవల్లే నువ్వు వదినను పైకి ఎత్తుకొని వెళ్లడం చూసి అప్పూ కూడా తనను ఎత్తుకొని తీసుకెళ్లమంది.. అందుకే తన పరిస్థితి ఇలా అయిందని కల్యాణ్ బాధపడతాడు.

రాజ్, కల్యాణ్ కొత్త ప్లాన్..

నిజమే ఇలా రోజూ ఎత్తుకొని తీసుకెళ్లాలంటే తనకూ కష్టమే అని రాజ్ అంటాడు. అందుకే ఓ ప్లాన్ ఆలోచించాలంటూ ఇద్దరూ కలిసి తమ తల్లుల వైపు చూస్తారు. తమ పేరెంట్స్ ను పైన తమ గదుల్లోకి పంపించి.. కింది గదుల్లోకి తాము రావాలని స్కెచ్ వేస్తారు. వాళ్ల లగేజీలు కూడా రెడీ చేయడంతో రాజ్ కు గతం గుర్తుకు వచ్చిందన్న సంతోషంలో మమ్మల్ని టూర్ కి పంపిస్తున్నారా అని ప్రకాశ్ అడుగుతాడు. అవును నాన్న రూమ్స్ కూడా బుక్ చేశామని కల్యాణ్ అంటాడు. తర్వాత అసలు విషయం చెప్పడంతో ఉసూరుమంటాడు.

అటు తమ ఈ కష్టాలన్నింటికీ యామినియే కారణమని రాజ్ తో చెబుతుంది కావ్య. దీంతో దాని అంతు చూస్తానని రాజ్ వెళ్తాడు. రాజ్ కోపం చూసి అతని కాళ్లు పట్టుకుంటుంది యామిని. తమకు యాక్సిడెంట్ అయిందని అనుకుంటున్నానని, అది చేసింది నువ్వే అని తేలితే మాత్రం నిన్ను, నీ కుటుంబాన్ని వదలను అని రాజ్ వార్నింగ్ ఇవ్వడంతో ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్ ముగుస్తుంది.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024