13 ఏళ్ల తర్వాత భావన తమిళంలో చేసిన మూవీ.. మరణాల వెనకున్న దెయ్యాన్ని వెతికే కథ.. ఓటీటీలో దంచికొడుతున్న హారర్ థ్రిల్లర్

Best Web Hosting Provider In India 2024

13 ఏళ్ల తర్వాత భావన తమిళంలో చేసిన మూవీ.. మరణాల వెనకున్న దెయ్యాన్ని వెతికే కథ.. ఓటీటీలో దంచికొడుతున్న హారర్ థ్రిల్లర్

తెలుగులో మహాత్మ సినిమాలో శ్రీకాంత్ తో ఆడిపాడిన హీరోయిన్ భావన గుర్తుందా? ఈ భామ 13 ఏళ్ల తర్వాత తమిళంలో మరో సినిమా చేసింది. ఈ హారర్ థ్రిల్లర్ ఇప్పుడు ఓటీటీలో అదరగొడుతోంది. సస్పెన్స్ తో ఊపేసే ఈ మూవీ ఎక్కడ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

ఓటీటీలో తమిళ హారర్ థ్రిల్లర్ (x/ahatamil)

ఓటీటీలోకి మరో తమిళ హారర్ థ్రిల్లర్ దూసుకొచ్చింది. అదిరిపోయే సస్పెన్స్ తో ఆడియన్స్ ను భయపెట్టేందుకు ‘ది డోర్’ (The Door) మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఓటీటీలో అదరగొడుతోంది. క్యూట్ బ్యూటీ భావన 13 ఏళ్ల తర్వాత ఈ సినిమాతో తిరిగి కోలీవుడ్ లో అడుగుపెట్టడం విశేషం. మరి ఈ సినిమా ఏ ఓటీటీలో ఉంది? దీని కథ ఏంటో తెలుసుకుందాం.

ఏ ఓటీటీలో?

తమిళ హారర్ థ్రిల్లర్ ది డోర్ ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఆగస్టు 29నే ఓటీటీ రిలీజైంది. ఆహా తమిళ్ లో ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడైతే తమిళంలోనే అందుబాటులో ఉంది. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఉన్నాయి. ఓటీటీలో ఈ మూవీ సత్తాచాటుతోంది. హారర్ తో ఆడియన్స్ కు థ్రిల్ పంచుతుంది.

13 ఏళ్ల తర్వాత

ది డోర్ మూవీలో హీరోయిన్ భావన లీడ్ రోల్ ప్లే చేసింది. 13 ఏళ్ల తర్వాత తిరిగి తమిళంలో ఆమె చేసిన సినిమా ఇది. ఈ మూవీకి భావన బ్రదర్ జైదేవ్ డైరెక్టర్. సోదరుడి కోసం మళ్లీ కోలీవుడ్ కు రీ ఎంట్రీ ఇచ్చింది భావన. ది డోర్ మూవీలో భావన నటనకు మంచి మార్కులు పడ్డాయి. ముఖ్యంగా సస్సెన్స్ రేకెత్తించే సీన్లలో ఆమె యాక్టింగ్ అదిరిపోయిందనే టాక్ వినిపిస్తోంది.

అయిదు నెలల తర్వాత

థియేటర్లలో రిలీజైన అయిదు నెలల తర్వాత ది డోర్ ఓటీటీలోకి వచ్చింది. 2025 మార్చి 28న ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది. థియేటర్లలో ఈ సినిమాకు మిక్స్ డ్ రివ్యూస్ వచ్చాయి. భావన యాక్టింగ్ బాగుందని కానీ స్క్రీన్ ప్లే అంత గ్రిప్పింగ్ లేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు అయిదు నెలల తర్వాత ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది.

కథ ఏమిటంటే?

మిత్ర (భావన) ఓ ఆర్కిటెక్ట్. తన పనిలో భాగంగా ఓ కన్ స్ట్రక్షన్ సైట్ కు వెళ్తుంది మిత్ర. అక్కడికి వెళ్లినప్పటి నుంచి ఆమెకు విచిత్రమైన మనుషులు కనిపిస్తారు. కొన్ని శవాలను చూస్తుంది. ఆ బిల్డింగ్ లో ఏదో సూపర్ నేచురల్ పవర్ ఉందని ఆమెకు అనిపిస్తుంది. దెయ్యాన్ని వెతకాలని ఫిక్స్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నదే ది డోర్ కథ.

ఈ సినిమాలో భావనతో పాటు గణేష్ వెంకట్రామన్, ప్రియా వెంకట్, జయప్రకాష్, శ్రీరంజిని తదితరులు నటించారు. తెలుగులో ఒంటరి, హీరో, మహాత్మ చిత్రాల్లో హీరోయిన్ గా చేసింది భావన.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024