




Best Web Hosting Provider In India 2024
New Zealand PR : రూ. 16,000 వేలకే న్యూజిలాండ్‌లో పర్మనెంట్ రెసిడెన్సీ పొందొచ్చు..!
న్యూజిలాండ్‌లో సుమారు రూ. 16వేల ఫీజుతో పర్మనెంట్ రెసిడెన్సీ పొందొచ్చు! న్యూజిలాండ్ పీఆర్‌కి సంబంధించి భారతీయులు తెలుసుకోవాల్సిన అన్ని వివరాలను ఇక్కడ చూసేయండి..
అత్యంత సుందరమైన లొకేషన్స్ మధ్య లేదా నిశ్శబ్దమైన సరస్సు ఒడ్డున జీవితం గడపాలని కలలు కంటున్నారా? అయితే, న్యూజిలాండ్ మీ తదుపరి గమ్యస్థానం కావచ్చు! సుందరమైన బీచ్‌లు, పచ్చని ప్రకృతి మధ్య ప్రశాంతమైన జీవితాన్ని కోరుకునే వారికి, కెరీర్ అవకాశాల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారికి న్యూజిలాండ్ మంచి ఆప్షన్‌గా నిలుస్తోంది.
అంతేకాదు, న్యూజిలాండ్ రెసిడెన్స్ వీసా, పర్మినెంట్ రెసిడెన్సీ (పీఆర్)లను అందిస్తుంది. అయితే, న్యూజిలాండ్ పీఆర్ కోసం ఎలా అప్లై చేయాలో ఇక్కడ తెలుసుకుందాము..
న్యూజిలాండ్ పీఆర్ అంటే ఏమిటి?
న్యూజిలాండ్ పర్మనెంట్ రెసిడెన్సీ (పీఆర్) అంటే పర్మనెంట్ రెసిడెంట్ వీసా (పీఆర్‌వీ) కలిగి ఉండటం. మీరు మొదట పొందే రెసిడెంట్ వీసా లాగా కాకుండా, పీఆర్‌వీకి ప్రయాణ నిబంధనలు ఉండవు. ఇది మీకు దేశంలో నిరవధికంగా నివసించడానికి, పని చేయడానికి, చదువుకోవడానికి వీలు కల్పిస్తుంది. సాధారణంగా, మీరు రెసిడెంట్ వీసా పొందిన 2 సంవత్సరాల తర్వాత, న్యూజిలాండ్‌లో నివసించడానికి మీరు నిజంగా కట్టుబడి ఉన్నారని నిరూపించుకున్న తర్వాత పీఆర్‌వీ కోసం అప్లై చేసుకోవచ్చు.
న్యూజిలాండ్ పీఆర్ కోసం ఎవరికి అర్హత ఉంటుంది?
న్యూజిలాండ్ పీఆర్‌కు నేరుగా అప్లై చేయడం సాధ్యం కాదు! మీరు మొదట రెసిడెంట్ వీసా పొందాలి. అక్కడి నుంచి 2 సంవత్సరాల నివాసం తర్వాత పీఆర్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కింది అర్హతలు ఉన్నవారు పీఆర్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు:
- వయసు 18 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలి.
- మీ ప్రస్తుత రెసిడెంట్ వీసా గడువు 90 రోజులు లేదా అంతకంటే తక్కువగా ఉన్నట్లయితే, మీరు పీఆర్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.
- మీ రెసిడెంట్ వీసా నిబంధనలను మీరు పాటించి ఉండాలి.
- న్యూజిలాండ్ ఆర్థిక వ్యవస్థకు సహకరించడానికి కట్టుబడి ఉండాలి.
- స్కిల్డ్ మైగ్రెంట్ కేటగిరీ, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ నిబంధనలను పాటించాలి.
న్యూజిలాండ్ రెసిడెంట్ వీసా ఎలా పొందాలి?
1. అర్హతను నిర్ధారించుకోండి: మీరు రెసిడెంట్ వీసాకు అర్హులా కాదా అనేది తెలుసుకుని, అవసరమైన పత్రాలను సేకరించండి.
2. ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ) సమర్పించండి: ఇమ్మిగ్రేషన్ న్యూజిలాండ్ వెబ్‌సైట్ ద్వారా ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్‌ని సమర్పించాలి.
3. దరఖాస్తుకు ఆహ్వానం: మీ ఈఓఐ ఎంపికైతే, మీకు దరఖాస్తు చేయడానికి ఆహ్వానం (ఐటీఏ) లభిస్తుంది.
4. దరఖాస్తు రుసుము చెల్లించండి: మీ వీసా రకాన్ని బట్టి దరఖాస్తును పూర్తి చేసి, రుసుము చెల్లించండి.
- స్కిల్డ్ మైగ్రెంట్ వీసా: NZD 6,450 (సుమారు రూ. 3,30,971)
- న్యూజిలాండ్ వాసి భాగస్వామి వీసా: NZD 3,610 (సుమారు రూ. 1,85,241)
- పేరెంట్ రెసిడెంట్ వీసా: NZD 3,610
5. పత్రాలను సమర్పించండి: అవసరమైన అన్ని పత్రాలను సమర్పించాలి.
6. వీసా మంజూరు: మీ దరఖాస్తు ఆప్రూవ్ అయితే, మీకు రెసిడెంట్ వీసా మంజూరవుతుంది.
న్యూజిలాండ్‌లో పర్మనెంట్ రెసిడెన్సీ ఎలా పొందాలి?
1. రెండేళ్లు ఉండాలి: రెసిడెంట్ వీసా పొందిన తర్వాత 2 సంవత్సరాలు న్యూజిలాండ్‌లో నివసించాలి. ప్రతి సంవత్సరం కనీసం 184 రోజులు దేశంలో ఉండాలి.
2. సర్టిఫికెట్లు సమర్పించండి: న్యూజిలాండ్ ఇమ్మిగ్రేషన్ నుంచి మీ హెల్త్ హిస్టరీ సర్టిఫికెట్లను సమర్పించాలి.
3. ఆమోదం పొందండి: మీరు అన్ని ప్రమాణాలకు సరిపోయి, న్యూజిలాండ్‌లో నివసించడానికి కట్టుబడి ఉన్నారని నిరూపించుకున్న తర్వాత, పర్మనెంట్ రెసిడెన్సీ కోసం దరఖాస్తు చేయడానికి ఆమోదం లభిస్తుంది.
4. రుసుము చెల్లించండి: పీఆర్ కోసం NZD 315 (సుమారు రూ. 16,163) రుసుము చెల్లించాలి.
ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్, మెడికల్ ఎగ్జామ్స్, పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్ల కోసం అదనపు ఖర్చులు ఉంటాయి.
న్యూజిలాండ్ పీఆర్ పొందిన తర్వాత మీరు నివసించడమే కాకుండా, పని, చదువుకోవచ్చు. దేశంలో 12 నెలలు నివసించిన తర్వాత ఓటు వేసే హక్కు కూడా లభిస్తుంది! ఈ పీఆర్‌కు గడువు ఉండదు, కాబట్టి దేశాన్ని వదిలి వెళ్లాలనే చింత లేకుండా ఎంత కాలమైనా ఉండవచ్చు.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link