





Best Web Hosting Provider In India 2024

దుల్కర్ సల్మాన్ నిర్మించిన మలయాళం సూపర్ హీరో మూవీ.. బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్.. తెలుగులోనూ సూపర్ హిట్..
మలయాళం సూపర్ హీరో మూవీ ఇప్పుడు బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తోంది. కల్యాణి ప్రియదర్శన్, నస్లేన్ నటించిన ఈ సినిమా నాలుగు రోజుల్లోనే రూ.50 కోట్లకు చేరువైంది. తెలుగులోనూ ఈ మూవీకి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ నిర్మించి, కల్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్‌లో నటించిన సూపర్ హీరో మూవీ లోక ఛాప్టర్ 1. ఈ ఫిమేల్ సూపర్ హీరో సినిమా డొమెస్టిక్ మార్కెట్‌లో భారీ రెస్పాన్స్ తో మొదలైంది. సినిమాకి మంచి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. ఇది ఇప్పుడు ఓనం రిలీజ్‌లన్నిటినీ దాటేసింది. నాలుగు రోజుల్లోనే రూ.50 కోట్ల కలెక్షన్లకు చేరువవుతోంది.
లోక ఛాప్టర్ 1 బాక్సాఫీస్ కలెక్షన్లు
కల్యాణి ప్రియదర్శన్, ప్రేమలు ఫేమ్ నస్లేన్ లీడ్ రోల్స్ లో నటించిన మలయాళం ఫిమేల్ సూపర్ హీరో మూవీ లోక ఛాప్టర్ 1. sacnilk.com ప్రకారం ఈ మూవీ నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.41 కోట్లు వసూలు చేసింది. ఇండియా కంటే విదేశాల్లో ఈ సినిమాకు మరింత మంచి రెస్పాన్స్ వస్తుండటం విశేషం.
ఇండియాలో రూ.16.7 కోట్లు రాగా.. ఓవర్సీస్ లో రూ.24.3 కోట్లు రాబట్టింది. కేవలం మలయాళం వెర్షన్ లోనే ఇప్పటి వరకూ రూ.19.65 కోట్లు వచ్చాయి. రోజురోజుకూ వసూళ్లు పెరుగుతూనే ఉన్నాయి. తొలిరోజు మలయాళంలో రూ2.5 కోట్లు రాగా.. నాలుగో రోజు అయిన ఆదివారం (ఆగస్టు 31) అవి కాస్తా రూ.7.5 కోట్లకు చేరాయి. మోహన్‌లాల్ నటించిన హృదయపూర్వం సినిమాను కూడా ఈ మూవీ వెనక్కి నెట్టేసింది.
తెలుగులోనూ సూపర్ హిట్
ఇక తెలుగులో కొత్త లోక పేరుతో ఒక రోజు ఆలస్యంగా రిలీజ్ కాగా.. ఇక్కడ కూడా రూ.3.6 కోట్లు వసూలు చేయడం విశేషం. మూడు రోజుల్లోనే ఈ స్థాయి వసూళ్లు నిజంగా గొప్ప ఘనతే. తొలి రోజు కేవలం రూ.0.35 కోట్లు మాత్రమే రాగా.. రెండో రోజు రూ.1.2 కోట్లు, మూడో రోజు రూ.1.6 కోట్లకు చేరాయి. దీంతో తెలుగులోనూ ఈ మూవీ సూపర్ హిట్ గా నిలుస్తోంది.
లోక ఛాప్టర్ 1 మూవీ గురించి..
లోక చాప్టర్ 1 అనేది దుల్కర్ సల్మాన్ ప్లాన్ చేసిన వేఫేరర్ సినిమాటిక్ యూనివర్స్‌లో మొదటి సినిమా. ఇందులో కల్యాణి.. చంద్ర అనే ఒక యువతి పాత్రలో నటించింది. ఆమె 20 సంవత్సరాలు స్వీడన్‌లో ఉండి, రీసెంట్‌గా బెంగళూరుకి వస్తుంది. ఆమె ఎక్కువగా సాయంత్రం బయటికి వస్తుంది.
ఇది ఎదురుగా ఉండే ఇంట్లో ఉంటున్న ఇద్దరు యువకులు సన్నీ (నస్లేన్), వేణు (చందు సలీంకుమార్) లను ఆకట్టుకుంటుంది. వాళ్ళిద్దరూ చంద్ర గతం గురించి ఎలా తెలుసుకుంటారనేది ఈ సినిమా కథ. సినిమాలోని బలమైన రైటింగ్, యాక్షన్ సీక్వెన్సెస్, విఎఫ్ఎక్స్ సోషల్ మీడియాలో భారీగా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి.
లోక ఛాప్టర్ 1 సినిమాకు డొమినిక్ అరుణ్, శాంతి బాలచంద్రన్ కథ రాశారు. దీనిని డొమినిక్ అరుణ్ డైరెక్ట్ చేశాడు. జేక్స్ బెజోయ్ మ్యూజిక్ అందించగా, నిమిష్ రవి సినిమాటోగ్రఫీని హ్యాండిల్ చేశారు. టొవినో థామస్, దుల్కర్ సల్మాన్ కూడా సినిమాలో క్యామియో రోల్స్‌లో కనిపించారు. ఇది తర్వాత వచ్చే సీక్వెల్‌ల గురించి ఫ్యాన్స్‌లో మరింత ఆసక్తిని పెంచింది.
సంబంధిత కథనం