రెండు హత్యలు.. హంతకులను పట్టించే గుండెలో పెట్టే ఓ చిన్న పరికరం.. తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మలయాళం థ్రిల్లర్ చూశారా

Best Web Hosting Provider In India 2024

రెండు హత్యలు.. హంతకులను పట్టించే గుండెలో పెట్టే ఓ చిన్న పరికరం.. తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మలయాళం థ్రిల్లర్ చూశారా

Hari Prasad S HT Telugu

మలయాళం థ్రిల్లర్ మూవీ ఒకటి ఇప్పుడు ఓటీటీలో సంచలనం సృష్టిస్తోంది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా రెండు హత్యల చుట్టూ తిరుగుతుంది. ఆ హత్య కేసులను ఛేదించడంలో మనుషుల గుండెల్లో పెట్టే ఓ చిన్న పరికరం ఎలా ఉపయోగపడిందన్నది ఇందులో చూడొచ్చు.

రెండు హత్యలు.. హంతకులను పట్టించే గుండెలో పెట్టే ఓ చిన్న పరికరం.. తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మలయాళం థ్రిల్లర్ చూశారా

మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ సూత్రవాక్యం (Soothravakyam). జులై 11న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ గత నెలలోనే ఈటీవీ విన్ ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్ కు వచ్చింది. ప్రముఖ మలయాళ నటుడు షైన్ టామ్ చాకో ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన ఈ సినిమా ఎలా ఉందో చూడండి.

సూత్రవాక్యం మూవీ స్టోరీ ఇదీ..

మలయాళం థ్రిల్లర్ సూత్రవాక్యం మూవీని యూజీన్ జోస్ చిరమ్మెల్ డైరెక్ట్ చేశాడు. అతనికి ఇదే తొలి సినిమా. షైన్ టామ్ చాకో, విన్సీ లోషియస్ లాంటి వాళ్లు లీడ్ రోల్స్ లో నటించారు. కామెడీ జోడించిన ఓ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ఇది. ఇందులో క్రిస్టో జేవియర్ అనే ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో షైన్ టామ్ చాకో నటించాడు. ఇక నిమిషా అనే మ్యాథ్స్ టీజర్ పాత్రలో విన్సీ లోషియస్, వివేక్ పాత్రలో దీపక్ పరంబోల్, ఆర్య పాత్రలో అనఘా నటించారు.

ఈ సినిమా ప్రధానంగా ఈ పాత్రల చుట్టే తిరుగుతుంది. క్రిస్టో తన పోలీస్ స్టేషన్ లోనే ట్యూషన్స్ చెబుతుంటాడు. అతని దగ్గరికి 11వ తరగతి చదివే ఆర్య కూడా ట్యూషన్ కు వస్తుంది. తన అన్నయ్య అయిన వివేక్ ఎప్పుడూ ఆమెను వేధిస్తూ ఉంటాడు. ఇదే విషయంలో ఒకసారి వివేక్ కు క్రిస్టో గట్టి వార్నింగ్ కూడా ఇస్తాడు. అయినా అతడు మారడు. ఈ క్రమంలో ఊహించని పరిస్థితుల్లో వివేక్ చనిపోతాడు?

అసలు అతడు ఎలా కన్నుమూస్తాడు? కనిపించకుండాపోయిన అతని కేసును దర్యాప్తు చేయడానికి రంగంలోకి దిగిన క్రిస్టోకి మరో హత్య గురించి ఎలా తెలుస్తుంది? ఈ రెండు హత్యలకు ఒక చిన్న పరికరమే ఎలా క్లూ అవుతుంది అన్నది ఈ సూత్రవాక్యం మూవీ మిగిలిన కథ.

సూత్రవాక్యం ఎలా ఉందంటే?

సూత్రవాక్యం చాలా మలయాళం థ్రిల్లర్ సినిమాల్లాగే నెమ్మదిగా మొదలవుతుంది. మొదట్లో అంతా కాస్త కామెడీగా, ఓ ఫ్యామిలీ డ్రామాలా అనిపిస్తుంది. పోలీస్ స్టేషన్ లోనే ట్యూషన్లు చెప్పే పోలీసు.. అతని దగ్గరికి తన పిల్లలు వెళ్లడంతో హర్ట్ అయ్యే ఓ టీచర్.. ఓ చర్చి ఫాదర్, ఆ ఊరి పొలిమేరలోని బావి.. ఇలా స్టోరీ ఎక్కడెక్కడికో వెళ్తుంది.

అయితే వివేక్ చనిపోయే సీన్ దగ్గరి నుంచి మూవీ ఇంట్రెస్టింగా మారుతుంది. ఓ సాదాసీదా ఫ్యామిలీ డ్రామా అక్కడి నుంచి ఊహించని ట్విస్టులతో మంచి థ్రిల్ అందిస్తూ సాగుతుంది. కేవలం గంటా 52 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ ఎపిసోడ్ మొత్తం ఆసక్తిగా అనిపిస్తుంది. తన లవర్ ను వేధిస్తున్న ఆమె అన్నయ్యపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఓ పిల్లాడు చేసే పని మూవీని మలుపు తిప్పుతుంది.

అది కాస్తా మరో హత్యను బయటకు తీసుకొస్తుంది. అది ఓ అమ్మాయికి సంబంధించినది. ఆమె గుండెల్లో అమర్చిన పేస్ మేకరే కేసులో కీలకమైన ట్విస్ట్. ఓ డిఫరెంట్ స్టోరీ లైన్ అయినా.. దానిని స్క్రీన్ పై మరీ అంత ఆసక్తిగా మలచలేదని అనిపిస్తుంది. చివర్లో ఇన్వెస్టిగేషన్ కూడా చాలా వేగంగా సాగిపోయిన ఫీలింగ్ వస్తుంది. క్లైమ్యాక్స్ కూడా అంతగా కిక్ ఇవ్వదు. అయితే ఓవరాల్ గా మాత్రం ఓ మంచి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చూసిన ఫీలింగ్ మాత్రం కలుగుతుంది.

ఈ సూత్రవాక్యం సినిమాకు ఐఎండీబీలో 7.5 రేటింగ్ నమోదైంది. ఈ సినిమా ప్రస్తుతం ఈటీవీ విన్ ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024