





Best Web Hosting Provider In India 2024

డ్రాగన్ లో తారక్ తో రొమాన్స్ చేసేది ఈ బ్యూటీనే.. అనౌన్స్ చేసిన ప్రొడ్యూసర్!
సస్పెన్స్ కు తెరపడ్డట్లే. ప్రశాంత్ నీల్, జూనియర్ ఎన్టీఆర్ సినిమా డ్రాగన్ హీరోయిన్ ఫిక్స్ అయినట్లే. రీసెంట్ గా మదరాసి ప్రి రిలీజ్ ఈవెంట్ లో ప్రొడ్యూసర్ ఎన్వీ ప్రసాద్ చేసిన కామెంట్లే అందుకు నిదర్శనం.
ప్రశాంత్ నీల్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో యాక్షన్ థ్రిల్లర్ డ్రాగన్ తెరకెక్కుతోంది. ఈ ప్రాజెక్ట్ ఇండియాలో మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ఒకటి. ఈ సినిమా కోసం పాన్ ఇండియా స్థాయిలో ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాలో తారక్ తో రొమాన్స్ చేసే హీరోయిన్ ఎవరనేది ఇన్ని రోజులు సస్పెన్స్ గానే ఉండేది. ఇప్పుడు దీనిపై ఓ క్లారిటీ వచ్చింది.
ఆ బ్యూటీ
జూనియర్ ఎన్టీఆర్ సరసన డ్రాగన్ సినిమాలో కన్నడ బ్యూటీ రొమాన్స్ చేయనుంది. తారక్ సరసన రుక్మిణి వసంత్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ బ్యూటీ ఇప్పుడు తమిళంలో మదరాసి సినిమా చేసింది. ఈ మూవీ రిలీజ్ కు రెడీ అయింది. రీసెంట్ గా ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ జరిగింది.
ప్రొడ్యూసర్ అనౌన్స్ మెంట్
మదరాసి ప్రి రిలీజ్ ఈవెంట్లో ప్రొడ్యూసర్ ఎన్వీ ప్రసాద్ బిగ్ న్యూస్ చెప్పారు. డ్రాగన్ సినిమాలో రుక్మిణి నటిస్తుందని వెల్లడించారు. మదరాసి సినిమాకు ఏఆర్ మురుగదాస్ డైరెక్టర్. శివ కార్తీకేయన్ హీరో. అయితే డ్రాగన్ సినిమాలో యాక్టింగ్ విషయంపై రుక్మిణి నుంచి గానీ మూవీ టీమ్ నుంచి గానీ ఎలాంటి అఫీషియల్ అప్ డేట్ రాలేదు. షెడ్యూల్ ప్రకారం షూటింగ్ జరిగితే జూన్ 25, 2026న డ్రాగన్ పాన్ ఇండియా లెవెెల్లో రిలీజయ్యే అవకాశముంది.
ఎవరీ రుక్మిణి?
బెంగళూరులో పుట్టిన రుక్మిణి వసంత్ 2019లో కన్నడ సినిమాతో తెరంగేట్రం చేసింది. హిందీలోనూ నటించింది. తెలుగులో సప్త సాగరాలు దాటి అనే పేరుతో వచ్చిన కన్నడ మూవీతో ఇక్కడి ఆడియన్స్ కు చేరువైంది రుక్మిణి. హీరో నిఖిల్ సరసన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో మూవీలో నటించింది.
భారీ ప్రాజెక్టులు
అందం, అభినయంతో ఆకట్టుకుంటున్న రుక్మిణి వరుసగా భారీ ప్రాజెక్టుల్లో ఛాన్స్ లు కొట్టేస్తోంది. విజయ్ సేతుపతితో ఏస్ మూవీ చేసిన ఈ భామ.. ఇప్పుడు శివ కార్తీకేయన్ తో మదరాసి సినిమా కంప్లీట్ చేసింది. కాంతారా ఛాప్టర్ 1లోనూ నటించింది. మరో కన్నడ, ఇంగ్లీష్ సినిమా చేస్తోంది. ఇప్పుడు డ్రాగన్ మూవీలో తారక్ తో నటించే అవకాశం దాదాపుగా సొంతం చేసుకున్నట్లే.
ప్రశాంత్ నీల్, జూనియర్ ఎన్టీఆర్ కాంబోల్ పుల్ యాక్షన్ థ్రిల్లర్ గా డ్రాగన్ రెడీ అవుతోంది.
సంబంధిత కథనం