





Best Web Hosting Provider In India 2024

బిగ్ బాస్ మోనాల్ నటించిన సూపర్ నేచురల్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్.. 8.1 ఐఎండీబీ రేటింగ్.. ఓటీటీలోకి ఎప్పుడంటే?
సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్ కు సీక్వెల్ గా వచ్చిన ‘వశ్ లెవల్ 2’ మూవీ థియేటర్లలో అదరగొడుతోంది. బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ నటించిన ఈ గుజరాతీ ఫిల్మ్ సోషల్ మీడియాలో ట్రెండ్ గా మారింది. ఈ సూపర్ హిట్ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందో చూద్దాం.
ఇప్పుడు ఇండియాలో ఒక మూవీ గురించి ఎక్కువగా డిస్కషన్ జరుగుతోంది. చిన్న సినిమాగా వచ్చిన ఈ హారర్ థ్రిల్లర్ బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ మూవీ గురించి పోస్టులు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. ఇంటర్నెట్ లో ట్రెండింగ్ గా ఉంది ఈ సినిమా. అదే ‘వశ్ లెవల్ 2’. సూపర్ హిట్ ‘వశ్’ మూవీకి సీక్వెల్ గా వచ్చింది ఈ సూపర్ నేచురల్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్. బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న ఈ మూవీ ఓటీటీ రిలీజ్ పై బజ్ నెలకొంది.
సూపర్ హిట్
సూపర్ నేచురల్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ ‘వశ్ లెవల్ 2’ సినిమాపై అన్ని వర్గాల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ గుజరాతీ ఫిల్మ్ వేరే లెవల్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. గ్రిప్పింగ్ స్టోరీ లైన్, థ్రిల్ పంచే సీన్లతో మూవీ అదిరిపోయిందని అంటున్నారు. ఆగస్టు 27న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. కేవలం రూ.5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే డబుల్ కలెక్షన్లు రాబట్టింది.
ఏ ఓటీటీలోకి?
హారర్ థ్రిల్లర్ ‘వశ్ లెవల్ 2’ ఓటీటీ రిలీజ్ పై బజ్ నెలకొంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో అలరించిన బ్యూటీ మోనాల్ గజ్జర్ ఈ మూవీలో కీ రోల్ ప్లే చేసింది. ఈ సినిమా షీమారోమీ ఓటీటీలోకి వచ్చేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి. థియేటర్లలో మూవీ బాగా నడుస్తోంది కాబట్టి కనీస విండో నాలుగు వారాల నుంచి ఎనిమిది వారాల వరకూ ఈ మూవీ ఓటీటీలోకి వచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి. అంటే ఈ మూవీని డిజిటల్ స్ట్రీమింగ్ లో చూడాలంటే కనీసం మరో నెల వెయిట్ చేయక తప్పదు.
కథ ఏమిటంటే?
దెయ్యం నుంచి 12 ఏళ్ల క్రితం తన కూతురు ఆర్యను కాపాడుకుంటాడు అథర్వ. కానీ ఆ ప్రాబ్లెం తిరిగి వస్తుంది. తన కూతురితో పాటు ఆమె స్నేహితులు పాఠశాలలో ఎవరో ఆడించే బొమ్మలుగా మారిపోతారు. దీంతో అథర్వ మరోసారి కూతురిని రక్షించుకోవడానికి సిద్ధమవుతాడు. అసలు ఆ దెయ్యం ఎవరు? ఆర్యకు ఏమైంది? అనేది తీవ్రమైన ఉత్కంఠ కలిగిస్తుంది.
ఈ సినిమాలో ఆర్యగా జానకి బోడీవాలా అద్భుతంగా నటించింది. హితు కనోడియా, హితెన్ కుమార్, మోనాల్ గజ్జర్, విశ్వ రావల్ తదితరులు తమ పాత్రలు గొప్పగా పోషించారు. ఈ సినిమాకు క్రిష్ణదేవ్ యాగ్నిక్ డైరెక్టర్. కథ కూడా ఆయనదే. కల్పేష్ సోని, కృనాల్ సోని ప్రొడ్యూసర్లు.
సంబంధిత కథనం