




Best Web Hosting Provider In India 2024

తెలంగాణలో రాష్ట్ర కోటా కింద మెడికల్ కాలేజీ అడ్మిషన్లకు నాలుగేళ్ల స్థానికత తప్పనిసరి : సుప్రీం కోర్టు
తెలంగాణలో వైద్య విద్య చదవాలనుకునే విద్యార్థులకు నాలుగు సంవత్సరాల స్థానికత తప్పనిసరి అని సుప్రీం కోర్టు పేర్కొంది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై జీవో విడుదల చేసిన విషయం తెలిసిందే.
తెలంగాణలో వైద్య విద్య గురించి సుప్రీం కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. నాలుగేళ్ల స్థానికత తప్పనిసరి అని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోను అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. ఈ మేరకు 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు తెలంగాణలో చదవాల్సిందే. ఈ మేరకు గతంలో తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి, డివిజెన్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులు పక్కన పెడుతూ.. సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం తీర్పునిచ్చింది.
ఈ మేరకు రాష్ట్ర కోటా కింద వైద్య, దంత కళాశాలల్లో ప్రవేశం కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన స్థానికత నిబంధనను సుప్రీంకోర్టు సోమవారం సమర్థించింది. ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్, న్యాయమూర్తి కె.వినోద్ చంద్రన్ లతో కూడిన ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పీల్‌ను అనుమతించి, తెలంగాణ మెడికల్ అండ్ డెంటల్ కాలేజీల అడ్మిషన్ నియమాలు, 2017ను సమర్థించింది.
ఈ నిబంధనల ప్రకారం రాష్ట్రంలో 9 నుంచి 12వ తరగతి వరకు చదివిన విద్యార్థులకు మాత్రమే రాష్ట్ర కోటా కింద వైద్య, దంత కళాశాలల్లో ప్రవేశం కల్పించాయి. తెలంగాణ హైకోర్టు గతంలో తీర్పు ఇస్తూ.. రాష్ట్రంలోని శాశ్వత నివాసితులు కొంతకాలం రాష్ట్రం వెలుపల నివసించినందున వైద్య కళాశాలల్లో ప్రవేశ ప్రయోజనాలను తిరస్కరించలేరని పేర్కొంది. రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన నివాస నియమాన్ని కొట్టివేసిన ఉత్తర్వులు ఇచ్చింది.
దీనిపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లింది. పిటిషన్‌పై ఆగస్టు 5న సుప్రీంకోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది. రాష్ట్ర కోటా కింద వైద్య, దంత కళాశాలల్లో ప్రవేశాలకు నాలుగేళ్ల స్థానికత తప్పనిసరి కానుంది. రాష్ట్రం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ, న్యాయవాది శ్రావణ్ కుమార్ కర్ణం హాజరయ్యారు.
టాపిక్