నిరుద్యోగులకు అలర్ట్​! ఐబీపీఎస్​ ఆర్​ఆర్​బీ పీఓ, క్లర్క్​ 2025 రిజిస్ట్రేషన్​ ప్రక్రియ షురూ..

Best Web Hosting Provider In India 2024


నిరుద్యోగులకు అలర్ట్​! ఐబీపీఎస్​ ఆర్​ఆర్​బీ పీఓ, క్లర్క్​ 2025 రిజిస్ట్రేషన్​ ప్రక్రియ షురూ..

Sharath Chitturi HT Telugu

ఐబీపీఎస్​ ఆర్​ఆర్​బీ పీఓ, క్లర్క్​ 2025 రిజిస్ట్రేషన్​ ప్రక్రియ ప్రారంభమైంది. ముఖ్యమైన తేదీలు, ఎంపిక ప్రక్రియ, దరఖాస్తు ఫీజు, నోటిఫికేషన్​ లింక్​ వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఐబీపీఎస్​ ఆర్​ఆర్​బీ పీఓ, క్లర్క్​ 2025 రిజిస్ట్రేషన్​ షురూ.. (Official website, screenshot)

బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ముఖ్యమైన సమాచారం! ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) రీజనల్ రూరల్ బ్యాంక్స్ (ఆర్‌ఆర్‌బీ)లో గ్రూప్ “ఏ”- ఆఫీసర్స్ (స్కేల్-I, II & III) (ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ పీఓ), గ్రూప్ “బీ”- ఆఫీస్ అసిస్టెంట్స్ మల్టీపర్పస్ (ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ క్లర్క్) పోస్టుల భర్తీకి కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ (సీఆర్‌పీ ఆర్‌ఆర్‌బీ-XIV) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రిజిస్ట్రేషన్​ ప్రక్రియను సైతం ప్రారంభించింది. అర్హులైన అభ్యర్థులు ఐబీపీఎస్ అధికారిక వెబ్‌సైట్ ibps.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు..

ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ క్లర్క్, పీఓ 2025 దరఖాస్తులకు చివరి తేదీ సెప్టెంబర్ 21. ప్రిలిమ్స్ పరీక్ష అడ్మిట్ కార్డులు నవంబర్/డిసెంబర్‌లో విడుదల అవుతాయి. ప్రిలిమ్స్ పరీక్ష నవంబర్/డిసెంబర్ 2025లో నిర్వహిస్తారు. ఫలితాలు డిసెంబర్ 2025 లేదా జనవరి 2026లో ప్రకటిస్తారు. మెయిన్స్ పరీక్ష కాల్ లెటర్లు డిసెంబర్/జనవరిలో జారీ చేస్తారు. మెయిన్స్ పరీక్ష డిసెంబర్ లేదా ఫిబ్రవరిలో జరుగుతుంది.

ఐబీపీఎస్​ పీఓ, ఐబీపీఎస్​ క్లర్క్​ పోస్టులకు అప్లై చేసుకునేందుకు డైరక్ట్​ లింక్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఎంపిక ప్రక్రియ..

ఆఫీస్ అసిస్టెంట్స్ (మల్టీపర్పస్) పోస్టులకు: ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను మెయిన్స్ పరీక్షకు పిలుస్తారు. ఆన్‌లైన్ మెయిన్స్ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా వారిని తాత్కాలికంగా ఎంపిక చేస్తారు.

ఆఫీసర్స్ స్కేల్ 1 పోస్టులకు: ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు మెయిన్స్ పరీక్ష రాయాలి. మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను ఇంటర్వ్యూ రౌండ్‌కు పిలుస్తారు.

ఆఫీసర్స్ స్కేల్ 2 (జనరలిస్ట్, స్పెషలిస్ట్), స్కేల్ 3 పోస్టులకు: ఈ పోస్టులకు సింగిల్ ఆన్‌లైన్ పరీక్ష ఉంటుంది. షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులను నేరుగా ఇంటర్వ్యూకు పిలుస్తారు.

దరఖాస్తు ఫీజు..

ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ పీఓ: ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ. 175, ఇతరులకు రూ. 850.

ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ ఎస్‌ఓ (స్పెషలిస్ట్ ఆఫీసర్స్): ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ఈఎస్‌ఎం/డీఈఎస్‌ఎం అభ్యర్థులకు రూ. 175, ఇతరులకు రూ. 850.

మరిన్ని వివరాల కోసం, అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. పోస్టుల వారీగా అర్హత, వయోపరిమితి, ఖాళీల వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడగలరు.

పూర్తి నోటిఫికేషన్​ని చూసేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం


Best Web Hosting Provider In India 2024


Source link