





Best Web Hosting Provider In India 2024

ఈ వారం ఓటీటీలోకి అదిరే వెబ్ సిరీస్‌లు.. క్రైమ్, మిస్టరీ, హారర్, రొమాంటిక్ థ్రిల్లర్లు.. ఓ లుక్కేయండి
మరో కొత్త వారం వచ్చేసింది. ఓటీటీలోకి కొత్త సరకు కూడా వచ్చేస్తోంది. డిజిటల్ ఆడియన్స్ ను మరింతగా ఎంటర్ టైన్ చేసేందుకు కొత్త వెబ్ సిరీస్ లు రెడీ అయ్యాయి. ఈ వారం స్ట్రీమింగ్ కానున్న ఈ వెబ్ సిరీస్ లపై ఓ లుక్కేయండి.
ఈ వారం ఓటీటీలో అదిరే వెబ్ సిరీస్ లు రాబోతున్నాయి. క్రైమ్, మిస్టరీ, హారర్, రొమాంటిక్ థ్రిల్లర్లు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేయబోతున్నాయి. ఆ వెబ్ సిరీస్ లు ఏవి? ఏ ఓటీటీ స్ట్రీమింగ్ కాబోతున్నాయో ఇక్కడ చూద్దాం.
వెడ్నెస్డే సీజన్ 2 పార్ట్ II
వెడ్నెస్టే సీజన్ 2లో నెవర్మోర్ అకాడమీలో కొత్త భయంకరమైన రహస్యాలను ఎదుర్కొంటూ వెడ్నెస్డే అడమ్స్ (జెన్నా ఆర్టెగా) కథ కొనసాగుతోంది. టోన్ చీకటిగా ఉంటుంది. రహస్యాలు లోతుగా ఉంటాయి. సీజన్ 2 పార్ట్ 2లో పాప్ ఐకాన్ లేడీ గాగా కూడా నెవర్మోర్ అకాడమీలో ఒక రహస్య ఉపాధ్యాయురాలిగా తన వెడ్నెస్డే డెబ్యూ చేయనుంది. జెన్నా ఆర్టెగా, లేడీ గాగా, క్యాథరిన్ జెటా-జోన్స్, లూయిస్ గుజ్మాన్, ఎమ్మా మైయర్స్, జాయ్ సండే, ఐజాక్ ఆర్డోనెజ్, స్టీవ్ బస్సెమీ, జోవాన్నా లమ్లే తదితరులు నటించారు. ఇది సెప్టెంబర్ 3న ఓటీటీ రిలీజ్ కానుంది. నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
కమ్మట్టం
మలయాళ వెబ్ సిరీస్ కమ్మట్టం. సామ్యూల్ ఉమ్మన్ మర్డర్ మిస్టరీని ఛేదించే పోలీస్ అధికారి ఇన్స్పెక్టర్ ఆంటోనియో జార్జ్ కథే ఇది. తన దర్యాప్తు సామ్యూల్ ఉద్యోగి ఫ్రాన్సిస్ వైపు అనుమానం వచ్చేలా చేసినప్పుడు.. ఏదో పెద్ద రహస్యమే ఉందని ఆంటోనియో చాలా గ్రహిస్తాడు. సుదేవ్ నాయర్, జియో బేబీ, వివ్యా సంత్, అఖిల్ కవలయూర్, శ్రీరేఖ, అరుణ్ సోల్, జోర్డీ పూజార్, అజయ్ వాసుదేవ్, జిన్స్ భాస్కర్ తదితరులు నటించారు. ఇది సెప్టెంబర్ 5న జీ5 ఓటీటీలో ప్రీమియర్ కానుంది.
లవ్ కాన్ రివెంజ్
ఈ ట్రూ-క్రైమ్ డాక్యుమెంటరీని సెసిలి ఫెల్హోయ్ జీవితం ఆధారంగా రూపొందించారు. ఆమె ప్రసిద్ధ రొమాన్స్ మోసగాడితో ఉన్న వ్యక్తిగత అనుభవం ది టిండర్ స్విండ్లర్లో ప్రదర్శించబడింది. ఇప్పుడు ఆమె ప్రైవేట్ ఏజెంట్ బ్రియాన్ జోసెఫ్‌తో కలిసి పురుషులు, స్త్రీలతో జరిగిన రొమాన్స్ మోసాలను దర్యాప్తు చేస్తుంది. కేవలం రొమాన్స్ కోసం ఒకరిని వాడుకోకుండా ఇతర బాధితులకు వారి జీవితాలను తిరిగి పొందడంలో సహాయం చేస్తోంది. సెసిలి ఫెల్హోయ్, బ్రియాన్ జోసెఫ్ తదితరులు నటించారు. సెప్టెంబర్ 5న నెట్‌ఫ్లిక్స్ లో రిలీజ్ కానుంది.
క్వీన్ మాంటిస్ సీజన్ 1
క్వీన్ మాంటిస్ ఒక దక్షిణ కొరియా క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఇది సీరియల్ కిల్లర్, ఆమెనుంచి విడిపోయిన కుమారుడు, ఒక డిటెక్టివ్ ఇలా ముగ్గురు చుట్టూ తిరిగే కథ. ఈ సిరీస్ ఎపిసోడ్లు శుక్రవారం, శనివారాల్లో విడుదలవుతాయి లాస్ట్ ఎపిసోడ్ సెప్టెంబర్ 27న ప్రసారం అవుతుంది. వెబ్ సిరీస్ మొత్తం 8 ఎపిసోడ్లను కలిగి ఉంది. గో హ్యూన్-జంగ్, జాంగ్ డోంగ్-యూన్, చో సోంగ్-హా, లీ ఎల్ నటించారు. సెప్టెంబర్ 5న నెట్‌ఫ్లిక్స్ లో ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అవుతుంది.
ఈ వారం విడుదలయ్యే ఇతర వెబ్ సిరీస్‌లు ఇక్కడున్నాయి. కారెన్ కింగ్స్బరీస్ ఎ థౌసండ్ టొమోరోస్ S1: సెప్టెంబర్ 1, నెట్‌ఫ్లిక్స్; కౌంట్‌డౌన్ – కనెలో v క్రాఫోర్డ్: సెప్టెంబర్ 4, నెట్‌ఫ్లిక్స్; పోకెమోన్ కాన్సియర్జ్ S1 P2: సెప్టెంబర్ 4, నెట్‌ఫ్లిక్స్; ది ఫ్రేగ్రెంట్ ఫ్లవర్ బ్లూమ్స్ విత్ డిగ్నిటీ S1: సెప్టెంబర్ 7, నెట్‌ఫ్లిక్స్; రైజ్ అండ్ ఫాల్: సెప్టెంబర్ 6, ఎమ్ఎక్స్ ప్లేయర్ ఆన్ అమెజాన్ ప్రైమ్ వీడియో.
సంబంధిత కథనం