ఒక్క డైలాగ్ లేకుండా బోల్డ్ సైలెంట్ కామెడీ మూవీ.. 40 ఏళ్ల తర్వాత కమల్ హాసన్ పుష్పక విమానం తరహాలో!

Best Web Hosting Provider In India 2024

ఒక్క డైలాగ్ లేకుండా బోల్డ్ సైలెంట్ కామెడీ మూవీ.. 40 ఏళ్ల తర్వాత కమల్ హాసన్ పుష్పక విమానం తరహాలో!

Sanjiv Kumar HT Telugu

అసలు మాటలే లేకుండా సూపర్ హిట్ కొట్టిన సినిమా పుష్పక విమానం. కమల్ హాసన్ నటించిన ఈ సినిమా తర్వాత మళ్లీ ఏ సైలెంట్ మూవీ రాలేదు. ఇప్పుడు 40 ఏళ్ల తర్వాత ఒక్క మాట లేకుండా బోల్డ్ సైలెంట్ కామెడీగా ఉఫ్ప్ యే సియాపా సినిమా రానుంది. తాజాగా ఉఫ్ఫ్ యే సియాపా రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు.

ఒక్క డైలాగ్ లేకుండా బోల్డ్ సైలెంట్ కామెడీ మూవీ.. 40 ఏళ్ల తర్వాత కమల్ హాసన్ పుష్పక విమానం తరహాలో!

భారతీయ సినిమా ప్రయోగాలకు కొత్తేమీ కాదు. కానీ, ఒక సినిమాకు అందులో వచ్చే డైలాగ్స్‌కు ఉన్న అవినాభావ సంబంధం అందరికీ తెలిసిందే. అలాంటి సినిమాలో అసలు సంభాషణలు లేకుండా తెరకెక్కించే ధైర్యం చేయడం చాలా అరుదు. తాజాగా అలాంటి ఓ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

నియమాలను తిరిగి రాసేలా

జి. అశోక్ దర్శకత్వం వహించి లవ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై లవ్ రంజన్, అంకుర్ గార్గ్ నిర్మించిన సినిమా ఉఫ్ఫ్ యే సియాపా. ఈ సినిమా సరికొత్త నియమాలను తిరిగి రాస్తోంది. సెప్టెంబర్ 5, 2025న విడుదల కానున్న ఈ డార్క్ బోల్డ్ సైలెంట్ కామెడీ-థ్రిల్లర్ డైలాగ్‌ లేకుండా ఒక కథని చెప్పడానికి ప్రయత్నం చేస్తోంది.

పూర్తిగా హావభావాలతో, పర్ఫామెన్స్‌ని ఆధారంగా చేసుకుని హాస్యంతో కూడుకున్న దృశ్య మాలికగా ఉఫ్ఫ్ యే సియాపా సినిమా తెరకెక్కనుంది. ఇండియా గర్వకారణమైన ఆస్కార్ విన్నర్ ఏఆర్. రెహమాన్ ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేయడం ఇంకా విశేషం.

కేసరి లాల్ సింగ్ జీవితం

ఉఫ్ఫ్ యే సియాపా సినిమా కేసరి లాల్ సింగ్ (తుంబాడ్ ఫేమ్ సోహుమ్ షా) గందరగోళ జీవితం చుట్టూ తిరుగుతుంది. పొరపాటున జరిగిన ఒక పార్సిల్ డెలివరీ, వరుస అపార్థాలు అతని ఇంటిని నేర స్థలంగా మారుస్తాయి.

కేసరి భార్య పుష్ప (నుష్రత్ భరుచ్చ) అతను తమ పొరుగున ఉన్న కామిని (నోరా ఫతేహి)తో సరసాలాడుతున్నాడని అనుమానిస్తుంది. అలిగి పుట్టింటికి వెళ్లిపోతుంది. ఆమె వెళ్లిన తరువాత కేసరి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు ఎటువంటి ఆసక్తిని ఎంతటి హాస్యాన్ని కురిపిస్తాయి అన్నదే ఉఫ్ఫ్ యే సియాపా కథ.

పిల్ల జమిందార్, భాగమతి డైరెక్టర్

పిల్ల జమిందార్, భాగమతి, దుర్గామతి వంటి చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు జి. అశోక్ ఎల్లప్పుడూ సరికొత్త శైలులతో ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు. ఉఫ్ఫ్ యే సియాపాతో ఆధునిక ప్రేక్షకుల కోసం నిశ్శబ్ద కథ చెప్పడం సాహసోపేతమైన నిర్ణయంగా చెప్పొచ్చు.

తన కథను ఇతర టెక్నీషియన్స్‌కి, నటీనటులకు అర్థం అయ్యేలా చెప్పి వారి నుంచి సినిమాను అర్థవంతంగా తీసేలా చేయడం నిజమైన ఛాలెంజ్ అనుకోవచ్చు. అయితే, ఇలాంటి సైలెంట్ సినిమా 40 ఏళ్ల క్రితం పుష్పక విమానం వచ్చింది. ఇందులో హీరోగా కమల్ హాసన్ చేశారు.

40 ఏళ్ల తర్వాత

మరి 40 ఏళ్ల తర్వాత కమల్ హాసన్ పుష్పక విమానం తరహాలో వస్తోన్న ఉప్ఫ్ యే సియాపా సినిమా ఎలాంటి హిట్ కొడుతుందో వేచి చూడాలి. కాగా, ఈ సినిమా సెప్టెంబర్ 5న థియేటర్లలో విడుదల కానుంది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024