రానా బ్రోకి కాల్ చేసి ఘాటి స్టోరీ మొత్తం చెప్పేసిన అనుష్క.. ఇక వరుస సినిమాలు.. భల్లాల, దేవసేన కాల్ రికార్డింగ్ వైరల్

Best Web Hosting Provider In India 2024

రానా బ్రోకి కాల్ చేసి ఘాటి స్టోరీ మొత్తం చెప్పేసిన అనుష్క.. ఇక వరుస సినిమాలు.. భల్లాల, దేవసేన కాల్ రికార్డింగ్ వైరల్

Hari Prasad S HT Telugu

అనుష్క శెట్టి, రానా దగ్గుబాటి ఫోన్ కాల్ రికార్డింగ్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఘాటి మూవీ రిలీజ్ కు ముందే ఆ సినిమా స్టోరీ మొత్తం ఈ కాల్ లో చెప్పేసింది. ఈ కాల్ రికార్డింగ్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

రానా బ్రోకి కాల్ చేసి ఘాటి స్టోరీ మొత్తం చెప్పేసిన అనుష్క.. ఇక వరుస సినిమాలు.. భల్లాల, దేవసేన కాల్ రికార్డింగ్ వైరల్

అనుష్క శెట్టి నటించిన ఘాటి మూవీ ఈ శుక్రవారం (సెప్టెంబర్ 5) థియేటర్లలో రిలీజ్ కానున్న విషయం తెలుసు కదా. అయితే మూవీ రిలీజ్ కు ముందు రానా దగ్గుబాటితో అనుష్క మాట్లాడిన ఓ ఫోన్ కాల్ రికార్డింగ్ ఇప్పుడు బయటకు వచ్చింది. ఇందులో ఈ బాహుబలి కోస్టార్స్ మాట్లాడిన తీరు అభిమానులకు బాగా నచ్చేసింది.

ఘాటి స్టోరీ చెప్పిన అనుష్క

ఈ కాల్ మొత్తం రానాను అనుష్క బ్రో అని పిలవడం విశేషం. కాల్ మొదట్లోనే ఏంటీ సంగతులు.. క్రిష్ తో ఏదో యాక్షన్ సినిమా చేశావట కదా.. ఇలాంటి సినిమాలకు నిన్ను తప్ప ఇంకెవరిని పెడతారు అని రానా అంటాడు. అవును.. ఇందాకే నేను అన్నాను.. బాహుబలి, అరుంధతి తర్వాత ఇది కూడా అలాంటి పాత్రలే అని అనుష్క చెప్పింది. ఎందుకు తనకు అలాంటి పాత్రలే అని అడుగుతుంది. వయోలెంట్ మనుషులకు అలాంటి పాత్రలు ఇస్తే సొసైటీ తట్టుకోలేదు.. నీలాంటి మంచి వాళ్లకు ఇస్తే బాగుంటుంది అని రానా అన్నాడు.

ఇక ఆ తర్వాత ఘాటి మూవీ స్టోరీ మీదికి వీళ్ల టాపిక్ మళ్లింది. ఈ సినిమా స్టోరీ ఈ కాలానికి తగినట్లుగా ఉంటుందని అనుష్క చెప్పింది. ఆంధ్రా, ఒడిశా బోర్డర్లో ఘాట్స్ లో మారిజువానా పండించే వారి చుట్టూ తిరిగే స్టోరీ ఇది అని, ఇదేదో మరీ పెద్ద స్టోరీ కాదని, కొంత మంది ట్రైబల్స్ చుట్టూ తిరుగుతుందని అనుష్క చెప్పింది. దేశిరాజు, షీల అనే పాత్రలు, వాళ్ల జీవితాల గురించి చెబుతుందని ఆమె వెల్లడించింది. ఓ బాధితురాలు ఎలా క్రిమినల్ గా మారుతుందన్నది ఘాటి మూవీ స్టోరీ అని అనుష్క చెప్పింది.

సరోజ పాత్ర నా కెరీర్ బెస్ట్

ఇక క్రిష్ తో కలిసి పని చేయడంపైనా అనుష్క మాట్లాడింది. తనకు వేదం మూవీలో సరోజలాంటి పాత్ర ఇచ్చాడని, తన కెరీర్లోని బెస్ట్ క్యారెక్టర్స్ లో అదీ ఒకటని ఆమె చెప్పింది. క్రిష్ మాత్రమే తనకు యూనిక్ పాత్రలు ఇవ్వగలడని కూడా అనుష్క అభిప్రాయపడింది. చాలా సెన్సిటివ్ టాపిక్స్ ను క్రిష్ తీసుకుంటాడని చెప్పింది. ఇప్పుడు షీలా పాత్ర కూడా అలాంటిదే అని స్పష్టం చేసింది.

ఇక నుంచి వరుస సినిమాలు

అనుష్క ఈ మధ్య చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది. అప్పుడో ఇప్పుడో ఒక సినిమా చేస్తోంది. మరి ఇప్పటి నుంచైనా నిన్ను ఫ్రీక్వెంట్ గా చూడొచ్చు అని రానా అడిగినప్పుడు.. వచ్చే ఏడాది నుంచి వరుస సినిమాలు చేస్తానని అనుష్క చెప్పింది. మంచి స్క్రిప్ట్ లు చూసుకొని చేద్దామని ఆగినట్లు తెలిపింది. బాహుబలి 10 ఏళ్ల వేడుక సందర్భంగా కూడా ఇదే మాట్లాడుకున్నాం కదా అని రానా అన్నాడు.

అనుష్క నటించిన ఘాటి మూవీ ఈ వారమే థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ శుక్రవారం (సెప్టెంబర్ 5) ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మూవీ ప్రమోషన్లలో టీమ్ బిజీగా ఉంది. అనుష్క వీటికి దూరంగా ఉన్నా.. ఇలా రానాతో ఫోన్ కాల్ రికార్డింగ్ లీక్ చేసి సినిమాకు మంచి ప్రమోషనే ఇచ్చింది.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024