అనుష్క చాలా ఘాటుగా ఉండబోతుంది.. బురదలో కారు ఇరుక్కుని 40 నిమిషాలు అలాగే.. జగపతి బాబు కామెంట్స్

Best Web Hosting Provider In India 2024

అనుష్క చాలా ఘాటుగా ఉండబోతుంది.. బురదలో కారు ఇరుక్కుని 40 నిమిషాలు అలాగే.. జగపతి బాబు కామెంట్స్

Sanjiv Kumar HT Telugu

అనుష్క శెట్టి, జగపతి బాబు, విక్రమ్ ప్రభు, చైతన్య రావు కలిసి నటించిన సినిమా ఘాటి. డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఘాటి సినిమా సెప్టెంబర్ 5న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ ఘాటి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో జగపతి బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

అనుష్క చాలా ఘాటుగా ఉండబోతుంది.. బురదలో కారు ఇరుక్కుని 40 నిమిషాలు అలాగే.. జగపతి బాబు కామెంట్స్

క్వీన్ అనుష్క శెట్టి మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా సినిమా ఘాటి. తమిళ నటుడు విక్రమ్ ప్రభు మేల్ లీడ్‌గా నటించిన ఈ చిత్రానికి డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించారు.

సెప్టెంబర్ 5న ఘాటి

ఇప్పటికే అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్‌తో ఘాటి సినిమా హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. సెప్టెంబర్ 5న ఘాటి గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ ఘాటి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో జగపతి బాబు, విక్రమ్ ప్రభు ఇంట్రెస్టింగ్ విశేషాలు పంచుకున్నారు.

యాక్టర్ జగపతి బాబు మాట్లాడుతూ.. “అందరికి నమస్కారం. అనుష్క స్వీటీ అని మనందరికీ తెలుసు. కానీ, ఈ సినిమాల్లో చాలా ఘాటుగా ఉండబోతుంది. అన్ని రియల్ లొకేషన్స్‌లో చేసిన సినిమా ఇది. ఒకసారి ప్రయాణిస్తున్న కారు బురదలో ఇరుక్కుపోయింది. దాదాపు ఒక 40 నిమిషాలకు రోడ్డు మీదే నిలిచి ఉండిపోయాం. అలాంటి లోకేషన్స్‌లో చేశాం” అని అన్నారు.

ఎప్పుడు ఏం చేస్తానో తెలియదు

“ఈ సినిమా జర్నీ అంత చాలా ఎంజాయ్ చేసాం. ఈ ప్రెస్ మీట్‌కి రావడానికి ప్రధాన కారణం క్రిష్ గారు రాజీవ్ గారు. చాలా అద్భుతమైన సినిమా తీశారు. ఈ సినిమా గురించి చెప్పాలని వచ్చాను. ఈ సినిమాలో నేను పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నాను. చాలా డిఫరెంట్ క్యారెక్టర్. మంచి చేస్తానా చెడు చేస్తానా ఏం చేస్తానో నాకే తెలియని క్యారెక్టర్. డైరెక్టర్ క్రిష్ గారు చాలా అద్భుతంగా రాశారు” అని జగపతి బాబు తెలిపారు.

“నేను క్రిష్ ఎప్పటినుంచో మంచి ఫ్రెండ్స్. ఫైనల్‌గా ఈ సినిమాతో కలిసి వర్క్ చేశాం. చాలా ఎంజాయ్ చేస్తూ చేసిన సినిమా ఇది. రాజీవ్ నిజాయితీ ఉన్న ప్రొడ్యూసర్. తన మాటంటే మాటే. ఈ సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్” అని జగపతి బాబు చెప్పారు.

నా ఫస్ట్ తెలుగు సినిమా

హీరో విక్రమ్ ప్రభు మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. ఘాటీ నా ఫస్ట్ తెలుగు సినిమా. నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ క్రిష్ గారికి, నిర్మాత రాజీవ్ గారికి ధన్యవాదాలు. దేశి రాజు క్యారెక్టర్‌లో నన్ను ఊహించుకొని రాయడం చాలా ఆనందాన్నిచ్చింది” అని అన్నారు.

“అనుష్క గారికి నేను పెద్ద ఫ్యాన్‌ని. అనుష్క గారితో కలిసి నటించడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. జగపతి బాబు గారు చైతన్య రావు.. అందరితో కలిసి నటించడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. చైతన్య రావు తన క్యారెక్టర్‌లో జీవించేశారు” అని విక్రమ్ ప్రభు తెలిపారు.

చాలా జెన్యూన్ పర్సన్

రాజీవ్ చాలా జెన్యూన్ ప్రొడ్యూసర్. ఆయన టీం విజన్ చాలా అద్భుతంగా అర్థం చేసుకున్నారు. ఈ టీంలో పని చేసిన అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. సెప్టెంబర్ 5న ఘాటి వస్తుంది. అందరూ థియేటర్స్‌లో చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను” అని హీరో విక్రమ్ ప్రభు చెప్పారు.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024