





Best Web Hosting Provider In India 2024

ఓటీటీలోకి మరో మూడు రోజుల్లో కన్నప్ప.. ప్రకటించిన మంచు విష్ణు.. ఎక్కడ చూడాలంటే?
ఓటీటీలోకి మరో మూడు రోజుల్లో కన్నప్ప స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను హీరో మంచు విష్ణు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. మంచు విష్ణుతోపాటు ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, మోహన్ లాల్ నటించిన కన్నప్ప ఓటీటీ రిలీజ్ ప్లాట్‌ఫామ్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన సినిమా ‘కన్నప్ప’. బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన కన్నప్ప సినిమాను కలెక్షన్స్ కింగ్ మోహన్ బాబు నిర్మించారు. కన్నప్ప సినిమాలో మంచు విష్ణుకు జోడీగా తమిళ అందం ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా చేసింది.
కన్నప్ప భారీ తారాగణం
అలాగే, కన్నప్ప సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తోపాటు మలయాళ స్టార్ మోహన్ లాల్, బాలీవుడ్ అగ్ర హీరో అక్షయ్ కుమార్, శరత్ కుమార్, చందమామ కాజల్ అగర్వాల్, మోహన్ బాబు, మధుబాల, బ్రహ్మానందం తదితర అగ్ర తారలు కీలక పాత్రలు పోషించారు.
కన్నప్ప క్లైమాక్స్
భారీ అంచనాల మధ్య జూన్ 27 థియేటర్స్‌లో విడుదలైన కన్నప్ప పర్వాలేదనిపించుకుంది. సినిమా అంత ఓకే ఓకేగా సాగిన క్లైమాక్స్‌లో మాత్రం మంచు విష్ణు అదరగొట్టేశాడని రివ్యూలు వచ్చాయి. అలాగే, ప్రభాస్ స్క్రీన్ ప్రజెన్స్ అభిమానులకు ట్రీట్ అందించింది.
కన్నప్ప ఓటీటీ రిలీజ్
అలాంటి కన్నప్ప ఓటీటీలోకి రానుంది. మరో మూడు రోజుల్లో అంటే సెప్టెంబర్ 4 నుంచి కన్నప్ప ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. అమెజాన్ ప్రైమ్‌లో కన్నప్ప ఓటీటీ రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని తాజాగా హీరో మంచు విష్ణు అధికారికంగా ప్రకటించాడు. ట్విట్టర్ (గతంలో ఎక్స్) కన్నప్ప ఓటీటీ రిలీజ్ డేట్‌పై ట్వీట్ చేశాడు మంచు విష్ణు.
ప్రైమ్ వీడియోలో
“దైవత్వం, త్యాగాల స్ఫూర్తి, ఎపిక్ వంటి సినిమాను చూడండి. సెప్టెంబర్ 4న ప్రైమ్ వీడియోలో కన్నప్ప డిజిటల్‌గా రిలీజ్ కానుంది. హర హర మహాదేవ్, హర్ ఘర్ మహాదేవ్” అని నోట్ రాసుకొచ్చాడు మంచు విష్ణు. అలాగే, ఈ ట్వీట్‌తోపాటు కన్నప్ప ట్రైలర్‌ను షేర్ చేశాడు మంచు విష్ణు.
కన్నప్ప కథ
ఇక కన్నప్ప కథలోకి వెళితే.. అడవిలోని ఓ చిన్న గూడెంలో పుట్టి పెరిగన తిన్నడు (మంచు విష్ణు) తల్లి చనిపోవడంతో తండ్రి నాథనాథుడు (శరత్ కుమార్) అల్లారుముద్దుగా పెంచుతాడు. చిన్నప్పుడే నాస్తికుడిగా మారిన తిన్నడు దేవుడు లేడని నమ్ముతాడు.
కన్నప్ప ట్విస్టులు
విలువిద్యలో సాటిలేని తిన్నడు గొప్ప శివ భక్తుడిగా ఎలా మారిపోవయాడు? తిన్నడు అలా మారడానికి కారణమైన రుద్ర ఎవరు? శివుడి కోసం తిన్నడు చేసిన త్యాగం ఏంటీ? తిన్నడుకి కన్నప్పగా పేరు ఎలా వచ్చింది? అనేది తెలియాలంటే అమెజాన్ ప్రైమ్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ కానున్న కన్నప్ప సినిమాను చూడాల్సిందే.
సంబంధిత కథనం
టాపిక్