పింఛను తీసుకోకున్నా అర్హులకు తర్వాతి నెల అందిస్తున్నాం.. అనర్హులను ప్రజలే ఆపాలి : చంద్రబాబు

Best Web Hosting Provider In India 2024

పింఛను తీసుకోకున్నా అర్హులకు తర్వాతి నెల అందిస్తున్నాం.. అనర్హులను ప్రజలే ఆపాలి : చంద్రబాబు

Anand Sai HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Anand Sai HT Telugu

ఆర్థిక సంస్కరణలు అమలు చేస్తేనే మార్పులు వస్తాయని సీఎం చంద్రబాబు అన్నారు. పేదవాడి జీవితాల్లో వెలుగులు నింపాలని తమ లక్ష్యమని అన్నారు.

సీఎం చంద్రబాబు(ఫైల్ ఫొటో) (@AndhraPradeshCM X)

అన్నమయ్య జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించారు. రాజంపేట మండలం మునక్కాయలవారిపల్లెలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం సభలో మాట్లాడారు. ఎవరైనా పింఛను తీసుకోకున్నా.. తర్వాతి నెల అందిస్తున్నామని చెప్పారు. అభివృద్ధి జరగాలని, ఆదాయం పెరగాలని చెప్పారు. సంపద సృష్టించడం చేతనైతే సంక్షేమ పథకాలు అమలు చేయవచ్చని చంద్రబాబు అన్నారు. అప్పులు చేస్తే ఏ కుటుంబం కూడా బాగుపడదని చెప్పారు. ఆదాయం పెంచుకుంటేనే జీవితాల్లో మార్పు సాధ్యమని పేర్కొన్నారు.

రాష్ట్ర విభజన అనంతరం అనేక కష్టాలు వచ్చాయన్నారు సీఎం. 2014-19 మధ్య దేశంలో ఎక్కడా జరగని అభివృద్ధి చేసి చూపించామన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్లీ ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందన్నారు. దేశాభివృద్ధికి ప్రధాని మోదీ అనేక సంస్కరణలు తెస్తున్నారని, అందులో మన రాష్ట్రం కీలక పాత్ర పోషించాలన్నారు.

‘గత పాలకులు అధికారాన్ని స్వార్థ ప్రయోజనాలకు వాడుకున్నారు. వైసీపీ హయాంలో అనర్హులు కూడా దివ్యాంగుల పింఛను తీసుకున్నారు. నిజమైన దివ్యాంగులకు మేం న్యాయం చేస్తాం. అనర్హులు పింఛను తీసుకోకుండా ప్రజలే ఆపాలి. ‘ అని చంద్రబాబు అన్నారు.

ఇబ్బందుల్లో ఉన్న మామిడి రైతులను ఆదుకున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. మామిడికాయలు రోడ్డుపై పోసీ వైసీపీ నేతలు డ్రామాలు ఆడారన్నారు. కడప, రాజంపేట మీదుగా కోడూరుకు నీళ్లు తీసుకెళ్తామన్నారు. రాజంపేటలో వ్యవసాయం తగ్గిందని, ఉద్యానపంటలు, డెయిరీ, పశుసంపద బాగా పెరిగిందన్నారు. వైసీపీ నేతలకు చంద్రబాబు కౌంటర్ వేశారు. మెున్నటిదాకా ఆ పార్టీ నేతలు సిద్ధం.. సిద్ధం అన్నారన్నారు. ఇప్పుడు అసెంబ్లీకి వచ్చేందుకు సిద్ధమా? అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని చంద్రబాబు సవాల్ విసిరారు.

చంద్రబాబుకు పవన్ కల్యాణ్ విషెస్

ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణం చేసి నేటికి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చంద్రబాబుకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ఆయన చేపట్టిన సంస్కరణలు తెలుగు రాష్ట్రాల అభివృద్ధిని పరుగులు పెట్టించాయన్నారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో చంద్రబాబు ముద్ర చిరస్మరణీయమన్నారు. హైదరాబాద్‌ను ఐటీ రంగానికి కేరాఫ్ అడ్రస్‌గా మార్చిన ఘనత చంద్రబాబుదేనని కొనియాడారు. ఐటీకి పెద్దపీట వేశారన్నారు. చంద్రబాబు నిర్దేశకత్వంలో మేం ఏపీ అభివృద్ధికి నిబద్ధతో పని చేస్తున్నామని పవన్ అన్నారు.

Anand Sai

eMail
ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.

టాపిక్

Chandrababu NaiduTdpPawan KalyanJanasena
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024