మైఖేల్ జాక్సన్ స్టైల్‌లో పవన్ కల్యాణ్- ఒకరోజు ముందుగానే బర్త్ డే ట్రీట్- ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి స్పెషల్ పోస్టర్

Best Web Hosting Provider In India 2024

మైఖేల్ జాక్సన్ స్టైల్‌లో పవన్ కల్యాణ్- ఒకరోజు ముందుగానే బర్త్ డే ట్రీట్- ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి స్పెషల్ పోస్టర్

Sanjiv Kumar HT Telugu

పవన్ కల్యాణ్ బర్త్ డేకి ఒకరోజు ముందుగానే అభిమానులకు స్పెషల్ ట్రీట్ అందింది. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి పవన్ కల్యాణ్ స్పెషల్ పోస్టర్‌ను ఇవాళ (సెప్టెంబర్ 1) మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో మైఖేల్ జాక్సన్ స్టైల్‌లో పవన్ కల్యాణ్ స్టైలిష్‌గా కనిపించారు. ఇప్పుడు ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మైఖేల్ జాక్సన్ స్టైల్‌లో పవన్ కల్యాణ్- ఒకరోజు ముందుగానే బర్త్ డే ట్రీట్- ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి స్పెషల్ పోస్టర్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో మరోసారి తెరకెక్కుతోన్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్‘. ‘గబ్బర్ సింగ్’ వంటి సంచలన విజయం తరువాత పవన్ కల్యాణ్-హరీష్ శంకర్ కలయికలో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్న విషయం తెలిసిందే.

ఉస్తాద్ భగత్ సింగ్ పోస్టర్

అయితే, తాజాగా పవన్ కల్యాణ్ పుట్టినరోజు(సెప్టెంబర్ 2) సందర్భంగా ఇవాళ (సెప్టెంబర్ 1) ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. త్రీ పీస్ సూట్, టోపీతో పూర్తిగా నల్లటి దుస్తులు ధరించి పవన్ కల్యాణ్ చాలా అందంగా, స్టైలిష్‌గా కనిపిస్తున్నారు.

అయితే, ఈ పోస్టర్‌లో పవన్ కల్యాణ్ పెట్టి డ్యాన్స్ పోజు స్టార్ డ్యాన్సర్ మైఖేల్ జాక్సన్ మూమెంట్‌లా ఉంది. పవన్ కల్యాణ్ అభిమానులకు ఆయన పుట్టిన రోజుకు ఒకరోజు ముందుగానే అదిరిపోయే స్పెషల్ సర్‌ప్రైజ్ ఇచ్చింది ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ టీమ్.

పవన్ కల్యాణ్ స్టైల్, స్వాగ్

ప్రస్తుతం ఈ పోస్టర్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పవన్ కల్యాణ్ ప్రత్యేకమైన స్టైల్, స్వాగ్‌ గురించి తెలిసిందే. తాజాగా విడుదలైన ఈ పోస్టర్ దానిని మరో స్థాయికి తీసుకెళ్లేలా ఉంది.

తన సినిమాలలో హీరోలను అద్భుతంగా చూపించడంలో పేరుగాంచిన హరీష్ శంకర్.. పవన్ కల్యాణ్ కోసం తనలోని అభిమానిని బయటకు తీసుకువచ్చి, ‘ఉస్తాద్ భగత్ సింగ్’లోని ఓ పాట స్టిల్‌తో అభిమానులందరికీ మరిచిపోలేని పుట్టినరోజు విందును ఇచ్చారు. ఈ పోస్టర్‌తో ఆయన అభిమానం ఏ రేంజ్‌లో ఉంటుందో చూపించారు హరీష్ శంకర్.

పూర్తవనున్న టాకీ భాగం

ఇకపోతే ఉస్తాద్ భగత్ సింగ్ కొత్త షెడ్యూల్ సెప్టెంబర్ 6న ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌లో పవన్ కల్యాణ్‌తో పాటు పలువురు ప్రముఖ నటీనటులు చిత్రీకరణలో పాల్గొంటారు. రాబోయే షెడ్యూల్‌తో టాకీ భాగం దాదాపుగా పూర్తవుతుందని సమాచారం.

‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవి శంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. పవన్ కల్యాణ్ అభిమానులతో పాటు మాస్ ప్రేక్షకులు, యాక్షన్ ప్రియులు మెచ్చేలా ఈ చిత్రం ఉంటుందని నిర్మాతలు హామీ ఇచ్చారు.

ఇద్దరు హీరోయిన్లు

కాగా, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీలతోపాటు ముద్దుగుమ్మ రాశి ఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. వీరితోపాటు పార్థిబన్, కె.ఎస్. రవికుమార్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అలాగే, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకి అత్యున్నత స్థాయి సాంకేతిక బృందం పనిచేస్తోంది.

రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు రామ్-లక్ష్మణ్ ద్వయం యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ చేస్తున్నారు. అయనంక బోస్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తుండగా, నీతా లుల్లా కాస్ట్యూమ్స్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.

కె. దశరథ్, రమేష్ రెడ్డి కథనం రాయగా, ప్రవీణ్ వర్మ, చంద్రమోహన్ రచనా సహకారం అందిస్తున్నారు. కళా దర్శకుడిగా ఆనంద్ సాయి వ్యవహరిస్తున్నారు.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024