





Best Web Hosting Provider In India 2024

ఓటీటీలో వీకెండ్‌కు కచ్చితంగా చూడాల్సిన ది బెస్ట్ 7 సినిమాలు.. తెలుగులో 4 స్ట్రీమింగ్.. ఇక్కడ చూసేయండి!
ఓటీటీలో వీకెండ్‌కు కచ్చితంగా చూడాల్సిన ది బెస్ట్ 7 సినిమాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. వాటిలో ఏకంగా 4 సినిమాలు తెలుగు భాషలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. అలాగే, ఇందులో రొమాంటిక్, కామెడీ, సూపర్ హీరో, క్రైమ్ థ్రిల్లర్ వంటి జోనర్స్ ఉన్నాయి. మరి వీటి ఓటీటీ రిలీజ్ ఎక్కడ ఇక్కడ తెలుసుకుందాం.
ఓటీటీలో ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు స్ట్రీమింగ్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు మరో కొత్త వారం వచ్చేసింది. గత వారంలో ఎన్నో ఓటీటీ సినిమాలు రిలీజ్ అయ్యాయి. మరి వాటిలో వీకెండ్‌కు కచ్చితంగా చూడాల్సిన ది బెస్ట్ 7 సినిమాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. వాటిని నెక్ట్స్ వీకెండ్‌కు బాగా ప్లాన్ చేసుకోవచ్చు.
మెట్రో.. ఇన్ డైనో ఓటీటీ
నెట్‌ఫ్లిక్స్‌లో మెట్రో.. ఇన్ డైనో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఆదిత్య రాయ్ కపూర్, సారా అలీ ఖాన్, ఫాతిమా సనా షేక్, కొంకణా సేన్ శర్మ, పంకజ్ త్రిపాఠి వంటి అగ్ర తారలు నటించిన అంథాలజీ మూవీ ఇది.
నాలుగు పట్టణాల్లోని జంటల మధ్య జరిగే సన్నివేశాలతో మెట్రో ఇన్ డైనో ఓటీటీ రిలీజ్ అయింది. నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ భాషలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న మెట్రో ఇన్ డైనో వీకెండ్‌కు చూసేందుకు బెస్ట్.
థండర్‌బోల్ట్స్ ఓటీటీ
మార్వెల్ నుంచి వచ్చిన లేటెస్ట్ సూపర్ హీరో మూవీ థండర్‌బోల్ట్స్. ఇందులో మార్వెల్‌లోని యెలెనా బెలోవా, రెడ్ గార్డియన్, బకీ బర్న్స్, ఘోస్ట్, టాస్క్ మాస్టర్ వంటి యాంటీ హీరోలను ఏకతాటిపైకి తీసుకొచ్చిన సినిమా. జియో హాట్‌స్టార్‌లో థండర్‌బోల్ట్స్ ఓటీటీ రిలీజ్ అయింది. తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమా వీకెండ్‌కు బెస్ట్.
సాంగ్స్ ఆఫ్ ప్యారడైజ్ ఓటీటీ
కాశ్మీరీ గాయని రాజ్ బేగం జీవితం నుంచి ప్రేరణ పొందిన సినిమా సాంగ్స్ ఆఫ్ ప్యారడైజ్. ఈ సినిమాలో సబా ఆజాద్, సోనీ రజ్దాన్ రెండు యుగాలకు చెందిన లెజెండరీ గాయనీగా నటించారు. అమెజాన్ ప్రైమ్‌లో హిందీలో సాంగ్స్ ఆఫ్ ప్యారడైజ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
శోధ ఓటీటీ
కన్నడ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ శోధ. ఈ సినిమా కథ రోహిత్ చుట్టూ తిరుగుతుంది. అతని భార్య ఒక విషాదకరమైన ప్రమాదం తరువాత రహస్యంగా అదృశ్యమవుతుంది. ఆమె తిరిగి వచ్చినప్పుడు ఏం జరిగిందనే థ్రిల్లింగ్ అంశాలతో శోధ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. జీ5లో ఈ సినిమా కన్నడలో అందుబాటులో ఉంది.
థర్స్డే మర్డర్ క్లబ్ ఓటీటీ
అత్యధికంగా అమ్ముడైన రిచర్డ్ ఉస్మాన్ నవల ఆధారంగా నలుగురు వృద్ధ గూఢచారుల చుట్టూ జరిగే స్పై క్రైమ్ థ్రిల్లర్ సినిమా థర్స్డే మర్డర్ క్లబ్. కోల్డ్ కేసులను పరిష్కరించడానికి తమను స్వయంగా రంగంలోకి దిగిన వీరికి ఎలాంటి హత్య ఎదురైందనదే కథ. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో థర్స్డే మర్డర్ క్లబ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
లవ్ అన్ట్యాంగిల్డ్ ఓటీటీ
1998 బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ లవ్ అన్ట్యాంగిల్డ్ సినిమా కర్లీ హెయిర్ గురించి అభద్రతా భావంతో ఉన్న ఒక అమ్మాయి చుట్టూ సాగుతుంది. రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్‌గా సాగే ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో డిజిటల్ ప్రీమియర్ అవుతోంది.
కరాటే కిడ్: లెజెండ్స్ ఓటీటీ
జాకీచాన్ నటించిన మార్షల్, కామెడీ, యాక్షన్, మోటివేషన్ సినిమా కరాటే కిడ్ లెజెండ్స్. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో కరాటే కిడ్ లెజెండ్స్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇది పిల్లలకు చూపించేందుకు బెస్ట్ సినిమా. ఇలా ఏడు ది బెస్ట్ సినిమాల్లో నాలుగు తెలుగు భాషలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.
సంబంధిత కథనం