




Best Web Hosting Provider In India 2024

ఓటీటీలోకి 12th ఫెయిల్ హీరో రొమాంటిక్ మూవీ.. హీరోయిన్‌గా నటుడి కుమార్తె ఎంట్రీ.. కిస్సింగ్, కామెడీ, ఎమోషనల్ సీన్లతో!
ఓటీటీలోకి 12th ఫెయిల్ హీరో విక్రాంత్ మాస్సే రొమాంటిక్ కామెడీ మూవీ ఆంఖోన్ కీ గుస్తాఖియాన్ స్ట్రీమింగ్ కానుంది. సుమారు 25 రోజుల్లోనే ఆంఖోన్ కీ గుస్తాఖియాన్ ఓటీటీ రిలీజ్ కానుంది. ఈ సినిమాతో సీనియర్ హీరో, నటుడు సంజయ్ కపూర్ కుమార్తె షనయా కపూర్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. మరి ఈ సినిమాను ఎక్కడ చూడాలంటే?
12th ఫెయిల్ మూవీతో దేశవ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చుకున్న హీరో విక్రాంత్ మాస్సే. హిందీలో అప్పటి వరకు ఎన్నో సినిమాల్లో నటించిన విక్రాంత్ మాస్సే 12th ఫెయిల్ సినిమాతో అదిరిపోయే క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక రీసెంట్‌గా విక్రాంత్ మాస్సే నటించిన రొమాంటిక్ కామెడీ సినిమా ఆంఖోన్ కీ గుస్తాఖియాన్.
గ్లామర్ ఫొటోలతోనే
ఈ సినిమాతో బాలీవుడ్ సీనియర్ హీరో, నటుడు సంజయ్ కపూర్ కుమార్తె షనయా కపూర్ హీరోయిన్‌గా డెబ్యూ ఎంట్రీ ఇచ్చింది. అప్పటి వరకు సోషల్ మీడియాలో హాట్ అండ్ గ్లామర్ ఫొటోలతోనే బాలీవుడ్‌లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న షనయా తొలిసారిగా హీరోయిన్‌గా కనిపించింది.
రస్కిన్ బాండ్ నవల ఆధారంగా
విక్రాంత్ మాస్సీ, షనయా కపూర్‌లో రొమాంటిక్ డ్రామా చిత్రం ఆంఖోన్ కీ గుస్తాఖియాన్‌కు సంతోష్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను రస్కిన్ బాండ్ రచించిన ది ఐస్ హ్యావ్ ఇట్ అనే పుస్తకం ఆధారంగా తెరకెక్కించారు.
ప్రేమకు దారి తీసిన స్నేహం
జహాన్ (విక్రాంత్ మాస్సే) ఒక అంధ సంగీతకారుడు. సబా (షనయా కపూర్) నటిగా పేరు తెచ్చుకోవాలని ప్రయత్నించే యువతి. వీరిద్దరు అనుకోకుండా ఓ సారి రైలు ప్రయాణంలో కలుసుకుంటారు. ఆ తర్వాత ఇద్దరు తమ అభిరుచులను పంచుకుంటారు. అలా వీరి మధ్య స్నేహం చిగిరించి ప్రేమకు దారి తీస్తుంది.
మూడో వ్యక్తి ఎంట్రీ
కానీ, ఒకానొక సమయంలో సబా జీవితంలో మూడో వ్యక్తి వస్తాడు. ఆ తర్వాత వీరి జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి?. సబా, జహాన్ పెళ్లి చేసుకున్నారా? చివరికి ఏమైంది? అనే కథనంతో ఆంఖోన్ కీ గుస్తాఖియాన్ సినిమా కథ.
కళ్లు కోపగించుకుంటున్నాయి
నిజానికి ఆంఖోన్ కీ గుస్తాఖియాన్ సినిమా ఒక మ్యూజికల్ రొమాంటిక్ మెలో డ్రామా. టైటిల్‌కు కళ్లు కోపగించుకుంటున్నాయి అనే అర్థం వస్తుంది. కానీ, ఆంఖోన్ కీ గుస్తాఖియాన్ అనేది కాస్తా కవితాత్మకంతో చెప్పే పదం. హీరో అంధుడు కాబట్టి టైటిల్ అలా పెట్టినట్లుగా తెలుస్తోంది.
ఆంఖోన్ కీ గుస్తాఖియాన్ ఓటీటీ
సెప్టెంబర్ 5 నుంచి ఆంఖోన్ కీ గుస్తాఖియాన్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. జీ5లో హిందీ భాషలో ఆంఖోనీ కీ గుస్తాఖియాన్ ఓటీటీ రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని తాజాగా ఇవాళ (సెప్టెంబర్ 1) జీ5 ఓటీటీ అధికారికంగా ప్రకటించింది.
సంబంధిత కథనం
టాపిక్