





Best Web Hosting Provider In India 2024

దటీజ్ పవన్ కల్యాణ్.. ఓజీ ఒక్క టికెట్ ధర రూ.5 లక్షలు.. ఆ డబ్బు ఏం చేయబోతున్నారో తెలుసా?
పవన్ కల్యాణ్ రేంజ్ ఏంటో మరోసారి తెలిసొచ్చింది. అతని నెక్ట్స్ మూవీ ఓజీ మూవీ ఒక్క టికెట్ ఏకంగా రూ.5 లక్షలకు అమ్ముడవడం విశేషం. మరి ఆ విశేషాలేంటో తెలుసుకోండి.
సినీ నటుడు-రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ మంగళవారం (సెప్టెంబర్ 2) తన 54వ బర్త్‌డే జరుపుకున్నారు. ఆయన ఫ్యాన్స్ ఒక ఆన్‌లైన్ వేలం పెట్టారు. ఆయన కొత్త సినిమా ‘ఓజీ’ నైజాం ఏరియాలోని మొదటి టికెట్‌ను ఎవరు ఎక్కువ డబ్బు ఇస్తే వాళ్లకు ఇస్తామని చెప్పారు. ఇప్పుడా టికెట్ ను నార్త్ అమెరికాకు చెందిన టీమ్ పవన్ కల్యాణ్ సేన ఏకంగా రూ.5 లక్షలకు దక్కించుకొని రికార్డు క్రియేట్ చేసింది.
‘ఓజీ’ మొదటి టికెట్ రూ.5 లక్షలకు..
పవన్ కళ్యాణ్ బర్త్‌డేకి ముందు ఆయన ఫ్యాన్స్ ఎక్స్ స్పేసెస్‌లో ‘ఓజీ‘ నైజాంలో మొదటి షో టికెట్ కోసం ఆన్‌లైన్ ఆక్షన్ నిర్వహించారు. బిడ్డింగ్ చాలా ఎక్కువగా సాగింది. చివరికి ఒక ఫ్యాన్ క్లబ్ ఏకంగా రూ.5 లక్షలకు టికెట్‌ను కొనుగోలు చేసింది.
ఈ డబ్బు పవన్ జనసేన పార్టీకి విరాళంగా ఇవ్వనున్నారు. ఆక్షన్‌కి సంబంధించిన వీడియోలో.. హోస్ట్ ఏం చెప్పారో చూడండి. “నైజాం మొదటి టికెట్ ఆక్షన్ విన్నర్ టీమ్ పవన్ కళ్యాణ్ నార్త్ అమెరికా రూ.5 లక్షలకు. ఈ డబ్బు 3 రోజుల్లో జనసేన పార్టీకి విరాళంగా ఇస్తాం” అని అన్నారు.
‘ఓజీ’ మూవీ గురించి..
‘దే కాల్ హిమ్ ఓజీ’ షార్ట్ గా ఓజీ. ఇది ఒక గ్యాంగ్‌స్టర్ సినిమా. దీనికి సుజిత్ దర్శకత్వం వహించాడు. డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డి.వి.వి. దానయ్య నిర్మించారు. ఇందులో విలన్ గా ఇమ్రాన్ హష్మీ.. ఓమీ భావ్ పాత్రతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు. 2023లో షూటింగ్ మొదలైన ఈ సినిమాలో పవన్ ఓజాస్ గంభీరా అనే టైటిల్ రోల్ పోషించారు.
ప్రియాంక మోహన్, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శ్రియ రెడ్డి, హరీష్ ఉత్తమన్ లాంటి వాళ్ళు ముఖ్య పాత్రల్లో నటించారు. తమన్ ఎస్. ఈ సినిమాకు సంగీతం అందించారు. ‘ఓజీ’ సెప్టెంబర్ 25న థియేటర్లలో విడుదల కానుంది.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఇలా..
పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న విషయం తెలిసిందే. అంతకంటే ముందే ఈ ఓజీ మూవీకి అతడు సైన్ చేశాడు. గతేడాది ఎన్నికల్లో టీడీపీ, బీజేపీతో కలిసి పవన్ పార్టీ జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ మధ్యే పవర్ మరో లాంగ్ అవేటెడ్ మూవీ హరి హర వీరమల్లు రిలీజైన విషయం తెలిసిందే. అయితే బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా పడింది. ఇక ఇప్పుడు ఓజీతోపాటు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కూడా అతని ఖాతాలో ఉన్నాయి. వీరమల్లు ఇచ్చిన షాక్ తో అభిమానులు ఇప్పుడు ఓజీ మూవీపై భారీ ఆశలే పెట్టుకున్నారు.
సంబంధిత కథనం