




Best Web Hosting Provider In India 2024
ఒకప్పుడు ‘గార్డెన్ సిటీ’- ఇప్పుడు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి! రెండేళ్లు తగ్గిన బెంగళూరు ప్రజల ఆయుర్దాయం..
గత 25 ఏళ్లలో బెంగళూరులో వాయు కాలుష్యం రెట్టింపు అయ్యింది! ఫలితంగా ఆయుర్దాయం రెండు ఏళ్లు తగ్గిందని ఒక నివేదిక చెబుతోంది. అయితే, ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఫలితాల్ని ఇస్తున్నాయని వెల్లడించింది.
ఒకప్పుడు ‘గార్డెన్ సిటీ’గా ప్రసిద్ధి చెందిన బెంగళూరు ఇప్పుడు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది! విషపూరితమైన గాలి.. మహా నగర నివాసితుల జీవిత కాలాన్ని తగ్గించేస్తోంది. యూనివర్సిటీ ఆఫ్ చికాగో ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ (ఈక్యూఎల్ఐ) కొత్త నివేదిక ప్రకారం.. బెంగళూరులో వాయు కాలుష్యం కారణంగా ప్రతి ఒక్కరి ఆయుర్దాయం రెండు సంవత్సరాల కంటే ఎక్కువగా తగ్గుతోంది. 1990ల చివరలో ఇది కేవలం ఎనిమిది నెలలు మాత్రమే ఉండగా, ఇప్పుడు భారీగా పెరిగింది.
పెరుగుతున్న పీఎం 2.5 కణాలు..
గత 25 సంవత్సరాల్లో కర్ణాటకలోని అన్ని జిల్లాల్లో, ముఖ్యంగా బెంగళూరులో పీఎం 2.5 కణాల స్థాయిలు రెట్టింపయ్యాయి. ఉత్తర భారతదేశంలో కాలుష్యం ఎక్కువగా ఉన్నప్పటికీ, కర్ణాటకలో కాలుష్యం తక్కువగా ఉందని నివేదిక పేర్కొంది. అయినప్పటికీ, కాలుష్యం కారణంగా ఆరోగ్య సమస్యల భారం స్థిరంగా పెరుగుతోంది.
ఆయుర్దాయంపై కాలుష్యం ప్రభావం..
పీఎం 2.5 కణాలు చాలా చిన్నవిగా (2.5 మైక్రాన్లు) ఉంటాయి. అవి ఊపిరితిత్తులు, రక్తంలోకి సులభంగా ప్రవేశించి అనేక రకాల వ్యాధులకు దారితీస్తాయని ఏక్యూఎల్ఐ నివేదిక తెలిపింది. కొన్ని సంవత్సరాల్లో బెంగళూరు వాసులకు పరిస్థితి మరింత దారుణంగా మారిందని నివేదిక పేర్కొంది.
ఉదాహరణకు.. బెంగళూరులో గాలి నాణ్యత ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నిర్దేశించిన ప్రమాణాల (క్యూబిక్ మీటరుకు 5 మైక్రోగ్రాములు) ప్రకారం ఉండి ఉంటే.. నివాసితులు 2016లో 2.9 సంవత్సరాలు, 2018లో 2.6 సంవత్సరాలు, 2019, 2021లో 2.5 సంవత్సరాలు ఎక్కువగా జీవించేవారని నివేదిక అంచనా వేసింది.
కానీ 2007 నుంచి ‘కోల్పోయిన జీవిత కాలం’ అనేది రెండు సంవత్సరాలకు ఎప్పుడూ తగ్గలేదు.
ఐటీ రంగం, కాలుష్యానికి సంబంధం
ఐటీ రంగం అభివృద్ధి చెందక ముందు 1998లో బెంగళూరులో పీఎం 2.5 కణాల స్థాయి క్యూబిక్ మీటరుకు 13.1 మైక్రోగ్రాములుగా ఉండేది. 2023 నాటికి ఇది 26.21 మైక్రోగ్రాములకు పెరిగింది. ఇదే ధోరణి ఇతర జిల్లాల్లోనూ కనిపించింది. కలబురగిలో 26.31, బీదర్‌లో 25.01, బెలగాంలో 23.72గా ఈ స్థాయిలు నమోదయ్యాయి.
కాలుష్య నివారణ చర్యలు..
ఈ సంక్షోభాన్ని పరిష్కరించడానికి ప్రభుత్వం 2019లో జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం 131 నగరాలను కవర్ చేస్తుంది. 2017 స్థాయిలతో పోలిస్తే, 2026 నాటికి కాలుష్య కణాలను 40% తగ్గించాలని ఈ కార్యక్రమం లక్ష్యంగా పెట్టుకుంది.
యూనివర్సిటీ ఆఫ్ చికాగో నివేదిక ప్రకారం.. ఈ లక్ష్యాల వైపు కొంత పురోగతి ఉంది. “2023 నాటికి, ఎన్సీఏపీలో చేరిన నగరాల్లో కాలుష్యం 2017తో పోలిస్తే 10.5% తగ్గింది. ఇది 443.4 మిలియన్ల మంది నివాసితుల ఆయుర్దాయానికి ఆరు నెలలు, భారత జాతీయ సగటు ఆయుర్దాయానికి రెండు నెలలు జోడించింది!” అని నివేదిక తెలిపింది.
సవరించిన ఎన్సీఏపీ లక్ష్యాన్ని సాధించగలిగితే, ఆయా నగరాల్లోని నివాసితులు అదనంగా 2.1 సంవత్సరాలు ఎక్కువ జీవించగలరని, జాతీయ సగటు ఆయుర్దాయం దాదాపు ఎనిమిది నెలలు పెరుగుతుందని పలు మీడియా నివేదికలు చెబుతున్నాయి.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link