గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: బాలు, సంజూ మధ్య మళ్లీ గొడవ.. పెళ్లిరోజు నాడే రచ్చ.. పార్వతిని అవమానించిన ప్రభావతి

Best Web Hosting Provider In India 2024

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: బాలు, సంజూ మధ్య మళ్లీ గొడవ.. పెళ్లిరోజు నాడే రచ్చ.. పార్వతిని అవమానించిన ప్రభావతి

Hari Prasad S HT Telugu

గుండె నిండా గుడి గంటలు బుధవారం (సెప్టెంబర్ 3) ఎపిసోడ్ లో బాలు, మీనా పెళ్లి రోజుకు సంబంధించిన సెలబ్రేషన్స్ కోసం ఫ్యామిలీ సిద్ధమవడం చూడొచ్చు. అదే సమయంలో ఆ వేడుకలోనే మరోసారి బాలు, సంజూ గొడవకు కూడా బీజం పడినట్లే కనిపిస్తోంది.

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: బాలు, సంజూ మధ్య మళ్లీ గొడవ.. పెళ్లిరోజు నాడే రచ్చ.. పార్వతిని అవమానించిన ప్రభావతి

గుండె నిండా గుడి గంటలు ఈరోజు అంటే 502వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ఇంటికి వచ్చిన మీనా తల్లి పార్వతిని ప్రభావతి అవమానించడం, సత్యం తల్లి సుశీల రావడం, బాలు మీనా పెళ్లి రోజు సెలబ్రేషన్స్ కు ప్లాన్ చేయడంలాంటి సీన్లతో సాగిపోయింది. ఈ ఎపిసోడ్లో ఇంకా ఏం జరిగిందో ఒకసారి చూద్దాం.

పార్వతిని అవమానించిన ప్రభావతి

గుండె నిండా గుడి గంటలు సీరియల్ బుధవారం (సెప్టెంబర్ 3) ఎపిసోడ్ బాలు, మీనా పెళ్లి రోజు కోసం బట్టలు పెట్టడానికి ఇంటికి వచ్చిన పార్వతి సీన్ తో మొదలవుతుంది. ఆమెను ప్రభావతి దారుణంగా అవమానిస్తుంది. 50 తులాల బంగారం తెచ్చారా అని వెటకారంగా అడుగుతుంది.

తల్లిపై రవి కూడా మండిపడతాడు. అటు శృతి కూడా ఇలా సంస్కారం లేకుండా ప్రవర్తిస్తున్నారేంటని ప్రశ్నిస్తుంది. ఆ తర్వాత బాలు, మీనాకు తాను తెచ్చిన బట్టలు, పండ్లు పెడుతుంది. వాళ్లు ఆమె ఆశీర్వాదం తీసుకుంటారు. చాలా ఖరీదైనవే తెచ్చారే.. ఎన్ని పూలు అమ్మితే వచ్చాయేంటి అని ప్రభావతి మళ్లీ నోటికి పని చెబుతుంది.

మీనాపై మండిపడిన ప్రభావతి, రోహిణి

బాలు తనకు పని ఉందని చెప్పి బయటకు వెళ్తాడు. ఇక అదే సమయంలో రోహిణి తండ్రి జైల్లో ఉన్న విషయం తెలిసి పార్వతి జాలి చూపిస్తుంది. తనకు తెలిసిన గుడిలో పూజలు చేస్తే అంతే మంచే జరుగుతుందని సలహా ఇస్తుంది. దీంతో ప్రభావతి నీ స్థాయి మరచిపోయి మాట్లాడుతున్నావంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.

పార్వతి వెళ్లిపోయిన తర్వాత ప్రభావతి, రోహిణి కలిసి మీనాపై మండిపడతారు. అత్తింట్లో విషయాలు పుట్టింట్లో చెప్పొద్దని ఎన్నిసార్లు చెప్పానని మీనాను తిడుతుంది. అటు రోహిణి కూడా వచ్చి మా నాన్న గురించి నువ్వు మీ అమ్మకు ఎందుకు చెప్పావని నిలదీస్తుంది. అయినా ఆమె నీ మంచి కోసమే చెప్పింది కదా.. అందులో తప్పేముంది అని మీనా అంటుంది.

పుట్టింటికి వెళ్దామన్న మీనా

ఆ తర్వాత బాలు గదిలో ఉన్న సమయంలో మీనా లోపలికి వెళ్తుంది. దీంతో తన తల్లిని అవమానించిన విషయాన్ని బాలుకి చెబుతుందేమో అని బయట నిలబడి కంగారు పడుతుంది ప్రభావతి. కానీ మీనా మాత్రం పార్వతి తీసుకొచ్చిన షర్ట్ చూపించి చాలా బాగుందని, ఇది వేసుకొనే రేపు పుట్టింటికి వెళ్దామని బాలుతో చెబుతుంది. కానీ బాలు మాత్రం వాళ్లనే ఇక్కడికి రమ్మనొచ్చు కదా.. అక్కడికి వెళ్తే చూడొద్దనుకున్న ముఖాలు కనిపిస్తాయని అంటాడు.

శివ గురించే కదా.. ఎప్పుడో జరిగిన విషయాన్ని ఇంకా ఎందుకు పట్టించుకుంటారు.. అయినా వాడు మీ బావమరిది.. వాడికి ఇప్పుడు అన్న, బావ, తండ్రి అన్నీ మీరే అని అని వెళ్లడానికి ఒప్పిస్తుంది. అటు బయటకు వచ్చిన తర్వాత ప్రభావతిని చూసి మీ గురించి ఏమీ చెప్పలేదు.. ఇంట్లో ప్రశాంతత ఉండాలని కోరుకుంటున్నాను.. మీరు మా అమ్మను అవమానించినా.. మీపై నాకు గౌరవమే అని మీనా అని వెళ్లిపోతుంది.

ఇంటికి సుశీల.. బాలు, మీనా పెళ్లి రోజు ప్లాన్

ఇంటికి సత్యం తల్లి సుశీల వస్తుంది. ఆమెను చూడగానే బాలు ఎత్తుకొని గిర్రున తిప్పుతాడు. ఆమె వచ్చీరాగానే బాలు, మీనా పెళ్లి రోజు అని తెలిసి వచ్చాను.. ఘనంగా సెలబ్రేట్ చేద్దామని అంటుంది. ఇప్పుడు ఫంక్షన్ ఎందుకు.. అంత ఖర్చు అవసరమా అని ప్రభావతి అంటుంది. కూలీనాలీ చేసుకునే వాళ్లు కూడా తొలి పెళ్లి రోజు జరుపుకుంటారని, మనకేం తక్కువ అని సుశీల క్లాస్ పీకుతుంది.

మౌనిక విషయంలో ప్రభావతి రచ్చ

అందరూ ఉన్నారని, ఈ వేడుకకు మౌనికను కూడా పిలిస్తే బాగుంటుందని సుశీల అంటుంది. దీంతో ఆమెను పిలిస్తే సంజూ ఏం గొడవ చేస్తాడో అని మీనా భయపడుతుంది. అందుకే సెలబ్రేషన్స్ అవీ వద్దని అంటుంది. ఎందుకు.. నా కూతురు ఇంటికి వస్తుందని వద్దంటున్నావా.. ఇప్పటి వరకూ వేడుక అనగానే తెగ మురిసిపోయావు.. నా కూతురిని పిలుద్దామనగానే వద్దంటున్నావ్ అంటూ ప్రభావతి రచ్చ రచ్చ చేస్తుంది. దీంతో మీనా సైలెంట్ అయిపోతుంది.

మౌనికను పిలిచిన ప్రభావతి, సుశీల

ఆ తర్వాత ప్రభావతి తన కూతురు మౌనికకు ఫోన్ చేసి బాలు, మీనా పెళ్లి రోజు వేడుకకు రమ్మని పిలుస్తుంది. కానీ మౌనిక మాత్రం ఆయనను అడిగి చెబుతానని అంటుంది. అప్పుడే సుశీల ఫోన్ తీసుకొని కచ్చితంగా రావాల్సిందే అని మౌనికకు గట్టిగా చెబుతుంది. అంతేకాదు ఆమె అత్తయ్యతోనూ మాట్లాడి వాళ్లను పంపించాలని అడుగుతుంది. ఆమె సరే అంటుంది.

పెళ్లి రోజు ఎలా సెలబ్రేట్ చేయాలా అని సత్యం, సుశీల, రవి, శృతి ప్లాన్ చేస్తుండగా.. మౌనిక ఇంటికి వస్తుంది. ఆమెను చూసి అందరూ వెళ్లి వెల్కమ్ చెబుతారు. కానీ వెనుకాలే వచ్చిన సంజూని ఎవరూ పట్టించుకోరు. దీంతో తాను వాచ్‌మన్ లా ఇక్కడే నిలబడ్డాను పట్టించుకోరా అంటూ అతడు మండిపడతాడు. సారీ బావ చూసుకోలేదు అని బాలు అంటాడు. దీంతో మరోసారి గొడవ జరిగేలే అనిపిస్తుంది. అప్పుడే గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024