ఫౌంటైన్ లో డెడ్ బాడీ.. ఓటీటీలోకి హాట్ బ్యూటీ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. ట్విస్ట్ వేరే లెవల్.. సెలీనా గోమెజ్ సిరీస్

Best Web Hosting Provider In India 2024

ఫౌంటైన్ లో డెడ్ బాడీ.. ఓటీటీలోకి హాట్ బ్యూటీ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. ట్విస్ట్ వేరే లెవల్.. సెలీనా గోమెజ్ సిరీస్

మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అయిదో సీజన్ స్ట్రీమింగ్ కు ముమూర్తం ఖరారైంది. ట్విస్ట్ లతో ఊపేసే ఈ సిరీస్ ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. ఇందులో హాలీవుడ్ హాట్ బ్యూటీ సెలీనా గోమెజ్ కూడా నటించింది. ఈ సిరీస్ ఏ ఓటీటీలోకి వస్తుందో చూద్దాం.

ఓటీటీలోకి మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్

డిజిటల్ ఆడియన్స్ కు మరోసారి థ్రిల్ పంచేందుకు సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ ‘ఓన్లీ మర్డర్స్ ఇన్ ది బిల్డింగ్’ కొత్త సీజన్ తో వచ్చేస్తోంది. ఈ మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ అయిదో సీజన్ ఓటీటీలో అడుగుపెట్టనుంది. ఇందులో హాలీవుడ్ హాట్ బ్యూటీ సెలీనా గోమెజ్ కూడా కీలక పాత్ర పోషించింది.

ఏ ఓటీటీలో?

మర్డర్ మిస్టరీ వెబ్ సిరీస్ ‘ఓన్లీ మర్డర్స్ ఇన్ ది బిల్డింగ్’ అయిదో సీజన్ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. ఈ సారి ఇందులో అదిరిపోయే ట్విస్ట్ లు ఉండబోతున్నాయి. ఈ సూపర్ హిట్ మర్టర్ మిస్టరీ కామెడీ సిరీస్ అయిదో సీజన్ జియోహాట్‌స్టార్‌లోకి రాబోతోంది. ఈ సిరీస్ సెప్టెంబర్ 9 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇండియన్ ఆడియన్స్ కూడా దీన్ని వీక్షించొచ్చు.

3 ఎపిసోడ్లు

‘ఓన్లీ మర్డర్స్ ఇన్ ది బిల్డింగ్’ వెబ్ సిరీస్ అయిదో సీజన్ లో సెప్టెంబర్ 3న ఫస్ట్ మూడు ఎపిసోడ్లు స్ట్రీమింగ్ అవుతాయి. ఆ తర్వాత ప్రతి వారం ఒక్కో ఎపిసోడ్ ఓటీటీలోకి వస్తుంది. ఈ మర్డర్ మిస్టరీ సిరీస్ తొలి నాలుగు సీజన్లు సూపర్ హిట్ గా నిలిచాయి. అయిదో సీజన్ కూడా ఆడియన్స్ ను అలరిస్తుందని మేకర్స్ నమ్ముతున్నారు.

ఫౌంటైన్లో మరణం

ఓన్లీ మర్డర్స్ ఇన్ ది బిల్డింగ్ వెబ్ సిరీస్ అయిదో సీజన్ లో ఆర్కోనియా డోర్ మ్యాన్ లెస్టర్ అనుమానాస్పద మరణం చుట్టూ కథ తిరుగుతుంది. ఒక విషాదకరమైన ట్విస్ట్ తో లెస్టర్ ఒకప్పుడు అదృష్టవంతుడిగా భావించిన ఫౌంటైన్లోనే మరణిస్తాడు. మరి ఈ మర్డర్ ఎవరు చేశారనే మిస్టరీని ఎలా సాల్వ్ చేశారన్నది ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ఇందులో చార్లెస్-హాడెన్ సావేజ్ గా స్టీవ్ మార్టిన్, ఒలివర్ పుట్నమ్ గా మార్టిన్ షార్ట్, మాబెల్ మోరాగా సెలీనా గోమెజ్ నటించారు.

కొత్త పాత్రలు

సీజన్ 5 లో మైఖేల్ సిరిల్ క్రైటన్ (హోవార్డ్), జాకీ హాఫ్మన్ (ఉమా), డా’వైన్ జాయ్ రాండాల్ఫ్ (డిటెక్టివ్ డోనా విలియమ్స్) వంటి సుపరిచిత ముఖాలు తిరిగి వస్తాయి. అంతే కాకుండా ఈ సీజన్ లో అనేక కొత్త పాత్రలు పరిచయమవుతాయి. జే ఫ్లూగ్ క్రిస్టోఫ్ వాల్ట్జ్ గా లోగాన్, లెర్మన్ గా బాష్ స్టెడ్. రెనీ జెల్వెగర్ గా-మేయర్ డయాన్ వైస్ట్ లెక్టర్ భార్యగా మేయర్ డయానే నటించారు.

పాత రహస్యాలు, అదిరిపోయే ట్విస్టుల కలయికతో ‘ఓన్లీ మర్డర్స్ ఇన్ ది బిల్డింగ్’ సీజన్ 5 కచ్చితంగా అలరించే అవకాశముంది.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024