




Best Web Hosting Provider In India 2024

ఏపీ ఐసెట్ కౌన్సెలింగ్ 2025 : నేటి నుంచి ఫైనల్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు – ముఖ్య తేదీలివే
ఏపీ ఐసెట్ కౌన్సెలింగ్ పై మరో అప్డేట్ వచ్చేసింది. తాజాగా ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రారంభమైంది. ఎంట్రెన్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు… ఇవాళ్టి నుంచి రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. ఈనెల 11వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది.
ఏపీ ఐసెట్ – 2025 అభ్యర్థులకు కీలక అప్డేట్ వచ్చేసింది. ఇప్పటికే ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ పూర్తి కాగా… ఇవాళ్టి నుంచి ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రారంభమైంది. అర్హులైన వాళ్లు… రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ గడువు సెప్టెంబర్ 6వ తేదీతో పూర్తవుతుంది.
ఏపీ ఐసెట్ కౌన్సెలింగ్ ద్వారా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఐసెట్‌లో ర్యాంకులు పొందిన విద్యార్థులకు మొదటి విడత కౌన్సెలింగ్ జులై 28న పూర్తయింది. ఫైనల్ విడత కౌన్సెలింగ్ ఆగస్టు 4న ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ వాయిదా పడింది. చాలా రోజుల తర్వాత… అధికారులు తాజాగా ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ను ప్రకటించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఐసెట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ లో భాగంగా 15వేలకుపైగా సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా 33 వేల సీట్లు మిగిలి ఉండగా.. ప్రస్తుతం సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ చేపట్టారు. ఈ విడత కూడా పూర్తి అయితే… స్పాట్ అడ్మిషన్లకు అవకాశం ఉంటుంది. దీనిపై అధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
ముఖ్య తేదీలు
- ప్రవేశ పరీక్ష – ఏపీ ఐసెట్ 2025
- ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్లు – సెప్టెంబర్ 3 నుంచి ప్రారంభం
- తుది గడువు – సెప్టెంబర్ 6
- సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రాసెస్ – సెప్టెంబర్ 4 నుంచి సెప్టెంబర్ 7 వరకు
- వెబ్ ఆప్షన్లు – సెప్టెంబర్ 5 నుంచి సెప్టెంబర్ 8 వరకు
- వెబ్ ఆప్షన్లు ఎడిట్ – సెప్టెంబర్ 9, 2025
- సెకండ్ ఫేజ్ సీట్ల కేటాయింపు – 11 సెప్టెంబర్ 2025
- సెల్ఫ్ రిపోర్టింగ్, కాలేజీలో రిపోర్టింగ్ – సెప్టెంబర్ 11 నుంచి సెప్టెంబర్ 13 వరకు అవకాశం ఉంటుంది.
- అధికారిక వెబ్ సైట్ – https://icet-sche.aptonline.in/ICET
అభ్యర్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. సీట్లు పొందే విద్యార్థులు ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేసి కన్ఫర్మ్ చేసుకోవాలి. లేకపోతే సీటు కేటాయింపును రద్దు చేస్తారు. https://cets.apsche.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
ఏపీలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఐసెట్ -2025 నిర్వహించారు. మే 20 వ తేదీన ఫలితాలను విడుదల చేశారు. ఈసారి ఐసెట్ ప్రవేశ పరీక్ష బాధ్యతలను ఆంధ్రా యూనివర్సిటీ చేపట్టింది.
మే 7న రాష్ట్రంలోని 94 పరీక్ష కేంద్రాల్లో ఐసెట్ నిర్వహించారు. ఐసెట్ ఫలితాలను https://cets.apsche.ap.gov.in/ICET/ లింక్ లో తెలుసుకోవచ్చు. మొత్తం 34,131 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా…. 32,719 మంది(95.86%) విద్యార్థులు ఐసెట్ పరీక్షలో అర్హత సాధించారు.
సంబంధిత కథనం
టాపిక్