ఓటీటీలోకి మనీ హీస్ట్ క్రియేటర్ రూపొందించిన మరో క్రేజీ సిరీస్.. పైన విధ్వంసం.. బంకర్ లో విలాసం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Best Web Hosting Provider In India 2024

ఓటీటీలోకి మనీ హీస్ట్ క్రియేటర్ రూపొందించిన మరో క్రేజీ సిరీస్.. పైన విధ్వంసం.. బంకర్ లో విలాసం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఓటీటీలోకి మరో అదిరిపోయే సిరీస్ వస్తుంది. ప్రపంచంలోనే పాపులర్ సిరీస్ మనీ హీస్ట్ క్రియేటర్ల నుంచి ఓ కొత్త వెబ్ సిరీస్ ఓటీటీలో రిలీజ్ కానుంది. డిజిటల్ స్ట్రీమింగ్ కు రెడీ అయింది.

ఓటీటీలోకి మరో థ్రిల్లర్ వెబ్ సిరీస్ (x)

ఓటీటీలోకి మరో క్రేజీ వెబ్ సిరీస్ రాబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న మనీ హీస్ట్ సిరీస్ క్రియేటర్లు రూపొందించిన కొత్త వెబ్ సిరీస్ డిజిటల్ ఆడియన్స్ ముందుకు వస్తుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ వెబ్ సిరీస్ రెడీ అయింది. మూడో వరల్డ్ వార్ జరుగుతుంటే బంకర్ లో దాచుకునే విలాసవంతమైన కుటుంబాల కథతో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. ఈ సిరీస్ పేరు ‘బిలియనీర్స్ బంకర్’. ఇదో క్రైమ్ మిస్టరీ రొమాన్స్ సైంటిఫిక్ థ్రిల్లర్.

ఏ ఓటీటీలో?

క్రైమ్ మిస్టరీ రొమాన్స్ సైంటిఫిక్ థ్రిల్లర్ గా రెడీ అయిన ‘బిలియనీర్స్ బంకర్’ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తోంది. ఈ క్రేజీ వెబ్ సిరీస్ సెప్టెంబర్ 19 నుంచి ఓటీటీలో అందుబాటులోకి రానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో ఇది స్ట్రీమింగ్ కానుంది. సెప్టెంబర్ 19 నుంచి ఓటీటీ ఆడియన్స్ ను అలరించేందుకు ఈ సిరీస్ రెడీ అయింది.

8 ఎపిసోడ్లు

బిలియనీర్స్ బంకర్ వెబ్ సిరీస్ తొలి సీజన్ లో 8 ఎపిసోడ్లున్నాయి. ఇవి ఒకేసారి ఓటీటీలోకి రిలీజ్ అయ్యే అవకాశముంది. ఫేమస్ సిరీస్ మనీ హీస్ట్ ను క్రియేట్ చేసిన మార్టినెజ్ లొబాటో, అలెక్స్ పినా ఈ బిలియనీర్స్ బంకర్ కు రూపం పోశారు. మనీ హీస్ట్ తరహాలోనే ఈ సిరీస్ కూడా ఆడియన్స్ ను అట్రాక్ట్ చేసే అవకాశముంది.

కథ ఏమిటంటే?

గ్లోబల్ కాన్ ఫ్లిక్ట్ కారణంగా మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది. ఈ వరల్డ్ వార్ 3లో ప్రపంచ దేశాలు హోరాహోరీగా తలపడతాయి. కోట్లాది ప్రజలు ప్రాణాలు కోల్పోతారు. అణు బాంబు దాడులతో భూమి దద్దరిల్లుతుంది. ఈ పరిస్థితుల్లో బిలియనీర్ కుటుంబాల కోసం ఓ బంకర్ ను అందుబాటులోకి తెస్తారు.

బంకర్ లోనే అన్నీ

భూమి లోపల ఉండే ఆ బంకర్ లోకి బిలియనీర్ కుటుంబాలకు మాత్రమే ఎంట్రీ ఉంటుంది. ఆ బంకర్ లోనే అన్నీ ఉంటాయి. బాస్కెట్ బాల్ కోర్టు, రెస్టారెంట్, జెన్ గార్డెన్, కాక్ టెయిల్ బార్, సైకాలజిస్ట్ కోచ్, జిమ్ అండ్ స్పా.. ఇలా బంకర్ లో అన్ని సౌకర్యాలుంటాయి. అక్కడ ఉండే స్క్రీన్ల నుంచి పైన జరిగే విధ్వంసాన్ని చూస్తుంటారు. మధ్యలో లవ్, రొమాన్స్ కూడా ఉంటుంది.

అయితే బంకర్ లో ఉన్న రెండు శత్రు కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు ఉత్కంఠ రేపుతుంది. మరి ఈ రెండు ఫ్యామిలీల కారణంగా బంకర్లో ఏం జరిగింది? చివరకు వీళ్లు బయటకు వచ్చారా? లేదా? అనేదే కథ. ఈ సిరీస్ ను నెట్‌ఫ్లిక్స్ లో చూడొచ్చు.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024