





Best Web Hosting Provider In India 2024

థియేటర్లలో లోకా రచ్చ.. ఇలాంటి ఇండియన్ సూపర్ హీరో మూవీస్ ఇవే.. ఓటీటీలోని ఈ టాప్ థ్రిల్లర్లపై ఓ లుక్కేయండి
థియేటర్లలో ఫస్ట్ మలయాళీ ఫీమేల్ సూపర్ హీరో ఫిల్మ్ గా వచ్చిన లోకా ఛాప్టర్ 1 చంద్ర సినిమా అదరగొడుతోంది. కలెక్షన్ల రికార్డులు తిరగరాస్తోంది. ఓటీటీలో ఇలాంటి ఇండియన్ సూపర్ హీరో మూవీస్ చాలానే ఉన్నాయి. వీటిలో టాప్ లో ఉన్న ఈ సినిమాలు ఏ ఓటీటీలో ఉన్నాయో చూసేయండి.
సూపర్ హీరో మూవీస్ అంటే అందరికీ వెంటనే సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, అవెంజర్స్ లాంటి ఇంగ్లీష్ సినిమాలే గుర్తుకొస్తాయి. ఎందుకంటే హాలీవుడ్ నుంచే ఆ తరహా మూవీస్ ఎక్కువగా వస్తాయి. కానీ ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ సూపర్ హీరో సినిమాలు అదరగొడుతున్నాయి. మనదైన సూపర్ హీరో మూవీస్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాయి. ప్రజెంట్ లోకా చాప్టర్ 1 చంద్ర థియేటర్లలో సత్తాచాటుతోంది. ఇలాంటి ఇండియన్ టాప్ సూపర్ హీరో మూవీస్ ఏ ఓటీటీలో ఉన్నాయో చూసేయండి.
హను మాన్
ఇది అచ్చ తెలుగు సూపర్ హీరో మూవీ. మనదైన సూపర్ హీరో సినిమా ‘హను మాన్’. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తేజ సజ్జా హీరోగా యాక్ట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సత్తాచాటింది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరినీ అలరించింది. రుధిర మణితో హీరోకు సూపర్ పవర్స్ వస్తాయి. ఆ మణి కోసం విలన్ వస్తాడు. చివరకు ఏం జరిగిందన్నదే కథ. ఇందులో విజువల్ ఎఫెక్ట్స్ అదిరిపోయాయి. ఇది జియోహాట్‌స్టార్, జీ5 ఓటీటీల్లో ఉంది.
మిన్నల్ మురళీ
ఇండియన్ సూపర్ హీరో సినిమాల్లో అత్యుత్తమ వాటిల్లో ఒకటిగా పేరు తెచ్చుకుంది ‘మిన్నల్ మురళీ’. ఈ మలయాళ సూపర్ హీరో మూవీకి అందరి నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఆకాశంలో నుంచి వచ్చిన మెరుపు కారణంగా సూపర్ పవర్స్ వస్తాయి. విలన్ కు కూడా అలాంటి పవర్స్ ఉంటాయి. ఈ ఇద్దరు తలపడితే వేరే లెవల్ లో ఉంటుంది. మరి చివరకు ఎవరు గెలిచారన్నది చూడాలి. ఇందులో టొవినో థామస్ హీరో. ఇది నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
మావీరన్
తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ లీడ్ రోల్ ప్లే చేసిన సూపర్ హీరో మూవీ ‘మావీరన్’. కంటికి కనిపించని శక్తి, చెవిలో మాత్రమే వినిపించే వాయిస్ తో హీరో ఏం చేశాడన్నదే కథ. కార్టూనిస్ట్ అయిన హీరో వేసిన ఓ కామిక్ క్యారెక్టర్ వాయిస్ అతని చెవిలో వినపడుతూనే ఉంటుంది. న్యాయం కోసం ఆ వాయిస్ సాయంతో పోరాడతాడు హీరో. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉంది.
భవేశ్ జోషి సూపర్ హీరో
రియలిస్టిక్ సూపర్ హీరోలా అనిపించే స్టోరీతో వచ్చిన సినిమా ‘భవేశ్ జోషి సూపర్ హీరో’. ఈ హిందీ సినిమా ముగ్గురు స్నేహితుల చుట్టూ సాగుతుంది. వీళ్లు మాస్కులు వేసుకుని తమ యూట్యూబ్ ఛానెల్లో నగరంలోని అవినీతి, తప్పులను చూపిస్తారు. కానీ ఓ స్కామ్ బయటపెట్టే క్రమంలో తన ఫ్రెండ్ చనిపోవడంతో భవేశ్ రివేంజ్ తీర్చుకోవడానికి ఏం చేశాడన్నది కథ. ఇందులో భవేశ్ గా ప్రియాన్షు నటించాడు. దీన్ని నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో చూడొచ్చు.
క్రిష్
ఇండియాలో సూపర్ హీరో మూవీ అనగానే గుర్తుకొచ్చే సినిమాల్లో క్రిష్ ఫ్రాంఛైజీ ముందు ప్లేస్ లో ఉంటుంది. గ్రహాంతర వాసి నుంచి పవర్స్ తండ్రి నుంచి కొడుక్కి ట్రాన్స్ ఫర్ అవుతాయి. ఒక్కో సీక్వెల్ లో ఒక్కో విలన్, ప్రాబ్లెమ్ ను క్రిష్ సాల్వ్ చేస్తాడు. ఇండియాలో పాపులర్ సూపర్ హీరో ఫ్రాంఛైజీ ఇది. ఇందులో మూడో పార్ట్ అయిన క్రిష్ 3 మూవీ సోనీ లివ్ లో ఉంది. క్రిష్ గా హృతిక్ రోషన్ చేసే పోరాటాలు చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకూ అందరినీ ఎంటర్ టైన్ చేస్తున్నాయి.
సంబంధిత కథనం