




Best Web Hosting Provider In India 2024

జూబ్లీహిల్స్ బైపోల్ పై ఈసీ కసరత్తు – ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల
జూబ్లిహిల్స్ ఉపఎన్నికపై ఈసీ ఫోకస్ పెట్టింది. జూబ్లీహిల్స్ పరిధిలో 3,92,669 మంది ఓటర్లు ఉన్నట్లు వెల్లడించింది. మూసాయిదా జాబితాపై అభ్యంతరాలు, మార్పులు, చేర్పులు ఉంటే ఈ నెల 17 వరకు దరఖాస్తులు సూచించింది.
త్వరలోనే జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉపఎన్నికలు జరగనున్నాయి. మాగంటి గోపినాథ్ మృతితో ఈ స్థానానికి ఎన్నికలు జరగాల్సి ఉంది. ఏ క్షణమైనా ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం…. తాజాగా ఓటర్ల ముసాయిదా జాబితాను విడుదల చేసింది.
ఓటర్ల సంఖ్య 3.92 లక్షలు….
ఎన్నికల సంఘం విడుదల చేసిన ముసాయిదా జాబితా ప్రకారం… జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో 3,92,669 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 2,04,288 మంది పురుషులు కాగా…. 1,88,356 మంది మహిళలు ఉన్నారు. ఈ ముసాయి జాబితాపై అభ్యంతరాలు, మార్పులు, చేర్పులు ఉంటే సెప్టెంబర్ 17 వరకు అప్లికేషన్లు ఇవ్వొచ్చు.
ఇక మార్పులు చేర్పులు మాత్రమే కాకుండా… కొత్తగా ఓటు నమోదు కూడా చేసుకునే వీలు ఉందని ఈసీ తెలిపింది. వచ్చిన అభ్యంతరాలను సెప్టెంబర్ 29వ తేదీ వరకు పరిశీలిస్తారు. సెప్టెంబర్ 30వ తేదీన తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. ఉపఎన్నిక కోసం 407 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు.
ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో పోలింగ్ శాతం 47.49 నమోదైంది. ఈ నియోజకవర్గం నుంచి మాగంటి గోపీనాథ్ వరుసగా 3 పర్యాయాలు విజయం సాధించారు. 2023 ఎన్నికల్లో మాగంటి 80,549 ఓట్లు సాధించగా… సమీప కాంగ్రెస్ అభ్యర్థి అజాహరుద్దీన్కు 64,212 ఓట్లు దక్కిన సంగతి తెలిసిందే.
టాపిక్