





Best Web Hosting Provider In India 2024

సువర్ణ మాయలో దెయ్యంగా మారిన అనుపమ పరమేశ్వరన్.. కిష్కింధపురి ట్రైలర్ రిలీజ్.. భయపెడుతున్న హారర్ థ్రిల్లర్
అనుపమ పరమేశ్వరన్ దెయ్యంగా మారింది. ఆమె లీడ్ రోల్లో నటించిన కిష్కింధపురి మూవీ ట్రైలర్ బుధవారం (సెప్టెంబర్ 3) రిలీజైంది. ఈ హారర్ థ్రిల్లర్ మూవీ ట్రైలర్ తోనే భయపెట్టగా.. వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
అనుపమ పరమేశ్వరన్, బెల్లంకొండ శ్రీనివాస్ లీడ్ రోల్స్ లో నటించిన హారర్ థ్రిల్లర్ మూవీ కిష్కింధపురి (Kishkindhapuri). ఈ సినిమా సెప్టెంబర్ 12న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే వచ్చిన మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ భయపెట్టగా తాజాగా వచ్చిన ట్రైలర్ మూవీ స్టోరీ ఏంటన్నదానిపై ఓ స్పష్టత ఇచ్చింది. మరి ఈ ట్రైలర్ ఎలా ఉందో చూడండి.
కిష్కింధపురి ట్రైలర్ ఎలా ఉందంటే?
కిష్కింధపురి ఓ సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ మూవీ. ఈ సినిమా ట్రైలర్ బుధవారం (సెప్టెంబర్ 3) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ ట్రైలర్ భయపెట్టేలా సాగింది. ఓ పాడుబడిన దెయ్యాల కొంప, అందులో దెయ్యం గురించి తెసుకోవాలన్న ఆసక్తి ఉండే కొందరు వ్యక్తులు.. ఇలా సాగిపోయింది. ఊరికి ఉత్తరాన, దారికి దక్షిణాన, పశ్చిమ దిక్కున ప్రేతాత్మలు అంటూ ట్రైలర్ ఆ ఇంటి గురించి చెబుతూ మొదలైంది.
ఆ తర్వాత దెయ్యాలపై క్యూరియాసిటీ ఉండే కొందరిని దెయ్యాల కొంపలో ఉంచుతారని చెబుతారు. ఆ వెంటనే సువర్ణ మాయ అనే అక్కడి పాడుబడిన ఇంటిని చూపిస్తారు. అందులోకి మూవీలో లీడ్ రోల్స్ పోషించిన అనుపమ, బెల్లంకొండ శ్రీనివాస్ తోపాటు మరికొందరు వెళ్తారు. మొదట్లో అసలు అక్కడ ఏమీ లేదని వాళ్లు భావిస్తారు. కానీ తర్వాత వరుసగా జరిగే ఘటనలు వారిని భయబ్రాంతులకు గురి చేస్తాయి.
చివరికి అనుమప కూడా ఓ దెయ్యంలా మారినట్లుగా ట్రైలర్ లో చూపించారు. దీంతో ఈ సినిమాలో ఆమె పాత్రపై ఆసక్తి నెలకొంది. రెండు నిమిషాలకు పైగా నిడివి ఉన్న ఈ ట్రైలర్ లో బీజీఎం కూడా ఆకట్టుకునేలానే సాగింది.
కిష్కింధపురి మూవీ గురించి..
కిష్కింధపురి సినిమాను కౌశిక్ పెగళ్లపాటి డైరెక్ట్ చేశాడు. ఇక షైన్ స్క్రీన్స్ బ్యానర్లు సాహు గారపాటి మూవీని నిర్మించాడు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, బెల్లంకొండ శ్రీనివాస్ తోపాటు తనికెళ్ల భరణి, మకరంద్ దేశ్‌పాండే, హైపర్ ఆదిలాంటి వాళ్లు కూడా నటించారు. ఈ సినిమా సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మధ్యే పరదా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా సక్సెస్ అందుకోని అనుపమ.. ఇప్పుడు హారర్ థ్రిల్లర్ జానర్లో వస్తున్న కిష్కింధపురిపై ఆశలు పెట్టుకుంది.
సంబంధిత కథనం