ఇక ఆదివారం కూడా జీ తెలుగు సీరియల్స్.. సాయంత్రం 6 నుంచి రాత్రి 9 వరకు నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్

Best Web Hosting Provider In India 2024

ఇక ఆదివారం కూడా జీ తెలుగు సీరియల్స్.. సాయంత్రం 6 నుంచి రాత్రి 9 వరకు నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్

Hari Prasad S HT Telugu

జీ తెలుగు సీరియల్స్ ఫాలో అయ్యే వారికి ఓ గుడ్ న్యూస్. ఆ ఛానెల్ వారంలో ఏడు రోజులూ సీరియల్స్ టెలికాస్ట్ చేయనుంది. అంటే ఆదివారం కూడా ఈ సీరియల్స్ ప్రసారం కానున్నాయి. మరి ఏయే సీరియల్స్ సండే కూడా రానున్నాయో చూడండి.

ఇక ఆదివారం కూడా జీ తెలుగు సీరియల్స్.. సాయంత్రం 6 నుంచి రాత్రి 9 వరకు నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్

జీ తెలుగు సీరియల్స్ అభిమానులకు ఇక పండగే. ఆ ఛానెల్ మరోసారి ఆదివారం కూడా సీరియల్స్ ను టెలికాస్ట్ చేయబోతోంది. ఈ విషయాన్ని జీ తెలుగు అనౌన్స్ చేసింది. ప్రైమ్ టైమ్ సీరియల్స్ మాత్రమే వారం రోజుల పాటు ప్రసారం అవుతాయి. అంటే సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు టెలికాస్ట్ అయ్యే సీరియల్స్ ఆదివారం కూడా వస్తాయి.

ఆదివారం కూడా సీరియల్స్

తమ ఛానెల్లో టెలికాస్ట్ అవుతున్న టాప్ రేటెడ్ సీరియల్స్ ఇక వారం రోజులూ ప్రసారమవుతాయని జీ తెలుగు వెల్లడించింది. ఆదివారం కూడా ప్రసారమయ్యే సీరియల్స్ జాబితాలో నిండు నూరేళ్ల సావాసం, పడమటి సంధ్యారాగం, లక్ష్మీ నివాసం, మేఘసందేశం, జయం, చామంతి సీరియల్స్ ఉన్నాయి.

ఆ సీరియల్స్ ప్రతి రోజూ ఏ సమయానికి వస్తాయో అదే సమయానికి సోమవారం నుంచి ఆదివారం వరకు అసలు గ్యాప్ లేకుండా టెలికాస్ట్ కానున్నట్లు జీ తెలుగు ఛానెల్ తెలిపింది. తమ టాప్ సీరియల్స్ రేటింగ్ మరింత పెంచుకోవడంతోపాటు అసలు గ్యాప్ లేకుండా ఈ సీరియల్స్ తో ప్రేక్షకులకు వినోదాన్ని పంచడమే లక్ష్యంగా ఆ ఛానెల్ ముందుకు సాగుతోంది.

సీరియల్స్ టైమింగ్స్ ఇలా..

ఇన్ని రోజులూ ఈ జీ తెలుగు సీరియల్స్ సోమవారం నుంచి శనివారం వరకు మాత్రమే టెలికాస్ట్ అయ్యేవి. కానీ ఆదివారం కూడా ప్రైమ్ టైమ్ లో ఎంటర్టైన్మెంట్ షోలకు బదులు సీరియల్స్ నే ప్రసారం చేయాలని ఆ ఛానెల్ నిర్ణయించింది.

నిండు నూరేళ్ల సావాసం సాయంత్రం 6 గంటలకు, పడమటి సంధ్యారాగం సాయంత్రం 6.30 గంటలకు, లక్ష్మీ నివాసం సాయంత్రం 7 గంటలకు, మేఘసందేశం రాత్రి 7.30 గంటలకు, జయం రాత్రి 8 గంటలకు, చామంతి రాత్రి 8.30 గంటలకు ప్రసారమవుతాయి.

ఈ ఛానెల్లో ఈ సీరియల్స్ కే మెరుగైన రేటింగ్స్ వస్తుండటంతో వీటిని ఆదివారం కూడా టెలికాస్ట్ చేయాలని నిర్ణయించినట్లు ఆ ఛానెల్ తెలిపింది. ఇక మధ్యాహ్నం సమయంలో వచ్చే సీరియల్స్ మాత్రం శనివారం వరకే టెలికాస్ట్ అవుతాయి.

టీఆర్పీ రేటింగ్స్ లో టాప్ 10 తెలుగు సీరియల్స్ లో 4 జీ తెలుగు సీరియల్స్ ఉన్నాయి. మేఘసందేశం, పడమటి సంధ్యారాగం, జయం, చామంతి సీరియల్స్ ఈ లిస్టులో ఉన్నాయి. ఇక నుంచి ఇవి ఆదివారం కూడా రానుండటంతో వీటి రేటింగ్ మరింత మెరుగవుతుందని భావిస్తున్నారు.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024