




Best Web Hosting Provider In India 2024

గణేష్ నిమజ్జనం సందర్భంగా ఈ ప్రాంతాల్లో సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం!
గణేష్ నిమజ్జనం సందర్భంగా పలు ప్రాంతాల్లో సెలవు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు సీఎస్ రామకృష్ణారావు ఆదేశాలు జారీ చేశారు.
గణేష్ నిమజ్జనం సందర్భంగా పలు ప్రాంతాల్లో తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ట్రాఫిక్ రద్దీ, ఇతర కారణాల దృష్ట్యా ప్రతీ సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా హాలీడే ఇచ్చింది. గణేష్ విగ్రహాల నిమజ్జన ఊరేగింపు దృష్ట్యా జంట నగరాలైన హైదరాబాద్, సికింద్రాబాద్‌తోపాటు రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు 06-09-2025(శనివారం) సాధారణ సెలవు దినంగా ప్రకటించింది.
అయితే శనివారం సెలవు ప్రకటించిన కారణంగా 11 అక్టోబర్ 2025న రెండో శనివారం పనిదినంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జంట నగరాలు హైదరాబాద్, సికింద్రాబాద్‌తోపాటుగా రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు తెరిచే ఉంటాయి. ఈ మేరకు సీఎస్ కె.రామకృష్ణారావు ఆదేశాలు జారీ చేశారు.
మరోవైపు ఖైరతాబాద్ మహా గణపతి సెప్టెంబర్ 6వ తేదీనే శోభాయాత్ర నిర్వహించి, నిమజ్జనం పూర్తి చేయనున్నట్లు ప్రకటించింది. జంట నగరాల్లో ఊరేగింపుపై పోలీస్ అధికారులు ఇప్పటికే తనిఖీలు చేశారు. బాలాపూర్ నుండి హుస్సేన్ సాగర్ వరకు గణేష్ ఊరేగింపు మార్గంలో బుధవారం అన్ని విభాగాల రూట్ తనిఖీ జరిగింది. ఈ బృందంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ.ఆనంద్, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన దాసరి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ తదితరులు ఉన్నారు.
నగరంలో విద్యుత్ షాక్ సంబంధిత మరణాలు నమోదవుతున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని గణేష్ విగ్రహాల నిర్వాహకులకు సూచించారు సీవీ.ఆనంద్. రాబోయే రోజుల్లో ఊరేగింపులు సజావుగా సాగేందుకు పోలీసులు, సంబంధిత విభాగాలు విస్తృతమైన ఏర్పాట్లు చేశాయని అన్నారు.
‘చివరి రోజున హుస్సేన్ సాగర్‌లో దాదాపు 25,000 విగ్రహాలను నిమజ్జనం చేసే అవకాశం ఉంది. నిమజ్జనానికి వీలుగా సరస్సు చుట్టూ తగినన్ని క్రేన్లను ఏర్పాటు చేశాం.’ అని సీవీ.ఆనంద్ చెప్పారు.
హైదరాబాద్ నగర పోలీసులు ఊరేగింపు బందోబస్త్ కోసం 29,000 మంది సిబ్బందిని మోహరిస్తున్నారు. మూడు షిఫ్టులలో పనిచేస్తారు.
టాపిక్