బిగ్ బాస్ తెలుగు 9 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ డేట్, టైమ్ ఇదే.. ఇక్కడ చూసేయండి

Best Web Hosting Provider In India 2024

బిగ్ బాస్ తెలుగు 9 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ డేట్, టైమ్ ఇదే.. ఇక్కడ చూసేయండి

Hari Prasad S HT Telugu

బిగ్ బాస్ తెలుగు 9 వచ్చేస్తోంది. నాగార్జున మరోసారి హోస్ట్ గా ఈసారి రణరంగమే అంటూ మరింత కొత్తగా రాబోతోంది. ఈసారి సెలబ్రిటీలతోపాటు సామాన్యులు కూడా హౌస్ లోకి వస్తుండటం విశేషం. మరి ఈ షో ఎప్పుడు, ఎక్కడ చూడాలో తెలుసుకోండి.

బిగ్ బాస్ తెలుగు 9 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ డేట్, టైమ్ ఇదే.. ఇక్కడ చూసేయండి

బిగ్ బాస్ తెలుగు 9 ప్రీమియర్ కాబోతోంది. ఈ రియాలిటీ టీవీ షో 9వ సీజన్ తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ షోకి నాగార్జున మళ్ళీ హోస్ట్ గా వస్తున్నారు. మొదటిసారిగా ఈ సీజన్లో ఫిల్మ్, టీవీ ఇండస్ట్రీ వాళ్లతో పాటు సామాన్య ప్రజలు కూడా హౌస్ మేట్స్ గా ఉంటారు. ఈ నెలలో షో ప్రీమియర్ ఎప్పుడు, ఎక్కడ, ఏ టైంకి చూడచ్చో తెలుసుకోండి.

బిగ్ బాస్ తెలుగు 9 ఎప్పుడు, ఎక్కడ చూడాలి?

బిగ్ బాస్ తెలుగు 9 ప్రీమియర్ ఈ వచ్చే ఆదివారం అంటే సెప్టెంబర్ 7 సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దీనిని స్టార్ మాలో చూడవచ్చు. జియో హాట్‌స్టార్‌లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. మరో నాలుగు రోజుల్లో అంటూ బుధవారం (సెప్టెంబర్ 3) ఈ బిగ్ బాస్ కొత్త సీజన్ గురించి జియోహాట్‌స్టార్ తెలుగు ట్వీట్ చేసింది.

“నాలుగు సన్ సెట్స్ తర్వాత బిగ్ బాస్ హౌజ్ బంధాల, నమ్మకద్రోహాల యుద్ధరంగం అవుతుంది. స్నేహాలు చెదిరిపోతాయి. విధిని మరోసారి రాయాల్సి వస్తుంది. సెప్టెంబర్ 7 సాయంత్రం 7 గంటలకు స్టార్ మాలో మాత్రమే.. బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ లాంచ్ మిస్ అవ్వకండి” అని జియో హాట్‌స్టార్ తెలుగు అధికారిక ఎక్స్ హ్యాండిల్ ట్వీట్ చేసింది.

ఈ సందర్భంగా వాళ్ళు ఒక ప్రోమో కూడా రిలీజ్ చేశారు. అందులో నాగార్జున ఈ షో ఎంత ప్రెడిక్టబుల్‌గా ఉండబోతుందో చెప్పారు. ఒక ప్రోమోలో ఈసారి బిగ్ బాస్ తెలుగులో కంటెస్టెంట్స్ ను ‘డబుల్ హౌస్, డబుల్ డోస్’ అనే ట్యాగ్‌లైన్‌తో రెండు వేర్వేరు ఇళ్లలో ఉంచుతారు. సామాన్య ప్రజలు, సెలబ్రిటీలు విడివిడిగా ఉంటారు అని చెప్పారు.

హౌస్‌లోకి సామాన్యులు

ఈ సంవత్సరం బిగ్ బాస్ తెలుగుకు ముందు మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ బిందు మాధవి, నవదీప్, అభిజిత్.. ఒక ప్రీ-షో అయిన అగ్నిపరీక్షకు జడ్జిలుగా వ్యవహరించారు. ఈ షోలో 45 మంది పార్టిసిపెంట్స్ పాల్గొన్నారు. వాళ్ళ మెంటల్, ఫిజికల్ ఎబిలిటీస్ ను వీళ్ళు టెస్ట్ చేశారు.

15 మంది కంటెస్టెంట్స్ ను సామాన్యులుగా హౌస్‌లోకి పంపడానికి ఎంచుకున్నారు. కానీ సడెన్ గా మరింత మందిని ఎలిమినేట్ చేశారు. కొద్ది మంది మాత్రమే మిగిలారు. ఆ 15 మంది కామనర్ల లిస్ట్‌లో మనీష్, ప్రియా, అనుష, శ్రీజ, పవన్, ప్రసన్న, శ్రేయ, షాకిబ్, శ్వేత, నాగ, కల్కి, పవన్ కళ్యాణ్, హరీష్, దివ్య, డాలియా ఉన్నారు. ఇప్పుడు దివ్య, ప్రసన్న, పవన్, శ్రేయ, అనుష, శ్వేత టాప్ సిక్స్ లోకి వెళ్లారు.

బిగ్ బాస్ తెలుగు మొదటి సీజన్ 2017లో జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా లాంచ్ అయ్యింది. 2018లో రెండో సీజన్‌కి నాని హోస్ట్ గా వచ్చారు. నాగార్జున 2019లో మూడో సీజన్ నుంచి షోకి హోస్ట్ గా ఉన్నారు.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024