





Best Web Hosting Provider In India 2024

శీలావతి పాత్రను ఎన్నో ఏళ్లు గుర్తు పెట్టుకుంటారు.. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చా.. నెగటివ్ పాత్ర చేయాలని ఉంది: అనుష్క
అనుష్క శెట్టి లీడ్ రోల్లో నటించిన ఘాటి మూవీ ఈ శుక్రవారం (సెప్టెంబర్ 5) రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా అనుష్క బుధవారం (సెప్టెంబర్ 3) మీడియాతో మాట్లాడింది. తాను పోషించిన ఈ శీలావతి పాత్రను చాలా ఏళ్లపాటు గుర్తు పెట్టుకుంటారని చెప్పింది.
అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ లో వేదం తర్వాత ఇప్పుడు ఘాటి రాబోతోంది. ఈ సినిమా మరో రెండు రోజుల్లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన అనుష్క ఎన్నో అంశాలపై తన అభిప్రాయాలను పంచుకుంది. తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఈ ఘాటి సినిమా చేసినట్లు ఆమె చెప్పింది.
శీలావతి పాత్ర మరచిపోరు
ఘాటి సినిమాలో తాను పోషించిన శీలావతి పాత్ర చాలా శక్తివంతమైనదని అనుష్క శెట్టి చెప్పింది. తాను గతంలో బాహుబలి, అరుంధతి, రుద్రమదేవి, భాగమతిలాంటి సినిమాల్లో పోషించిన పాత్రలలాంటిదే ఇది అని తెలిపింది. తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఈ సినిమా చేసినట్లు అనుష్క చెప్పింది. శీలావతి పాత్రను చాలా కాలంపాటు గుర్తు పెట్టుకుంటారని స్పష్టం చేసింది.
ఘాటితో ఓ కొత్త అనుభవం
ఘాటి మూవీ స్టోరీ తొలిసారి విన్నప్పుడు తన రియాక్షన్ గురించి కూడా అనుష్క చెప్పింది. క్రిష్, ఇంకా రైటర్ చింతకింది శ్రీనివాసరావు నాకు స్క్రిప్ట్ చెప్పినప్పుడు నాకు ‘ఘాటీ’ ప్రపంచంలోని కల్చర్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది.. లొకేషన్స్‌కి వెళ్ళిన తర్వాత మేము క్యారెక్టర్స్, కల్చర్ ఇంకా ల్యాండ్‌స్కేప్ పరంగా ఆడియన్స్ కి ఒక కొత్త అనుభవాన్ని ఇస్తున్నామని అనిపించింది అని అనుష్క తెలిపింది.
ఇక మూవీ కథ గంజాయి చుట్టూ తిరిగేది కావడంతో దాని ప్రభావం ఎలా ఉంటుందన్నదానిపైనా అనుష్క స్పందించింది. క్రిష్ ఎప్పుడూ సమాజానికి సంబంధించిన కథలనే తీసుకుంటారు.. గంజాయి వ్యాపారం ఇంకా స్మగ్లింగ్ ఇప్పుడు సమాజంలో చాలా పెద్ద సమస్యలు.. మేము ‘ఘాటీ’ని ఒక కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా, ఒక మెసేజ్‌తో తీశాం. ఈ సినిమా సమాజంలో మంచి ఫీలింగ్‌ను తీసుకొస్తుంది అని అనుష్క తెలిపింది.
సరోజ పాత్ర అడిగితే..
క్రిష్ తో కలిసి గతంలో వేదం మూవీలో సరోజ అనే వేశ్య పాత్రతో అనుష్క మంచి పేరు సంపాదించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అతనితో ఇప్పుడీ ఘాటి చేసింది. ఈ సినిమాపై ఉన్న అంచనాలను కచ్చితంగా అందుకుంటామన్న నమ్మకాన్ని ఆమె వ్యక్తం చేసింది. ‘వేదం’ లోని సరోజ క్యారెక్టర్ లాంటిది కావాలని అనుకున్నాను.. కానీ ఏదైనా కొత్తగా, సహజంగా వస్తే బాగుంటుందని అనుకున్నా. అప్పుడే ‘ఘాటీ’ కథ వచ్చింది. నాకు మంచి పాత్రలను ఇచ్చినందుకు నేను క్రిష్ కి ఎప్పుడూ రుణపడి ఉంటాను అని అనుష్క చెప్పింది.
ఇక ఆడియెన్స్ తనపై చూపిస్తున్న ప్రేమను ఎప్పటికీ మరచిపోలేనని కూడా ఆమె తెలిపింది. బాహుబలిలాంటి సినిమాలు ఇచ్చిన రాజమౌళిలాంటి వాళ్ల వల్లే తనుకు ఈరోజు ఈ స్థాయి ఆదరణ లభిస్తోందని చెప్పింది. ఇక తన దగ్గర ఇప్పుడు కొన్ని కొత్త సినిమాలు ఉన్నాయని, మలయాళంలోనూ ఓ మూవీ చేస్తున్నట్లు తెలిపింది. తెలుగులోనూ మరో సినిమాకు అంగీకరించినట్లు అనుష్క వెల్లడించింది.
తాను ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదవడాన్ని చాలా ఇష్టపడతానని అనుష్క చెప్పింది. ప్రస్తుతం మహాభారతం చదువుతున్నట్లు కూడా తెలిపింది. ఇక గత రెండేళ్లుగా తాను కుటుంబంతోనే ఎక్కువగా గడిపినట్లు చెప్పింది.
సంబంధిత కథనం