బ్రహ్మముడి టుడే ఎపిసోడ్: నీ ఫ్రెండే నీ అమ్మమ్మ- మేనల్లుడికి నిజం చెప్పిన రాజ్- అప్పు, కావ్య కడుపు పోయేలా రుద్రాణి ప్లాన్

Best Web Hosting Provider In India 2024

బ్రహ్మముడి టుడే ఎపిసోడ్: నీ ఫ్రెండే నీ అమ్మమ్మ- మేనల్లుడికి నిజం చెప్పిన రాజ్- అప్పు, కావ్య కడుపు పోయేలా రుద్రాణి ప్లాన్

Sanjiv Kumar HT Telugu

బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 4 ఎపిసోడ్‌లో దుగ్గిరాల ఇంటికి కనకం, కృష్ణమూర్తి వచ్చి పండుగకి కూతురు, అల్లుళ్లను ఇంటికి తీసుకెళ్తామంటారు. మీరు కూడా ఇక్కడికి వచ్చే పండగ జరుపుకోండి అని అపర్ణ చెబుతుంది. రేవతి ఇంటికి కావ్య, రాజ్ వెళ్తారు. స్వరాజ్‌కు అపర్ణ అమ్మమ్మ, తాను మావయ్య అని నిజం చెబుతాడు రాజ్.

బ్రహ్మముడి సీరియల్‌ సెప్టెంబర్ 4 ఎపిసోడ్

బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో వినాయక చవితిని గ్రాండ్‌గా చేసుకుందమామని చెబితే రుద్రాణి కౌంటర్స్ వేస్తుంది. దానికి కుక్కలు, జంతువులు తమకు నచ్చినట్లు చేసుకోవు. మనుషులకు మాత్రమే ఆ స్వభావం ఉంది అని కావ్య రివర్స్ కౌంటర్ ఇస్తుంది. దాంతో బాగా చెప్పావ్ అని ధాన్యం అంటే.. చెప్పడం కాదు బాగా గడ్డిపెట్టిందని ప్రకాశం అంటాడు.

మొదటి పండుగ

పాపం రుద్రాణి మాత్రం అటు జంతువుగా కాకుండా ఇటు మనిషిగా పుట్టింది. ఏం చేస్తుంది అని ఇందిరాదేవి మరింత సెటైర్లు వేస్తుంది. ఇంతలో కనకం, కృష్ణమూర్తి ఇంటికి వస్తారు. వినాయక చవితి వస్తుందిగా.. కూతుళ్లు కడుపుతో ఉన్నారు. మొదటి పండుగను మా ఇంట్లో జరుపుకోవాలనుకుంటున్నాం. అల్లుళ్లను తీసుకెళ్తాం అని కనకం అంటుంది.

ఇందిరాదేవి సరే అంటుంది. కానీ, ధాన్యలక్ష్మీ ఒప్పుకోదు. మీరే మా ఇంటికి పండుగకు వచ్చేయొచ్చు కదా అని అపర్ణ అంటుంది. దాంతో అంతా ఒప్పుకుంటారు. దుగ్గిరాల ఇంట్లోనే కనకం, కృష్ణమూర్తితో సహా వినాయక పూజ జరుపుకోవాలని డిసైడ్ చేస్తారు. ఇంతలో అందరూ సంతోషంగా ఉన్నారు. ఈ సమయంలోనే వదిన కూడా ఇక్కడ ఉంటే ఎంతో బాగుండేది అని బయటకు వెళ్తుంది కావ్య.

అది చూసిన రాజ్ కావ్య వెంట వెళ్లి ఏమైంది. అదోలా ఉన్నావని అడుగుతాడు. దాంతో తన ఊరిలో తన ఫ్రెండ్‌కు జరిగినట్లు రాజ్ అక్క రేవతి గురించి చెబుతుంది కావ్య. ఇంతకీ ఎవరు వాళ్లు అని రాజ్ అంటే.. మీ అక్క రేవతి అని చెబుతుంది కావ్య. మా అక్క నీకు ఎలా తెలుసు అని ఆరాటంగా అడుగుతాడు రాజ్. తన గురించి ఎంతో వెతికాను. నాకు దొరకలేదు అని రాజ్ అంటాడు.

రాజ్ అక్క గురించి చెప్పిన కావ్య

మీకు కూడా తన అడ్రెస్ తెలుసు. గతం మర్చిపోయినప్పుడు తన ఇంట్లో రెండు రోజులు ఉన్నారు. అక్క అని పిలిచారు. తన కొడుకుకి మీ పేరే స్వరాజ్ అని పెట్టుకుందని జరిగిందంతా చెబుతుంది కావ్య. ఇప్పుడు అక్కను వెంటనే ఇంటికి తీసుకురావాలి పదా అని రాజ్ అంటాడు. కావ్య ఆపుతుంది. ఇదివరకు ఓసారి తీసుకొస్తే అపర్ణ తిట్టి పంపించింది చెబుతుంది కావ్య.

అమ్మ ఎలా రియాక్ట్ అయిన సరే అక్కను ఇంటికి తీసుకురావాల్సిందే. రేపు పండుగ ఉందిగా. రేపు అక్కను ఇంటికి తీసుకొద్దాం. ముందు అక్కను చూద్దాం పద అని రాజ్ అంటాడు. కావ్య, రాజ్ ఇద్దరు బయలుదేరుతారు. మరోవైపు తన ఫ్రెండ్ అపర్ణ ఇంట్లో వినాయక చవితి జరుపుకుందామని స్వరాజ్ మారం చేస్తాడు. నేను ఉండలేనుగా అని రేవతి అంటుంది.

కూతురుగా వస్తే ఉండొచ్చుగా అని రాజ్ అంటాడు. రామ్ అని రేవతి అంటే.. రామ్ కాదు రాజ్ అని చెబుతాడు. ఆయన మాములు మనిషి అయ్యాడు అని కావ్య చెబుతుంది. దాంతో రాజ్‌ను హగ్ చేసుకుంటుంది రేవతి. నీకు గతం గుర్తుకు వస్తే నువ్ కూడా దూరమైపోతావేమో అని భయపడ్డాను అని రేవతి అంటుంది. నిన్ను ఆ ఇంటికి తీసుకెళ్దామని ఫిక్స్ అయ్యాం. రేపు గణేష్ పండుగకు వెళ్తున్నాం అని రాజ్ అంటాడు.

మీ ఫ్రెండే మీ అమ్మమ్మ

మా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నామా అని స్వరాజ్ అంటే.. రేయ్ మీ ఫ్రెండ్ కాదురా మీ అమ్మమ్మ అని రాజ్ అంటాడు. ఏంటీ మా ఫ్రెండే మా అమ్మమ్మనా అని స్వరాజ్ అంటాడు. ఈ రాజే మీ మావయ్య అని రాజ్ అంటే.. అయ్.. మావయ్య అని ఐలవ్యూ చెబుతాడు స్వరాజ్. తర్వాత రాజ్‌కు కావ్యకు ముద్దులు పెడతాడు స్వరాజ్. పండుక్కి తాను రాలేనని రేవతి చెబుతుంది.

ఈసారి తమ్ముడి మీద నమ్మకంతో రా.. అమ్మకు దూరం కాకుండా చూసుకుంటాను అని హామీ ఇస్తాడు రాజ్. రాజ్, కావ్య వెళ్లిపోతారు. రేవతి ఎమోషనల్ అవుతుంది. మరోవైపు హాస్పిటల్‌లో అప్పు బేబీ చాలా హెల్తీగా ఉందని డాక్టర్ చెబుతుంది. ఇంతలో కావ్య రిపోర్ట్స్ నర్స్ తీసుకొచ్చి ఇస్తుంది. రిపోర్ట్స్ చూసిన డాక్టర్ కావ్య గర్భసంచి చాలా వీక్‌గా ఉందని, 9వ నెల వరకు బిడ్డను మోయలేదని డాక్టర్ చెబుతుంది.

దాంతో అప్పు, కల్యాణ్ తెగ షాక్ అవుతారు. మరోవైపు కావ్యకు పాలు ఇచ్చి రాజ్ ప్రేమగా చూసుకుంటాడు. రాహుల్ కూతురే ఇంటికి వారసురాలు అవుతుంది. వాళ్లకు పిల్లలు పుట్టకుండే చేసే ఐడియా ఉందని రాహుల్‌తో రుద్రాణి చెబుతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024