



Best Web Hosting Provider In India 2024

118 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులకు సెప్టెంబర్ 12 నుంచి దరఖాస్తులు.. భారీగా జీతం!
తెలంగాణలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ నడుస్తోంది. ఈ ఉద్యోగాలకు సెప్టెంబర్ 12 నుంచి దరఖాస్తులు చేసుకోవాలి.
తెలంగాణలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ పోస్టులకు సెప్టెంబర్ 12వ తేదీ నుంచి దరఖాస్తు మెుదలుకానుంది. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు(టీఎస్ఎల్‌పీఆర్‌బీ) మెుత్తం 118 పోస్టులను భర్తీ చేయనుంది. సెప్టెంబర్ ఉదయం 8 గంటల నుంచి అక్టోబర్ 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తుల స్వీకరించనున్నారు.
తెలంగాణ క్రిమినల్ కోర్టుల్లో మూడేళ్లకు పైగా ప్రాక్టీస్ చేసిన న్యాయవాదులు ఈ పోస్టులకు అర్హులని టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ తెలిపింది. దరఖాస్తు చేసుకునేముందు నోటిఫికేషన్ జాగ్రత్తగా చదవాలని టీఎస్ఎల్‌పీఆర్‌బీ ఛైర్మన్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. లిగల్ అడ్వైజరీలు, లీగల్ కౌన్సిలర్లు, లా ఆఫీసర్లువంటి వారు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
అర్హతలు
ఈ పోస్టులకు అప్లై చేసుకునేవారు ఏదైనా బ్యాచిలర్ డిగ్రీతోపాటుగా ఎల్ఎల్‌బీ/బీఎల్ చేసి ఉండాలి. తెలంగాణ రాష్ట్రంలోని క్రిమినల్ కోర్టుల్లో కనీసం ప్రాక్టీసింగ్ అడ్వకేట్‌గా ఉండాలి. అభ్యర్థులు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. వయసు విషయానికి వస్తే.. 2025 జూలై 1 నాటికి 34 సంవత్సరాలు మించకూడదు. రాత పరీక్ష ఉంటుంది. జీతం నెలకు రూ.54,220 నుంచి 1,33,630 వరకు ఉంటుంది.
అర్హత కలిగిన అభ్యర్థులు www.tgprb.in లో అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.1000, ఇతరులకు రూ.2 వేలుగా నిర్ణయించారు.
గత నెల ప్రకటన
టీజీ ప్రాసిక్యూషన్ సర్వీస్ విభాగంలో పని చేయడానికి టీఎస్ఎల్‌పీఆర్‌బీ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ పోస్టుల భర్తీకి ఆగస్టులో ప్రకటన విడుదల చేసింది. మెుత్తం 118 పోస్టులను భర్తీ చేయనున్నారు. మల్టీజోన్ 1 డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కింద 38, లిమిటెడ్ రిక్రూట్‌మెంట్ కింద 12 పోస్టులు ఉన్నాయి. ఇక మల్టీజోన్ 2లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కింద 57, లిమిటెడ్ రిక్రూట్‌మెంట్ కింద 11 పోస్టులు ఉన్నాయి.
ఇక్కడ క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ చదవండి
టాపిక్