




Best Web Hosting Provider In India 2024

ఏపీలో స్థానిక పోరుకు శంఖారావం.. మూడు నెలల ముందుగానే ఎన్నికలు!
ఆంధ్రప్రదేశ్ స్థానిక పోరుకు సిద్ధమవుతోంది. మళ్లీ ఎన్నికలతో హడావుడి నెలకొననుంది. స్థానిక సంస్థల ఎన్నికలను మూడు నెలల ముందుగానే అంటే 2026 జనవరిలో నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ప్రణాళికలు వేస్తోంది.
ఆంధ్రప్రదేశ్ మరోసారి ఎన్నికలతో హీటెక్కనుంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం కసరత్తు మెుదలుపెట్టింది. మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం దగ్గరపడుతుండటంతో ఆ వైపుగా ఎన్నికల దిక్కు అడుగులు పడుతున్నాయి. ఐదు సంవత్సరాల పదవీకాలం ముగియడానికి మూడు నెలలు ముందుగానే ఎన్నికలు నిర్వహించాలని ఈసీ అనుకుంటోంది. ఇందుకోసం చట్టంలో ఉన్న వెసులుబాట్ల మేరకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించుకుంది.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని బుధవారం నాడు పంచాయతీ రాజ్, పురపాలక శాఖ కమిషనర్లకు లేఖలు రాశారు. ఎన్నికల సన్నాహక షెడ్యూల్‌ను పంపారు. నగరపాలక, పురపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో కార్పోరేటర్లు, కౌన్సిలర్ల పదవీకాలం వచ్చే ఏడాది మార్చితో ముగియనుంది. సర్పంచుల పదవీకాలం వచ్చే ఏడాది ఏప్రిల్‌తో అయిపోతుంది.
2021లో ఎన్నికలు జరిగిన 12 మున్సిపల్ కార్పొరేషన్స్, 75 మున్సిపాలిటీలు/నగర పంచాయతీల పాలకవర్గాల ఐదేళ్ల పదవికాలం వచ్చే ఏడాది మార్చి 17తో ముగుస్తుందని నీలం సాహ్ని తెలిపారు. మున్సిపల్ చట్టం ప్రకారం పదవీకాలం ముగిసేందుకు మూడు నెలల ముందు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. పంచాయతీల విలీనం, అప్‌గ్రేడేషన్ లాంటి పనులపై ఈలోపు దృష్టి పెట్టాలన్నారు.
అంతేకాదు ఎన్నికల సన్నాహకాలకు సంబంధించి షెడ్యూల్‌ను ఈసీ విడుదల చేసింది. 2025 అక్టోబర్ 15 నాటికి వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను పూర్తి చేయాలి. నవంబర్ 15వ తేదీ వరకు వార్డుల వారీగా ఓటర్ల జాబితాను రెడీ చేయాలి. నవంబర్ 30నాటికి పోలింగ్ కేంద్రాని ఖరారు చేయాల్సి ఉంటుంది. డిసెంబర్ 15వ తేదీ నాటికి రిజర్వేషన్ల ప్రక్రియ ముగించాలి. డిసెంబర్ చివరి వారంలో రాజకీయ పార్టీలతో సమావేశం. 2026 జనవరి నాటికి ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి, అదె నెలలో ఫలితాలు ఇచ్చి ఎలక్షన్ ప్రక్రియ పూర్తి చేయాలని ఎన్నికల సంఘం టార్గెట్ పెట్టుకుంది.
మున్సిపల్ ఎన్నికల తర్వాత 2026 జనవరి నుంచి గ్రామ పంచాయతీల ఎన్నికల ఏర్పాట్లకు, జూలై నుంచి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ఏర్పాట్లు చేయనున్నట్టుగా నీలం సాహ్ని తెలిపారు. న్యాయపరమైన చిక్కుల కారణంగా కొన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో ఎన్నికలు జరగాల్సి ఉందని గుర్తు చేశారు. 2021 నవంబర్‌లో ఎన్నికలు జరిగిన నెల్లూరు కార్పొరేషన్‌తో సహా మరో 12 స్థానిక సంస్థల పదవీకాలం వచ్చే ఏడాది నవంబర్‌తో ముగుస్తుందని లేఖలో ప్రస్తావించారు.
టాపిక్