వెయిటింగ్ ఓవర్- ఇవాళ ఓటీటీలోకి వచ్చేసిన మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్- స్టార్లతో నిండిన కన్నప్ప- ప్రభాస్ స్పెషల్ రోల్

Best Web Hosting Provider In India 2024

వెయిటింగ్ ఓవర్- ఇవాళ ఓటీటీలోకి వచ్చేసిన మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్- స్టార్లతో నిండిన కన్నప్ప- ప్రభాస్ స్పెషల్ రోల్

ఆడియన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూసిన రోజు వచ్చేసింది. ఆ టైమ్ కూడా రానే వచ్చింది. మంచు విష్ణు కలల ప్రాజెక్ట్ గా రూపొందిన మైథలాజికల్ థ్రిల్లర్ కన్నప్ప ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఇవాళ నుంచే డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.

ఓటీటీలోకి కన్నప్ప (x/PrimeVideoIN)

వెయిటింగ్ కు ఎండ్ కార్డు. ప్రభాస్ నుంచి కాజల్ వరకూ ఎంతో మంది స్టార్లు నటించిన మంచు విష్ణు మూవీ ‘కన్నప్ప’ (Kannappa) ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో విడుదలై ఫర్వాలేదనిపించుకున్న ఈ సినిమా ఇప్పుడు రెండు నెలల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇవాళ (సెప్టెంబర్ 4) ఓటీటీలో రిలీజైంది.

ఏ ఓటీటీలో?

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌‌గా తెరకెక్కిన ‘కన్నప్ప’ సినిమా ఓటీటీలోకి గురువారం అడుగుపెట్టింది. కన్నప్ప జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన ఈ మైథలాజికల్ థ్రిల్లర్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ మూవీ అందుబాటులో ఉంది. ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించాడు. కలెక్షన్స్ కింగ్ మోహన్ బాబు నిర్మించారు. తమిళ అందం ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా చేసింది.

కన్నప్పలో స్టార్లే స్టార్లు

కన్నప్పను భారీ స్థాయిలో నిర్మించారు మోహన్ బాబు. హీరోగా మంచు విష్ణు చేశాడు. అయితే ఈ సినిమాలో భారీ స్టార్ అట్రాక్షన్ ఉంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో పాటు మలయాళ స్టార్ మోహన్ లాల్, బాలీవుడ్ అగ్ర హీరో అక్షయ్ కుమార్, శరత్ కుమార్, చందమామ కాజల్ అగర్వాల్, మోహన్ బాబు, మధుబాల, బ్రహ్మానందం తదితర అగ్ర తారలు కీలక పాత్రలు పోషించారు.

కన్నప్ప థియేటర్ రెస్పాన్స్

భారీ అంచనాల మధ్య జూన్ 27న థియేటర్స్‌లో రిలీజైంది కన్నప్ప. కానీ హైప్ ను మాత్రం రీచ్ కాలేకపోయింది. మంచు విష్ణుకు తీవ్ర నిరాశను మిగిల్చింది. ఈ సినిమాకు షాకింగ్ కలెక్షన్లు వచ్చాయి. ఇప్పుడు ఈ మూవీ రెండు నెలల తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చింది.

కన్నప్ప కథ

కన్నప్పగా ప్రసిద్ధి చెందిన శివ భక్తుడి నిజ జీవిత గాథ ఇది. కన్నప్ప కథలోకి వెళితే.. అడవిలోని ఓ చిన్న గూడెంలో పుట్టి పెరిగిన తిన్నడు (మంచు విష్ణు) చిన్నతనంలోనే తల్లిని కోల్పోతాడు. తండ్రి నాథనాథుడు (శరత్ కుమార్) తిన్నడిని అల్లారుముద్దుగా పెంచుతాడు. కానీ చిన్నప్పుడే నాస్తికుడిగా మారిన తిన్నడు దేవుడు లేడని నమ్ముతాడు.

మరోవైపు వాయు లింగం దొంగిలించడానికి ముఠాలు సిద్ధమవుతాయి. గూడెం కు అండగా నిలబడే తిన్నడిని బయటకు వెలి వేయాల్సిన పరిస్థితి వస్తుంది. మరి ఆ తర్వాత ఏం జరిగింది? విలువిద్యలో సాటిలేని తిన్నడు గొప్ప శివ భక్తుడిగా ఎలా మారిపోయాడు? తిన్నడు అలా మారడానికి కారణమైన రుద్ర (ప్రభాస్) ఎవరు? శివుడి కోసం తిన్నడు చేసిన త్యాగం ఏంటీ? తిన్నడుకి కన్నప్పగా పేరు ఎలా వచ్చింది? అనేది తెలియాలంటే అమెజాన్ ప్రైమ్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్న కన్నప్ప సినిమాను చూడాల్సిందే.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024