





Best Web Hosting Provider In India 2024

ఎదుగుతుంటే కాళ్లు పట్టి కిందకు లాగే మనుషులు వీళ్లు, మీకు వార్నింగ్ ఇస్తున్నా:హీరోగా ఎంట్రీ ఇస్తున్న మౌళి తనూజ్ కామెంట్స్
ఓటీటీ సిరీస్ 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్‌తో ఫుల్ ఫేమస్ అయిన మౌళి తనూజ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సినిమా లిటిల్ హార్ట్స్. లిటిల్ హార్ట్స్ సెప్టెంబర్ 5న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన లిటిల్ హార్ట్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో మౌళి తనూజ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
“90s మిడిల్ క్లాస్ బయోపిక్” ఫేమ్ మౌళి తనూజ్, “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్ శివాని నాగరం లీడ్ రూల్స్‌లో నటించిన కామెడీ మూవీ “లిటిల్ హార్ట్స్”. ఈ సినిమాను ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్‌పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు.
సెప్టెంబర్ 5న లిటిల్ హార్ట్స్
“90s మిడిల్ క్లాస్ బయోపిక్” ఫేమ్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ “లిటిల్ హార్ట్స్” మూవీకి నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాను నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి థియేట్రికల్‌గా రిలీజ్ చేస్తున్నారు. “లిటిల్ హార్ట్స్” సినిమా ఈ నెల 5న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతోంది.
ఈ సందర్భంగా లిటిల్ హార్ట్స్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు యంగ్ హీరో శ్రీవిష్ణు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించిన లిటిల్ హార్ట్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోగా ఎంట్రీ ఇస్తోన్న మౌళి తనూజ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
నెగెటివ్ చేయాలని చూస్తున్నారు
హీరో మౌళి తనూజ్ మాట్లాడుతూ.. “లిటిల్ హార్ట్స్ సినిమాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. మీ వల్లే మా మూవీ ఇంతగా ఆడియెన్స్‌లోకి వెళ్తోంది. కానీ కొందరు సోషల్ మీడియాలో కావాలనే మా మూవీని నెగెటివ్ చేయాలని చూస్తున్నారు. నెగెటివ్ కామెంట్స్ రాస్తున్నారు” అని అన్నాడు.
మా మూవీ ద్వారా నవ్విస్తా
మా సినిమాను బాయ్ కాట్ చేయాలని అంటున్నారు. ఎప్పుడో నేను ఎవరినో ఏదో అన్నానని, వారి మీద కామెంట్ చేశానని చెబుతూ లిటిల్ హార్ట్స్ మూవీకి నెగిటివ్ చేస్తున్నారు. వీళ్లు మనలో ఒకరు ఎదుగుతుంటే కాళ్లు పట్టి కిందకు లాగే టైప్ మనుషులు. మీకు వార్నింగ్ ఇస్తున్నా. మిమ్మల్ని మా మూవీ ద్వారా నవ్విస్తా, మీ మనసులు గెలుచుకుంటా” అని మౌళి తనూజ్ కామెడీగా వార్నింగ్ ఇచ్చాడు.
ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసేలా
“మీ ఫ్యామిలీతో కలిసి మా సినిమాకు వచ్చి ఎంజాయ్ చేసేలా చేస్తాం. సో తప్పకుండా మా లిటిల్ హార్ట్స్ సినిమా చూసేందుకు థియేటర్స్‌కు రావాలని కోరుతున్నా” అని చెప్పుకొచ్చాడు హీరో మౌళి తనూజ్.
మ్యూజిక్ పరంగా
ఇదే ఈవెంట్‌లో మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ యెర్రమల్లి మాట్లాడుతూ.. “లిటిల్ హార్ట్స్ మూవీకి మిక్సింగ్ సహా మ్యూజిక్ పరంగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేశాం. ఇలాంటి ఒక మంచి మూవీకి వర్క్ చేసినందుకు హ్యాపీగా ఉంది. సక్సెస్ మీట్‌లో మళ్లీ డీటెయిల్‌గా మాట్లాడుతా” అని అన్నారు.
ఈటీవీ విన్ ఓటీటీ థ్యాంక్స్
డీవోపీ సూర్య బాలాజీ మాట్లాడుతూ.. “లిటిల్ హార్ట్స్ మూవీకి వర్క్ చేసే అవకాశం రావడం హ్యాపీగా ఉంది. మా సాయి మార్తాండ్ కాంప్రమైజ్ కాకుండా మూవీని రూపొందించాడు. నాకు సపోర్ట్ అందించిన ఈటీవీ విన్ ఓటీటీకి థ్యాంక్స్. మా కాస్ట్ అండ్ క్రూ అందరికీ ఈ సినిమా మంచి సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా” అని కోరారు.
సంబంధిత కథనం